కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు | Delhi court summons Kejriwal in defamation case filed by Nitin Gadkari | Sakshi
Sakshi News home page

కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు

Published Fri, Feb 28 2014 11:15 AM | Last Updated on Sat, Sep 2 2017 4:12 AM

కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు

కేజ్రీవాల్కు సమన్లు జారీ చేసిన ఢిల్లీ కోర్టు

న్యూఢిల్లీ : బీజేపీ నేత నితిన్ గడ్కరీ వేసిన పరువు నష్టం కేసులో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఏప్రిల్ 7వ తేదీలోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గోమతి మనోచా ఆదేశాలు ఇచ్చారు. గతంలో కేజ్రీవాల్ విడుదల చేసిన అవినీతి రాజకీయ నేతల జాబితాలో తన పేరు చేర్చడంపై  నితన్ గడ్కరీ ఈ పరువు నష్టం దావా వేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయటం కేజ్రీవాల్కు అలవాటుగా మారిపోయిందని గడ్కరీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనివల్ల తన పరువుకు భంగం వాటిల్లుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement