సాక్షి, న్యూఢిల్లీ : తీవ్ర అనారోగ్యంతో భారత మాజీ క్రికెటర్ చేతన్ చౌహాన్ (73) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ రావడంతో లక్నోలోని సంజయ్ గాంధీ పీజీఐ ఆస్పత్రిలో చేరారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయనను గురుగ్రామ్‌లోని మెదాంతకు తరలించారు. అప్పటి నుంచి చేతన్ చౌహాన్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే బీపీతో పాటు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తడంతో చికిత్సకు అవయవాలు స్పందించకపోవడంతో ఆయన ఇవాళ సాయంత్రం మృతి చెందారు.
జూలై 21, 1947లో ఉత్తరప్రదేశ్‌లో జన్మించిన చేతన్ చౌహాన్ టెస్టుల్లో 2,084 పరుగులు, 7 వన్డేల్లో 153 పరుగులు చేశారు. భారత్ తరపున 40 టెస్టులు, 7 వన్డేలు ఆడిన ఆయన.. గవాస్కర్‌తో కలిసి ఓపెనర్‌గా పలు ఇన్నింగ్స్‌లు ఆడారు. క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన అనంతరం చేతన్ చౌహాన్ ఢిల్లీ క్రికెట్ సంఘంలో వివిధ పదవులు చేపట్టారు. అనంతరం రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లో యోగీ సర్కార్‌లో మంత్రిగా పని చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment