Chetan Chauhan
-
మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ మృతి
లక్నో: భారత మాజీ క్రికెటర్, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రిగా వ్యవహరిస్తున్న చేతన్ చౌహాన్ కరోనా వైరస్‌తో ఆదివారం మృతి చెందారు. 73 ఏళ్ల చేతన్ చౌహాన్ కోవిడ్–19 పాజిటివ్‌తో జూలై 12న లక్నోలోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో చేరారు. ఆ తర్వాత కొన్ని రోజులకు కిడ్నీ సంబంధిత సమస్యలతో గుర్‌గ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకుంటున్నట్లు కనిపించినా శుక్రవారం రాత్రి హఠాత్తుగా ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తుదిశ్వాస విడిచారు. చేతన్ చౌహాన్‌కు భార్య, కుమారుడు ఉన్నాడు. కుమారుడు వినాయక్ మెల్బోర్న్ నుంచి రావాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీకి చెందిన చేతన్ చౌహాన్ 1969 నుంచి 1981 మధ్య కాలంలో భారత టెస్టు, వన్డే జట్లకు ప్రాతినిధ్యం వహించారు. 40 టెస్టులు ఆడిన ఆయన 16 అర్ధ సెంచరీల సహాయంతో 2,084 పరుగులు చేశారు. ఏడు వన్డేల్లో బరిలోకి దిగిన ఆయన 153 పరుగులు సాధించారు. -
మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ కన్నుమూత
సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ (73) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయనను గురుగ్రామ్‌లోని మెదాంతకు తరలించారు. అప్పటి నుంచి చేతన్ చౌహాన్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తడంతో చికిత్సకు అవయవాలు స్పందించకపోవడంతో ఆయన ఇవాళ సాయంత్రం మృతి చెందారు. జూలై 21, 1947లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన చేతన్ చౌహాన్ టెస్టుల్లో 2,084 పరుగులు, 7 వన్డేల్లో 153 పరుగులు చేశారు. భారత్ తరపున 40 టెస్టులు, 7 వన్డేలు ఆడిన ఆయన.. గవాస్కర్‌తో కలిసి ఓపెనర్‌గా పలు ఇన్నింగ్స్‌లు ఆడారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం చేతన్ చౌహాన్ ఢిల్లీ క్రికెట్ సంఘంలో వివిధ పదవులు చేపట్టారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో యోగీ సర్కార్‌లో మంత్రిగా పని చేస్తున్నారు. -
విషమంగా మాజీ క్రికెటర్ ఆరోగ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్ మంత్రి, మాజీ టీమిండియా క్రికెటర్ చేతన్ చౌహాన్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉంది. కిడ్ని సమస్యతో పోరాడుతున్న ఆయన గురుగ్రామ్‌లోని మెదంత ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. చేతన్ చౌహాన్ జూలైలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ని లక్నోలోని సంజయ్ గాంధీ ఆస్పత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో మెదంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోవిడ్ చికిత్స పొందుతున్న ఆయనకి కిడ్నీ, బీపీ సమస్యలు తలెత్తడంతో వెంటిలేటర్‌పై ఆత్యవసర చికిత్స అందిస్తున్నామని వైద్యులు తెలిపారు. (కోవిడ్ లెక్కలు చెప్పే అగర్వాల్‌కు కరోనా) రెండు సార్లు ఎంపీగా ఎన్నికైన చేతన్ చౌహాన్ కరోనా బారిన పడిన అంతర్జాతీయ మాజీ క్రికెట్ క్రీడాకారుల్లో ఒకరు. చేతన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన కుటుంబసభ్యులు జూలైలోనే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకొని, హోం క్వారంటైన్‌కు పరిమితయ్యారు. ప్రస్తుతం చౌహాన్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. 1969-1978 మధ్య కాలంలో ఆయన 40 టెస్టులు ఆడి 31.57 సగటుతో 2084 పరుగులు చేశారు. 97 పరుగుల అత్యధిక స్కోరు కలిగి ఉన్నారు. ఏడు వన్డేలు ఆడిన చౌహాన్ 153 పరుగులు చేశారు. (దేశ భద్రతలో మరో కీలక ఆవిష్కరణ) -
‘ఇక రవిశాస్త్రిని తొలగించండి’
ముంబై: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రవిశాస్త్రిని తొలగించాలని మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ డిమాండ్ చేశాడు. ఆస్ట్రేలియా సిరీస్‌కు ముందే అతడిని పదవి నుంచి తొలగిస్తే మంచిదన్నాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌లో భారత్ ఘోర పరాజయం కావడంతో రవిశాస్త్రిపై విమర్శలు తారాస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. భారత మాజీ క్రికెటర్లు రవిశాస్త్రి పని తీరును టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిలో భాగంగా మాట్లాడిన చేతన్ చౌహాన్..‘ఆస్ట్రేలియా పర్యటనకు ముందే రవిశాస్త్రిని ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తొలగించాలి. శాస్త్రి అద్భుత క్రికెట్ వ్యాఖ్యాత. అతడిని ఆ పని చేసేందుకే అనుమతించాలి’ అని సూచించారు. ఇంగ్లండ్ పర్యటనలో కోహ్లి సేన మెరుగైన ఆట తీరును కనబరచడంలో విఫలమైందన్నాడు. రెండు జట్లు బలాబలాల్లో సమానంగా ఉన్నా ఇంగ్లండ్ టెయిలెండర్లను ఔట్ చేయడంలో టీమిండియా విఫలమైందన్నారు. భారత క్రికెట్ జట్లలో కోహ్లి సేన అత్యుత్తమం అన్న రవిశాస్త్రి మాటలను చేతన్ వ్యతిరేకించాడు. ‘దాన్ని నేను అంగీకరించను. 1980ల్లోని భారత జట్టే ప్రపంచంలోనే అత్యుత్తమ పర్యాటక జట్టు’ అని చౌహాన్ పేర్కొన్నాడు. -
కేజ్రీవాల్.. కోర్టుకు రండి..
న్యూఢిల్లీ: ఢిల్లీ జిల్లా క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ), మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ దాఖలు చేసిన పరువునష్టం కేసులో విచారణ ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను మార్చి 21న హాజరుకావాలని ఢిల్లీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఉత్తర్వులిచ్చారు. ఇదే కేసులో కేజ్రీవాల్‌తో పాటు విచారణ ఎదుర్కొంటూ సమన్లు అందుకున్న బీజేపీ బహిష్కృత ఎంపీ కీర్తి ఆజాద్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. డీడీసీఏలో అవినీతి చోటుచేసుకుందని, సెక్స్ రాకెట్ కూడా నడిచిందని గతంలో కేజ్రీవాల్ ఆరోపించారు. ఇరోమ్‌కు కేజ్రీవాల్ 50వేల విరాళం మరోవైపు, మణిపూర్ ఎన్నికల బరిలో దిగిన హక్కుల కార్యకర్త ఇరోమ్ షర్మిల పార్టీకి కేజ్రీవాల్ రూ.50వేలు విరాళమిచ్చారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తన పార్టీకి నిధులివ్వాలంటూ షర్మిల ఆన్ లైన్ లో కోరడం తెలిసిందే. ఇప్పటివరకు ప్రజలనుంచి సేకరించిన విరాళాలు రూ.4.5లక్షలకు చేరాయని ఆమె పార్టీ తెలిపింది. డబ్బుల్లేకపోవటంతో ఆమె సైకిల్‌పై ప్రచారం చేస్తున్నారు. -
నిప్పులు చెరిగిన జైరాం రమేష్
