
సాక్షి, హైదరాబాద్: టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్‌కు మరోసారి హైకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్‌లో ఉన్న నిబంధనలను తొలగించాలని ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది. పోలీసు స్టేషన్‌కు హాజరుకాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే ఇతర దేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని రవిప్రకాశ్ హైకోర్టును అభ్యర్థించారు. ఆయన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
టీవీ9 చానెల్‌లో పలు ఆర్ధిక అవకతవకలు, అక్రమాలకు పాల్పడినట్లు మాజీ సీఈవో రవిప్రకాష్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా టీవీ9 లోగోని పాతసామాను అమ్మేసినట్లు రూ. 99 వేలకి చిల్లరగా అమ్మేసిన కేసును ఆయన ఎదుర్కొంటున్నారు.