టీవీ9 రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేయండి | magistrate orders to file case on raviprakash | Sakshi
Sakshi News home page

టీవీ9 రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేయండి

Published Thu, Jun 19 2014 2:07 AM | Last Updated on Tue, Oct 2 2018 3:04 PM

టీవీ9 రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేయండి - Sakshi

టీవీ9 రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేయండి

*పోలీసులకు రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశం

రంగారెడ్డి జిల్లా కోర్టులు: తెలంగాణ ప్రజాప్రతినిధులను కించ పరిచే విధంగా కార్యక్రమాలను ప్రసారం చేసిన టీవీ-9 యజమాని రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేయాలని సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బుధవారం ఎల్‌బీనగర్ పోలీసులను ఆదేశించారు.

 

ఈ నెల 12న రాత్రి 8.30 గంటల సమయంలో ‘బుల్లెట్ న్యూస్’ పేరిట ప్రసారం చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచారంటూ స్థానిక న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ బుధవారం సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో సెక్షన్- 504, 506 భారతీయ శిక్ష్మాస్మృతి, 4ఏ, 6 కేబుల్ అండ్ నెట్‌వర్క్ యాక్ట్ ప్రకారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement