Metropolitan Magistrate
-
జ్యుడీషియల్ విచారణ
సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల బాలికను చిదిమేసిన పల్లకొండ రాజు రైలు కిందపడి చనిపోయిన ఘటన పై హైకోర్టు జ్యుడీషియల్ విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా వరంగల్ మూడో మెట్రో పాలిటన్ మేజిస్ట్రేట్‌ను నియమించింది. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నాలుగు వారాల్లో సీల్డ్ కవర్లో నివేదిక సమర్పించాలని సదరు మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్ రావు, జస్టిస్ టి.అమర్‌నాథ్‌గౌడ్‌లతో కూడిన ధర్మా సనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే రాజు పోస్టుమార్టం వీడియోను వరంగల్ జిల్లా చీఫ్ జడ్జికి శనివారం సాయంత్రం లోగా పెన్‌డ్రైవ్‌లోగానీ, సీడీలోగానీ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. జిల్లా చీఫ్ జడ్జి వీలై నంత త్వరగా ఆ వీడియోలను హైకోర్టు జ్యుడీషి యల్ రిజిస్ట్రార్‌కు అందజేయాలని సూచించింది. అత్యవసర విచారణలో.. పల్లకొండ రాజు మరణంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని, దీనిపై జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరుతూ పౌరహక్కుల సంఘం నేత గడ్డం లక్ష్మణ్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేయగా.. హైకోర్టు ధర్మాసనం అత్యవసర విచారణ చేపట్టింది. రాజు ఆత్మహత్య ఘటనపై అనుమా నాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. వాస్తవాలు తేల్చడం కోసం న్యాయ విచారణ చేపట్టాల్సిన అవ సరం ఉందని పేర్కొంది. ప్రభుత్వం రాజుది ఆత్మ హత్య అని పేర్కొంటుండగా, పిటిషనర్లు హత్య అంటున్నారని.. ఈ నేపథ్యంలో సీఆర్పీసీలో నిర్దేశించిన మేరకు విచారణ జరపడం తప్పనిసరని తెలిపింది. రాజు మరణానికి సంబంధించి సమా చారం తెలిసినవారు.. విచారణ అధికారి ఎదుట హాజరై వివరాలు తెలపవచ్చని సూచించింది. అరెస్టు చేశామని కేటీఆరే ప్రకటించారు పిటిషనర్ తరఫున న్యాయవాది వెంకన్న వాదనలు వినిపించారు. రాజును అరెస్టు చేశామని మంత్రి కె.తారకరామారావు స్వయంగా ప్రకటించారని ధర్మాసనానికి విన్నవించారు. ‘‘రాజును ఎన్కౌంటర్ చేస్తామని మంత్రి మల్లారెడ్డి అన్నారు. అతడిని వదిలిపెట్టబోమని బాహాటంగానే చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే కూడా రెండు రోజుల్లో ఫలితం వస్తుందని వ్యాఖ్యానించారు. ఈనెల 9న బాలిక హత్యాచారానికి గురికాగా.. 10వ తేదీన రాజు భార్య, తల్లిని సైదాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకుని, 15వ తేదీ వరకు నిర్బంధించారు. రాజు ఆచూకీ చెప్పాలంటూ వేధింపులకు గురిచేశారు. 15న రాజు ఆచూకీ దొరికిన తర్వాత వారిని విడిచిపెట్టారు. రాజును ఎన్కౌంటర్ చేస్తామని, ఈ విషయాన్ని ఎవరికీ చెప్పవద్దని హెచ్చరించారు. ఆ మరునాడే రైలు పట్టాల వద్ద రాజు మృతదేహం దొరికింది. ఈ పరిణామాలన్నీ గమనిస్తే.. పోలీసులు రాజును అదుపులోకి తీసుకొని హత్య చేశారని.. ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంపై సీఆర్పీసీ 176(1)(ఎ) సెక్షన్ ప్రకారం న్యాయ విచారణకు ఆదేశించండి. బాలిక హత్యాచార ఘటనలో రాజు నిందితుడిగా ఉన్నా.. అతడిని చట్టప్రకారం కోర్టులో హాజరుపర్చి, నేరం రుజువైతే శిక్షించి ఉండాల్సింది..’’ అని న్యాయవాది పేర్కొన్నారు. రాజు కుటుంబానికి రూ.50 లక్షలు పరిహారం ఇప్పించాలని ధర్మాసనానికి విన్నవించారు. అది ముమ్మాటికీ ఆత్మహత్యే.. రాజును పోలీసులు కస్టడీలోకి తీసుకోలేదని.. అది ముమ్మాటికీ ఆత్మహత్యేనని ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ‘‘ఈ విషయంలో ఎటువంటి అనుమానాలు, సందేహాలకు ఆస్కారం లేదు. రాజు కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు కింద పడిన వెంటనే.. రైలు డ్రైవర్లు ఇద్దరు అది గుర్తించి, స్థానిక రైల్వే అధికారులకు వాకీటాకీలో సమాచారం అందించారు. మరో ఐదుగురు ఇండిపెండెంట్ సాక్షులు కూడా రాజు ఆత్మహత్య చేసుకున్నాడని వాంగ్మూలాలు ఇచ్చారు. ఆ వాంగ్మూలాలను రైల్వే పోలీసులు కూడా రికార్డు చేశారు. పోస్టుమార్టం ప్రక్రియను పూర్తిగా వీడియో తీశాం. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. వారు అంత్యక్రియలు పూర్తిచేశారు. ఈ ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించడం అంటే కోర్టుల విలువైన సమయాన్ని వృధా చేయడమే’’ అని పేర్కొన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. ‘పోస్టుమార్టం, అంత్యక్రియలు అయిపోయాయా?.. చాలా వేగంగా పూర్తి చేశారు..’ అని వ్యాఖ్యానించింది. ఘటనపై జ్యుడిషియల్ విచారణకు ఆదేశిస్తూ.. విచారణను నాలుగు వారాలపాటు వాయిదా వేసింది. -
ముగ్గురు యువతుల నుంచి వాంగ్మూలం
సాక్షి, విశాఖపట్నం: ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై జరిగిన హత్యాయత్నం కేసుకు సంబంధించి ముగ్గురు యువతుల నుంచి విశాఖపట్నం నాల్గవ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ వాంగ్మూలం తీసుకున్నారు. జగన్‌పై హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కాల్‌డేటా ఆధారంగా పోలీసులు ఇప్పటికే పలువురిని విచారించారు. ఈ క్రమంలో శ్రీనివాసరావుతోపాటు విశాఖ విమానాశ్రయం ఫ్యూజన్‌ఫుడ్స్ రెస్టారెంట్లో పనిచేస్తున్న హేమలత, రమాదేవి, అమ్మాజీలను పలు కోణాల్లో విచారించారు. ఈ కేసులో సాక్ష్యాల నమోదు కోసం సిట్ పోలీసులు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద తాజాగా నాల్గవ అదనపు ప్రధాన మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు న్యాయమూర్తి ఎదుట సోమవారం హాజరు పరిచారు. వారి నుంచి మేజిస్ట్రేట్ వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. ఇదిలా ఉండగా, ప్రధాన నిందితుడు శ్రీనివాసరావు తరఫున న్యాయవాది అబ్దుల్ సలీం దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ మంగళవారం విచారణకు రానుంది. ఈ పిటిషన్‌పై ఒకటవ అదనపు జిల్లా కోర్టులో వాదనలు వినిపించనున్నారు. -
కేజ్రీవాల్.. కోర్టుకు రండి..
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ), మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న హాజరుకావాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. ఇదే కేసులో కేజ్రీవాల్‌తో పాటు విచారణ ఎదుర్కొంటూ సమన్లు అందుకున్న బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డీడీసీఏలో అవినీతి చోటుచేసుకుందని, సెక్స్ రాకెట్ కూడా నడిచిందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఇరోమ్‌కు కేజ్రీవాల్ 50వేల విరాళం మరోవైపు, మణిపూర్ ఎన్నికల బరిలో దిగిన హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల పార్టీకి కేజ్రీవాల్ రూ.50వేలు విరాళమిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన పార్టీకి నిధులివ్వాలంటూ షర్మిల ఆన్ లైన్ లో కోరడం తెలిసిందే. ఇప్పటివరకు ప్రజలనుంచి సేకరించిన విరాళాలు రూ.4.5లక్షలకు చేరాయని ఆమె పార్టీ తెలిపింది. డబ్బుల్లేకపోవటంతో ఆమె సైకిల్‌పై ప్రచారం చేస్తున్నారు. -
