న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ), మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న హాజరుకావాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. ఇదే కేసులో కేజ్రీవాల్‌తో పాటు విచారణ ఎదుర్కొంటూ సమన్లు అందుకున్న బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డీడీసీఏలో అవినీతి చోటుచేసుకుందని, సెక్స్ రాకెట్ కూడా నడిచిందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు.
ఇరోమ్‌కు కేజ్రీవాల్ 50వేల విరాళం
మరోవైపు, మణిపూర్ ఎన్నికల బరిలో దిగిన హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల పార్టీకి కేజ్రీవాల్ రూ.50వేలు విరాళమిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన పార్టీకి నిధులివ్వాలంటూ షర్మిల ఆన్ లైన్ లో కోరడం తెలిసిందే. ఇప్పటివరకు ప్రజలనుంచి సేకరించిన విరాళాలు రూ.4.5లక్షలకు చేరాయని ఆమె పార్టీ తెలిపింది. డబ్బుల్లేకపోవటంతో ఆమె సైకిల్‌పై ప్రచారం చేస్తున్నారు.
కేజ్రీవాల్.. కోర్టుకు రండి..
Published Sun, Feb 19 2017 2:39 AM | Last Updated on Tue, Sep 5 2017 4:02 AM
Advertisement