నిప్పులు చెరిగిన జైరాం రమేష్
న్యూఢిల్లీ. బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జై రాం రమేష్ నిప్పులు చెరిగారు. వేలకోట్లరుణాలను ఎగవేసిన విజయ్ మాల్యాను, కుంభకోణానికి పాల్పడిన లలిత్ మోడీని భారతదేశానికి రప్పించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు. మాల్య ఫంక్షన్ లకు హాజరవుతూంటే.. ప్రభుత్వం ఆయన్ని వెనక్కి రప్పించడంపై ఆసక్తి చూపడంలేదని విమర్శించారు.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంపై స్పందించిన ఆయన ఎఫ్డీఐలకు 100 శాతం అనుమతిలిస్తూ చేసిన ప్రకటన ఆందోళన కలిగించేదిగా ఉందన్నారు. భారతదేశం యొక్క పర్యావరణ సమస్యలకు సమాధానంగా ఎఫ్డీఐ విధానాన్ని చూపించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అటు చేతన్ చౌహాన్ నియామకంపై కూడా విమర్శించిన జైరాం రమేష్ ..ఇలా ఆర్బీఐ గవర్నర్ గా రఘురాజన్ కి ఇలా ఉద్వాసన పలుకుతూ..అలా ప్రతిష్ఠాత్మకమైన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్) ఛైర్మన్‌గా భాజపా మాజీ ఎంపీ చేతన్ కు ఆహ్వానం పలికారని ఆరోపించారు.