'కేజ్రీవాల్ ఎవరికీ లంచం ఇవ్వలేదు కదా'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట కలిగింది. ఆయనపై గతంలో దాఖలైన ఓ క్రిమినల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయన తప్పు చేసినట్లుగా పిటిషన్ దారులు ఎటువంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయినందున ఆ పటిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బబ్రు భాన్ తీర్పు వెలువరించారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ప్రచారం సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను పక్కదారి పట్టించేలా వ్యవహరించారని, మిగితా అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకోవచ్చని, కానీ ఓట్లు మాత్రం తమకే వేయాలని వారిని మభ్య పెట్టారని, అది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లే అవుతుందని ఆరోపిస్తూ ఇక్రాంత్ శర్మ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే, వ్యక్తిగతంగా కేజ్రీవాల్ ఎవరికీ లంఛం ఇవ్వలేదని, ఇతరులు ఇస్తే మాత్రం తీసుకోవచ్చని మాత్రమే చెప్పారని ఈ సందర్భంగా పిటిషన్ దారుకు కోర్టు తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 2015లో ఈ పిటిషన్ దాఖలైంది. -
లంచం కేసులో మేజిస్ట్రేట్ అరెస్ట్
న్యూఢిల్లీ: ఓ షాపు యజమాని నుంచి 25 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా ఢిల్లీ ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆర్పీ భాటియాను సీబీఐ అరెస్ట్ చేసింది. ముందస్తు సమాచారం మేరకు మంగళవారం సీబీఐ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఆర్పీ భాటియాను పట్టుకున్నారు. ఇటీవల లజపత్ నగర్లో తనిఖీల సందర్భంగా ఆర్పీ భాటియా.. షాపు యజమానికి చలానా వేసి కోర్టులో హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. ఈ చలానాను రద్దు చేయాలంటే 60 వేల రూపాయలు లంచం ఇవ్వాలని అనంతరం డిమాండ్ చేశారు. చివరకు 25 వేల రూపాయలు లంచం తీసుకునేందుకు అంగీకరించారు. ఈ విషయం తెలుసుకున్న సీబీఐ మాటువేసి మేజిస్ట్రేట్‌ను అదుపులోకి తీసుకుంది. -
ఎమ్మెల్యే బోడె అనుచరుల వీరంగం
ఇసుక తక్కువ లోడ్ చేశారన్నందుకు చితకబాదిన వైనం పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లోనే ఘటన చోద్యం చేసిన పోలీసులు న్యాయమూర్తికి ఫిర్యాదు చేసిన బాధితుడు విజయవాడ లీగల్ : పెదపులిపాక ఇసుక రీచ్‌లో ఇసుక తక్కువ లోడ్ చేస్తున్నారని ప్రశ్నించినందుకు పెనమలూరు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు, సీఐ మురళీకృష్ణ, ఇతర సిబ్బంది ఓ వ్యక్తిని చితకబాదిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు బాధితుడు శుక్రవారం విజయవాడ ఒకటో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కె.శ్రీనివాస్ చక్రవర్తికి శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ఎమ్మెల్యే అనుచరులు పెనమలూరు పోలీస్‌స్టేషన్‌లోనే తనను కర్రలు, రాడ్లతో కొడుతుంటే సీఐ పట్టించుకోకుండా చోద్యం చూశారని బాధితుడు పేర్కొన్నాడు. బాధితుడి ఒంటిపై గాయూలు గమనించిన న్యాయమూర్తి అతడ్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అనంతరం నివేదిక ఇవ్వమని ఆదేశించారు. వివరాల ప్రకారం.. యనమలకుదురుకు చెందిన బిల్డర్ మంచికలపూడి వెంకటేశ్వరనాథ్ ఇసుక కోసం మీ సేవా కేంద్రంలో రెండు యూనిట్లకు సొమ్ము చెల్లించి బిల్లు తీసుకున్నాడు. అరుుతే, ఇసుక రెండు యూనిట్లకు తక్కువ రావడంతో ఈనెల పదో తేదీ మధ్యాహ్నం పెదపులిపాక వెళ్లి రీచ్ నిర్వాహకులను ప్రశ్నించాడు. అప్పటికే అక్కడ పహారా కాస్తున్న ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అనుచరులు వెంకటేశ్వరనాథ్పై దాడికి దిగారు. ఇదంతా పెనమలూరు సీఐ మురళీకృష్ణ సమక్షంలోనే జరిగింది. బాధితుడిపై దాడి చేయడమే కాకుండా, పెదపులిపాక డ్వాక్రా మహిళల ద్వారా అక్రమ కేసులు బనాయించి స్టేషన్లో ఉంచి కర్రలు, రాడ్లతో దాడికి పాల్పడ్డారు. పదో తేదీ నుంచి వెంకటేశ్వరనాథ్ ఆచూకీ తెలియక శుక్రవారం ఆయన బంధువులు కోర్టులో సెర్చ్ వారెంట్ వేయడానికి సిద్ధమయ్యూరు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంకటేశ్వరనాథ్పై సెక్షన్ 353 కింద అరెస్టు చేసి సాయంత్రం కోర్టులో హాజరుపరిచారు. దీంతో బాధితుడు తనపై జరిగిన దాడిని, సీఐ వ్యవహరించిన తీరును న్యాయమూర్తికి చెప్పడంతో ఆయన రాతపూర్వకంగా ఇవ్వమని ఆదేశించారు. సీఐని వివరణ కోరారు. బాధితుడికి ఎక్స్‌రే తీరుుంచగా, వైద్యులు కాలు విరిగినట్లు నిర్ధారించారు. -
ఆర్టీవీ బస్సు డ్రైవర్‌కు జైలు
న్యూఢిల్లీ: అతి వేగంగా వాహనాన్ని నడిపి ఓ వ్యక్తి మృతికి కారకుడైన నిందితుడికి కోర్టు జైలు శిక్ష విధించింది. ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయిన మహ్మద్ షఫీక్‌కు అదనపు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ శరద్ గుప్తా ఈ మేరకు జైలు శిక్షను ఖరారు చేశారు. అదే విధంగా బాధితుడు అర్జున్‌కు నష్టపరిహారం అందజేయాలని సూచించింది. ఈ పరిహారాన్ని నిందితుడు అందజేసే స్థితిలో లేకుంటే ఢిల్లీ న్యాయ సేవా సంస్థ చెల్లించాలని సూచించింది. పోలీసులు తెలిపిన కేసు పూర్వాపరాలు ఇలా ఉన్నాయి.. డిసెంబర్ 2, 2002న షఫీక్ అనే డ్రైవర్ ఆర్టీవీ బస్సును అతివేగంగా నడుపుతూ యమున పుస్త రోడ్డును క్రాస్ చేస్తున్న అర్జున్ ఢికొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు మృతి చెందాడు. ఈ మేరకు అదే సంవత్సరం డిసెంబర్ 8వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి షఫీని అరెస్టు చేశారు. ఈ మేరకు నేరం రుజువు కావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది. నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి సంఘటనలపై స్థానిక కోర్టు తన సామాజిక బాధ్యతను విస్మరించకూడదని స్పష్టం చేసింది. -
తప్పుడు ఫిర్యాదు చేసిన మహిళపై కేసు నమోదు
న్యూఢిల్లీ: తన వద్ద బలవంతంగా డబ్బు గుంజేందుకు ఓ మహిళ తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆరోపిస్తూ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని నగర కోర్టు పోలీసులను ఆదేశించింది. ఢిల్లీకి చెందిన ఫార్మాసిస్టు నవీన్‌కుమార్ చేసిన ఫిర్యాదుపై చీఫ్ మెట్రొపాలిటన్ మేజిస్ట్రేట్ సోను అగ్నిహోత్రి పై ఆదేశాలు జారీ చేశారు. గత ఏడాది మార్చి 30న రాత్రి ఓ మహిళ తనను భయపెట్టి తన వద్ద బంగారు గొలుసును, రూ.5వేల నగదును లాగేసుకుందని నవీన్ కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఆ తరువాత మరింత డబ్బు గుంజేందుకు తనపై తప్పుడు కేసు బనాయించిందని ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోర్టు కల్యాణ్‌పురీ స్టేషన్ అధికారిని ఆదేశించింది. ఆ మహిళ ఇప్పటికే అత్యాచారం, వేధింపులకు సంబంధించి వేర్వేరు వ్యక్తులపై పది కేసులు పెట్టిందని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఇదిలా ఉండగా, నవీన్ చేసిన ఫిర్యాదుపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మేజిస్ట్రేట్ ఆదేశించారు. -
టీవీ9 రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేయండి
*పోలీసులకు రెండో మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఆదేశం రంగారెడ్డి జిల్లా కోర్టులు: తెలంగాణ ప్రజాప్రతినిధులను కించ పరిచే విధంగా కార్యక్రమాలను ప్రసారం చేసిన టీవీ-9 యజమాని రవిప్రకాశ్‌పై కేసు నమోదు చేయాలని సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బుధవారం ఎల్బీనగర్ పోలీసులను ఆదేశించారు. ఈ నెల 12న రాత్రి 8.30 గంటల సమయంలో ‘బుల్లెట్ న్యూస్’ పేరిట ప్రసారం చేసిన కార్యక్రమంలో తెలంగాణ ప్రజాప్రతినిధులను కించపరిచారంటూ స్థానిక న్యాయవాది సుంకరి జనార్దన్‌గౌడ్ బుధవారం సైబరాబాద్ 2వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీంతో సెక్షన్- 504, 506 భారతీయ శిక్ష్మాస్మృతి, 4ఏ, 6 కేబుల్ అండ్ నెట్వర్క్ యాక్ట్ ప్రకారం ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను ఆదేశించింది