'కేజ్రీవాల్ ఎవరికీ లంచం ఇవ్వలేదు కదా'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట కలిగింది. ఆయనపై గతంలో దాఖలైన ఓ క్రిమినల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయన తప్పు చేసినట్లుగా పిటిషన్ దారులు ఎటువంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయినందున ఆ పటిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బబ్రు భాన్ తీర్పు వెలువరించారు.
ఢిల్లీ ఎన్నికల సమయంలో ప్రచారం సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను పక్కదారి పట్టించేలా వ్యవహరించారని, మిగితా అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకోవచ్చని, కానీ ఓట్లు మాత్రం తమకే వేయాలని వారిని మభ్య పెట్టారని, అది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లే అవుతుందని ఆరోపిస్తూ ఇక్రాంత్ శర్మ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే, వ్యక్తిగతంగా కేజ్రీవాల్ ఎవరికీ లంఛం ఇవ్వలేదని, ఇతరులు ఇస్తే మాత్రం తీసుకోవచ్చని మాత్రమే చెప్పారని ఈ సందర్భంగా పిటిషన్ దారుకు కోర్టు తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 2015లో ఈ పిటిషన్ దాఖలైంది.