న్యూఢిల్లీ. బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జై రాం రమేష్ నిప్పులు చెరిగారు. వేలకోట్లరుణాలను ఎగవేసిన విజయ్ మాల్యాను, కుంభకోణానికి పాల్పడిన లలిత్ మోడీని భారతదేశానికి రప్పించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. మాల్య ఫంక్షన్ లకు హాజరవుతూంటే.. ప్రభుత్వం ఆయన్ని వెనక్కి రప్పించడంపై ఆసక్తి చూపడంలేదని విమర్శించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై స్పందించిన ఆయన ఎఫ్‌డీఐలకు 100 శాతం అనుమతిలిస్తూ చేసిన ప్రకటన ఆందోళన కలిగించేదిగా ఉందన్నారు. భారతదేశం యొక్క పర్యావరణ సమస్యలకు సమాధానంగా ఎఫ్‌డీఐ విధానాన్ని చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అటు చేతన్ చౌహాన్ నియామకంపై కూడా విమర్శించిన జైరాం రమేష్ ..ఇలా ఆర్బీఐ గవర్నర్ గా రఘురాజన్ కి ఇలా ఉద్వాసన పలుకుతూ..అలా ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) ఛైర్మన్‌గా భాజపా మాజీ ఎంపీ చేతన్ కు ఆహ్వానం పలికారని ఆరోపించారు. -
'ఏ విచారణకైనా మేము సిద్ధం'
న్యూఢిల్లీ:డీడీసీఏలో ఎటువంటి అవతవకలు జరగలేదని ఉపాధ్యక్షుడు చేతన్ చౌహాన్ స్పష్టం చేశారు. డీడీసీఏ చాలా స్వచ్ఛంగా ఉందని, అసలు తమ క్రికెట్ అసోసియేషన్ లో ఎటువంటి సమస్యలేవని పేర్కొన్నాడు. ఈ మేరకు మంగళవారం చేతన్ చౌహాన్ నేతృత్వంలోని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. తాము ఏ తరహా విచారణకైనా సిద్ధంగా ఉన్నామని పేర్కొంది. తమను సీబీఐ ఏ సమాచారం కోరినా అందజేస్తామని చేతన్ చౌహాన్ స్పష్టం చేశారు. డీడీసీఏపై విచారణకు ఆదేశించిన వారే ఇప్పుడు భయపడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. డీడీసీఏలో నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. గతంలో డీడీసీఏ కు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో భారీ ఎత్తున అవతవకలు జరిగాయనేది కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. డీడీసీఏలో 2013 వరకూ 13 సంవత్సరాల పాటు అరుణ్ జైట్లీ అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ సమయంలో భారీ స్థాయిలో అవినీతి జరిగిందని కేజ్రీవాల్ తో పాటు మాజీ క్రికెటర్లు బిషన్ సింగ్ బేడీ, కీర్తి ఆజాద్ లు ఆరోపిస్తున్నారు. -
దేశవాళీకీ దూరం
న్యూఢిల్లీ: తన మునుపటి ఫామ్‌ను ఏనాడో కోల్పో యిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఇప్పుడు దేశవాళీ పోటీల్లోనూ జట్టు నుంచి పక్కకు తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయ్ హజారే ట్రోఫీలో ఢిల్లీ తరఫున ఆడిన రెండు మ్యాచ్‌ల్లో వీరూ 14, 10 పరుగులు చేశాడు. అయితే తను దగ్గు, జలుబుతో బాధపడుతున్నాడని అందుకే ఆడడం లేదని సెలక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ చౌహాన్ తెలిపారు. అయితే పేలవ ఫామ్ కారణంగానే సెహ్వాగ్ విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు ఢిల్లీ క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉదయం 7.30కి ఆటగాళ్లు మైదానంలో రిపోర్ట్ ఇవ్వాల్సి ఉండగా వీరూ 7.15కు తాను అందుబాటులో ఉండలేనంటూ చీఫ్ కోచ్ సంజీవ్ శర్మకు తెలిపాడు.