
ఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. తనపై తప్పుడు కథనాలు రాసిన ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై వేసిన పరువునష్టం కేసు విచారణ జూలై 16వ తేదీకి వాయిదా పడింది. అమెరికాలో ఆదానీ గ్రూపు పై దాఖలైన కేసులో భాగంగా వైఎస్ జగన్‌పై ఈనాడు, ఆంధ్రజ్యోతిలు తప్పుడు కథనాలు ప్రచురించాయి. దీనిపై వైఎస్ జగన్ రూ. 100 కోట్ల పరువు నష్టం కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై ఢిల్లీ హైకోర్టు విచారణ చేపట్టగా, ఈ కేసు ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదని ఉషోదయ పబ్లికేషన్స్ అప్లికేషన్ దాఖలు చేసింది. ఆ అప్లికేషన్ కు కౌంటర్ దాఖలు చేస్తామని వైఎస్ జగన్ తరుపు న్యాయవాది దయ కృష్ణన్ హైకోర్టుకు తెలిపారు. దాంతో తదుపరి విచారణ జూలై 16 కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు.