Defamation Case: Ashok Gehlot Summoned by Delhi Court - Sakshi
Sakshi News home page

పరువు నష్టం దావా వేసిన కేంద్ర మంత్రి.. రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌కు కోర్టు సమన్లు

Published Thu, Jul 6 2023 4:12 PM | Last Updated on Thu, Jul 6 2023 5:52 PM

defamation case Ashok Gehlot summoned by Delhi court - Sakshi

సాక్షి, ఢిల్లీ: రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌కు పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 7వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఢిల్లీ రౌస్‌ ఎవెన్యూ కోర్టు ఆ సమన్లలో పేర్కొంది.  కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌, గెహ్లాట్‌పై వేసిన పరువు నష్టం దావా ఆధారంగా ఈ సమన్లు జారీ అయ్యాయి. 

సుమారు 900 కోట్ల రూపాయలకు సంబంధించి గెహ్లాట్‌ చేసిన ఆరోపణలకుగానూ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌  ఈ దావా వేశారు. సంజీవని స్కామ్‌పై చేసిన వ్యాఖ్యలతో గెహ్లాట్‌ తన పరువు తీశారంటూ కోర్టుకెక్కారు కేంద్ర మంత్రి. 

అయితే.. నేరపూరిత పరువు నష్టం కేసులో సీఎంకు సమన్లు పంపాలా? వద్దా? అని తర్జనభర్జనలు చేసి.. ఆ ఉత్తర్వులను ఇదివరకే రిజర్వ్‌ చేసింది కోర్టు. ఇక ఇవాళ ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జస్టిస్‌ హజ్రీత్‌ సింగ్‌ జస్పాల్‌ ఇవాళ సీఎం గెహ్లాట్‌కు సమన్లు జారీ చేశారు.

ఇంతకు ముందు మోదీ ఇంటి పేరు వ్యవహారంలో పరువు నష్టం దావా ద్వారా కోర్టు కేసు ఎదుర్కొన్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ.. దోషిగా తేలి రెండేళ్ల శిక్ష పడడంతో ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్య చట్టం ప్రకారం.. తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోయిన సంగతి తెలిసిందే.

ఇదీ చదవండి: కాళ్లు కడిగి మరీ క్షమాపణలు కోరిన సీఎం

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement