bribe aligations
-
Kerala: రూ.100 కోట్ల ముడుపుల కలకలం
తిరువనంతపురం: కేరళలోని ఎన్సీపీ (శరద్)కి చెందిన ఏకైక ఎమ్మెల్యే థామస్ కె.థామస్ అధికార ఎల్డీఎఫ్కు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలకు రూ.50 కోట్ల చొప్పున ఇవ్వజూపారన్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. జనాధిపత్య కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆంటోనీ రాజు, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ(లెనినిస్ట్) ఎమ్మెల్యే కొవూర్ కుంజుమోన్లకు థామస్ ఈ ఆఫర్ ఇచ్చారని అంటున్నారు. ఈ రెండు పార్టీలు ఎల్డీఎఫ్లో భాగస్వాములు. ప్రతిగా ఈ ఎమ్మెల్యేలిద్దరూ ఎన్సీపీ(అజిత్)లో చేరడం, పినరయి విజయన్‌పై ఒత్తిడి తెచ్చి కేబినెట్లో స్థానం దక్కించుకునేందుకు పథక రచన జరిగిందని ఆరోపణలున్నాయి. జూన్ 5న థామస్ నుంచి ఈ మేరకు తమకు ప్రతిపాదన వచి్చందని మాజీ మంత్రి కూడా అయిన రాజు సీఎం విజయన్ చెవిన వేశారు. దీనిపై ఆయన కుంజుమోన్‌ను ప్రశ్నించగా అలాంటిదేమీ లేదంటూ కొట్టిపారేశారు. ఈ వ్యవహారం అక్టోబర్ 25న త్రిసూర్‌లో జరిగిన సీపీఎం సమావేశం సందర్భంగా బయటకు వచి్చంది. ఎల్డీఎఫ్ మిత్ర పక్షం ఎన్సీపీ(శరద్)వర్గం ఎమ్మెల్యే థామస్‌కు మంత్రివర్గంలో స్థానం కల్పించకపోడానికి గల కారణాలను ఈ సమావేశంలో సీఎం విజయన్ చెప్పినట్లు కూడా తెలుస్తోంది. వాస్తవానికి థామస్ కేబినెట్లో అటవీ శాఖను కోరుతున్నారు. అయితే, సీఎం విజయన్, సీపీఎంతో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న మంత్రి శచీంద్రన్ ఆ శాఖను వదులుకునేందుకు ససేమిరా అంటున్నారు. అందుకే, ఒక రకంగా సీఎం విజయన్‌పై ఒత్తిడి తేవడం ద్వారా కేబినెట్లో చేరేందుకు థామస్ వేసిన పథకంగా భావిస్తున్నారు. ఎన్సీపీ(అజిత్), బీజేపీలు మహారాష్ట్రలో మిత్రపక్షాలే కాబట్టి.. ఈ పథకమే ఫలించి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎన్సీపీ(అజిత్)లో చేరితే కేరళలో బీజేపీకి పరోక్షంగా లాభం కలిగి ఉండేది. ఏదేమైనప్పటికీ, మంత్రి వర్గంలో చేరే అవకాశాన్ని ప్రస్తుతానికి థామస్ కోల్పోయినట్లుగానే భావిస్తున్నారు. ఈ పరిణామాలపై తమకెలాంటి సంబంధం లేదని కేరళలో ఎన్సీపీ(అజిత్)నేత మహ్మద్ కుట్టి స్పష్టం చేశారు. ఆరోపణలపై విచారణకు ఏర్పాటైన ఎన్సీపీ(శరద్)కమిటీ ఎదుట ఇటీవల థామస్ హాజరై, ముడుపుల వ్యవహారంతో తనకెలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కమిటీ త్వరలోనే ఎన్సీపీ(శరద్) జాతీయ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ పీసీ చాకోకు నివేదిక ఇవ్వనుంది. -
హైదరాబాద్‌లో ఇద్దరు జీఎస్టీ అధికారులపై సీబీఐ కేసు..
సా క్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్‌లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతికి పాల్పడ్డ ఇద్దరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. లంచం ఆరోపణలపై జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్‌తోపాటు ఇన్స్పెక్టర్ మనీష్ శర్మపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఐరన్ స్క్రాప్ గోదాంలో అక్రమాలపై జీఎస్టీ అధికారులు జరిమానా విధించారు. స్క్రాప్ గోదామును సీజ్ చేశారు. అనంతరం బాధితుడు నుంచి అయిదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు. అయితే సీజ్ చేసిన గోదాంను ఓపెన్ చేసేందుకు మరో 3 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ.. రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. -
సీఐ, ఎస్ఐకి రూ.15 లక్షల లంచం?
బనశంకరి: గోకాక్ సీఐ గోపాల్ రాథోడ్, ఎస్ఐ ఒక హత్యకేసులో అమాయకులను అరెస్ట్‌చేసి రూ.15 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. 2021 జూలై 17 గోకాక్‌లోని మహంతేశ్ నగర లేఔట్లో మంజునాథ మురకిబావి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సిద్దప్ప బబలి పిల్లలైన కృష్ణ, అర్జున్ అనే ఇద్దరిని అరెస్ట్‌చేశారు. నిందితుల అక్క కుమార్తెను మంజునాథ ప్రేమించేవాడని, అదే హత్యకు కారణమని ఎవరో చెప్పడంతో తమవారిని సీఐ అరెస్టు చేశాడని నిందితుల బంధువులు ఆరోపించారు. అంతేగాక భారీగా డబ్బు ఇవ్వకపోతే కుటుంబసభ్యులపై కూడా కేసు పెడతామని బెదిరింపులకు దిగారని, ఇలా అప్పటి గోకాక్ సీఐ గోపాల్ రాథోడ్, ఎస్ఐ రూ.15 లక్షలు లంచం తీసుకున్నారని సిద్దప్పబబలి కుటుంబసభ్యులు ఆరోపించారు. భూమి కుదవపెట్టి డబ్బు ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని వారు ఆదివారం మీడియా ముందు కన్నీరు పెట్టారు. ఈ విషయమై దర్యాప్తు చేయాలని ఏఎస్పీని ఎస్పీ లక్ష్మణ నింబరగి ఆదేశించారు. (చదవండి: అన్నను దారుణంగా చంపిన తమ్మడు) -
లంచం తీసుకోవాలంటే భయపడాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అవినీతి నిరోధక చర్యల విషయంలో ఏసీబీ పనితీరు ఆశించిన మేర లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లంచాలు ఇచ్చే పరిస్థితి ఎక్కడా ఉండకూడదని, ఎమ్మార్వో కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో ఎక్కడా అవినీతి కనిపించకూడదని, లంచం తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాల్సిందేనని సీఎం స్పష్టం చేశారు. అందుకోసం ఏసీబీ అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలకంగా.. అంకిత భావంతో పనిచేయాలని ఆయన ఆదేశించారు. ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని, అవినీతి తిమింగలాల భరతం పట్టాలని ఏసీబీ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గురువారం క్యాంపు కార్యాలయంలో ఏసీబీ(అవినీతి నిరోధక విభాగం) పనితీరుపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏ సదుపాయాలు కావాలన్నా ఇస్తాం: సీఎం రాష్ట్రంలో అవినీతి నిరోధానికి 14400 కాల్‌సెంటర్ ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. దాని ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయని పేర్కొన్నారు. కాల్ సెంటర్ ఏర్పాటు వల్ల ఆశించిన ఫలితాలు కనిపించాల్సిందేనని ముఖ్యమంత్రి నిర్దేశించారు. ప్రజలెవరూ అవినీతి బారిన పడకూడదనే ఉద్దేశంతోనే కాల్ సెంటర్ ఏర్పాటు చేశామనే విషయాన్ని గుర్తుంచుకోవాలని ఏసీబీ0 అధికారులకు వివరించారు. సెలవులు లేకుండా పనిచేసి, మూడు నెలల్లోగా స్పష్టమైన మార్పు చూపించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అందుకోసం అవసరమైన మేర సిబ్బందిని తీసుకోవాలని, ఎలాంటి సదుపాయాలు కావాలన్న ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం జగన్ స్పష్టం చేశారు. మరో నెలరోజుల్లో పనితీరును మళ్లీ సమీక్షిస్తానని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ చీఫ్ విశ్వజిత్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీబీకి చిక్కిన వీఆర్ఓ
సాక్షి, రామచంద్రాపురం: రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే వీఆర్ఓ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పని చేసే వీఆర్ఓ వెంకటయ్య, మహ్మద్ జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి నుంచి గురువారం రూ.2 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు సెక్షన్లో పని చేసే వెంకటయ్య పహణీ నఖలు ఇచ్చేందుకు జాకీర్‌ను లంచం అడిగారు. రూ.6 వేల లంచం డిమాండ్ చేయగా రూ.4 వేలు ఇస్తానని చెప్పినా వెంకటయ్య వినిపించుకోలేదని, దాంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు జాకీర్ వివరించారు. వెలిమెల గ్రామంలోని సర్వే నంబర్ 361, 364లోని తన కుటుంబీకుల భూమి వివరాలకు సంబంధించిన రికార్డులు అవసరమై తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. రికార్డు సెక్షన్లో ఉన్న వెంకటయ్య లంచం అడిగాడని బాధితుడు వివరించారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలోవీఆర్‌ఓ వెంకటయ్యను వలపన్ని పట్టుకున్నారు. అనంతరం డీఎస్పీ రవి కుమార్ విలేకరులతో మాట్లాడుతూ జాకీర్ ఇచి్చన ఫిర్యాదుతో వెంకటయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని చెప్పారు. ఫిర్యాదులు వస్తున్నాయి: ఏసీబీ డీఎస్పీ రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో భూము ల విలువ బాగా పెరిగిందని, దాంతో అధికారులు కూడా లంచాలు ఆశిస్తున్నారనే ఫిర్యాదు లు పెరిగాయని ఏసీబీ డీఎస్పీ రవికుమార్ వివరించారు. ఆ అంశంపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు. -
పంచాయతీరాజ్‌లో మామూళ్ల పర్వం
సాక్షి, ఏలూరు(పశ్చిమగోదావరి) : గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా.. ప్రజలకు సేవలు అందాలన్నా జిల్లాలో పంచాయతీ వ్యవస్థే కీలకం. పంచాయతీ వ్యవస్థలో ఉన్నతాధికారుల వద్ద నుండి కిందిస్థాయి అధికారుల వరకూ మామూళ్ల మత్తులో ఊగుతున్నారు. వారు అడిగిన మేరకు మామూళ్లు ఇవ్వకుంటే వేధింపులకు గురి చేస్తున్నారు. జిల్లాలో 909 పంచాయతీలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రజలకు జిల్లా పంచాయతీ వ్యవస్థ సేవలందిస్తుంది. ఇటీవల కాలంలో రాష్ట్ర వ్యాప్త బదిలీల్లో భాగంగా జిల్లాలోనూ బదిలీలు జరిగాయి. జిల్లా పంచాయతీ విభాగంలో నిర్వహించిన బదిలీ విషయంలో లక్షల్లో చేతులు మారినట్లు తెలుస్తోంది. కీలకమైన మేజర్ పంచాయతీల్లో పోస్టింగ్ కావాలంటే కీలక అధికారికి లక్షల్లో ముట్టచెబితేనే పోస్టింగ్‌లు వేసినట్లు సమాచారం. అంతే కాకుండా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతిపాదన లేఖలు ఉన్నప్పటికీ సదరు ఉన్నతాధికారికి సొమ్ములు ముట్టచెపితేనే వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అంతే కాకుండా గ్రేడ్ 1 పంచాయతీలో కార్యదర్శులకు పోస్టింగ్ కావాలంటే ఒక రేటు, గ్రేడ్ 2 పంచాయతీలో పోస్టింగ్ కావాలంటే మరో రేటు ఇలా ఆయా పంచాయతీల స్థాయిని బట్టి సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది. పదోన్నతుల్లోనూ వసూళ్లు సాధారణ బదిలీలకంటే ముందుగా జిల్లా పంచాయతీలో బదిలీల ప్రక్రియను నిర్వహించారు. ఈ పదోన్నతుల్లో భాగంగా సుమారు 30మందికి పైగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతుల్లోనూ భారీ గానే చేతులు మారినట్లు తెలుస్తుంది. పదోన్నతులను బట్టి రూ.20వేల నుండి రూ.50వేల వరకూ ఉన్నతాధికారులకు చేరినట్లు సమాచారం. అదే విధంగా ఆపరేటర్ల పోస్టుల భర్తీలోనూ ఒక్కొక్కరి నుండి రూ.6వేల నుండి రూ.10వేల వరకూ సమర్పించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సొమ్ములు ఇవ్వకుంటే వేధింపులు డివిజనల్ స్థాయి పంచాయతీ అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల వరకూ జిల్లాలో వారి పరిధిలోని పంచాయతీలకు తనిఖీలకు వెళుతుంటారు. ఈ తనిఖీలకు అధికారులు నిర్ణయించిన మేరకు కార్యదర్శులు చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అంతే కాకుండా అధికారులు నిర్దేశించిన మొత్తాల్లో చెల్లించకుంటే సంబం ధిత కార్యదర్శులపై వేధింపులు తప్పవు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీలో వసూళ్ల పర్వానికి అడ్డుకట్ట వేయకుంటే జిల్లా పంచాయతీ వ్యవస్థ అవినీతి రొంపిలో కూరుకుపోయే ప్రమాదం ఉంది. -
ఈసారి ‘డేగ’ వంతు
సాక్షి, ముదిగొండ: ఏసీబీ వలలో ఎప్పుడూ అవినీతి చేపలే పడతాయి. ఈసారి మాత్రం ‘డేగ’ చిక్కుకుంది. పట్టాదారు పాత పాస్ పుస్తకంలో నమోదైన నాలుగు ఎకరాల 12 కుంటల భూమిని కొత్త పుస్తకంలోకి ఎక్కించేందుకు ఓ రైతు నుంచి పదివేల రూపాయలను లంచంగా ఇవ్వాలని వీఆర్ఓ డేగల రాజేంద్రం డిమాండ్ చేశాడు. ఈ అవినీతి ‘డేగ’ పైకి ఏసీబీ అధికారులు వల విసిరారు. రెడ్ హ్యాండెడ్‌గా పట్టేశారు. మండలంలోని గంధసిరి గ్రామ రైతు చెమట నాగేశ్వరరావు పేరిటగల పట్టాదారు పాత పాస్ పుస్తకంలో నాలుగు ఎకరాల 12 కుంటల భూమి వివరాలు నమోదయ్యాయి. వీటిని కొత్త పుస్తకంలోకి ఎక్కించేందుకు నాగేశ్వరరావు కుమారుడు వేణు, నాలుగు నెలల క్రితం దరఖాస్తు చేశాడు. అప్పటి నుంచి వీఆర్ఓ డేగల రాజేంద్రం వద్దకు, తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. పదివేల రూపాయలు ఇస్తేనే, కొత్త పాస్ పుస్తకంలోకి భూమి వివరాలు ఎక్కిస్తానని డేగల రాజేంద్రం స్పష్టంగా చెప్పాడు. అంత ఇచ్చుకోలేమని నాగేశ్వరరావు, ఆయన కుమారుడు వేణు చెప్పారు. కొద్ది రోజుల తరువాత, ఎనిమిదివేల రూపాయలకు వీఆర్ఓ దిగొచ్చాడు. ఈ మొత్తాన్ని ఆయనకు వేణు సమర్పించుకున్నాడు. కొత్త పాస్ పుస్తకం చేతికొచ్చింది. తీరా చూస్తే... అందులో, కేవలం రెండు ఎకరాల 23 కుంటల భూమి మాత్రమే ఎక్కింది. మిగతా, ఒక ఎకరం 28 కుంటలన్నర ఎక్కించలేదు. దీని కోసం, వేణు మళ్లీ ప్రదక్షిణ మొదలుపెట్టాడు. ఎన్నిసార్లు వెళ్లినా వీఆర్ఓ డేగల రాజేంద్రం పట్టించుకోవడం లేదు. మరో ఐదువేల రూపాయలు ఇస్తే... పని పూర్తవుతుందని వేణుకు గురువారం డేగల రాజేంద్రం ఫోన్ చేశాడు. వెంటనే ఖమ్మం చేరుకున్న వేణుకు, ఏం చేయాలో పాలుపోలేదు. తన గోడును వినిపించేందుకు ఏసీబీ అధికారుల వద్దకు వెళ్లాడు. అవినీతి ‘డేగ’ను ఇలా పట్టేశారు... లంచం కోసం వేణును, అతడి తండ్రిని పీక్కు తింటున్న ఆ ‘డేగ’ను వల వేసి పట్టుకునేందుకు ఏసీబీ అధికారులు పథకం వేశారు. ఖమ్మంలోని శ్రీశ్రీ సర్కిల్ వద్ద వేణు నుంచి ఐదువేల రూపాయలు తీసుకుంటున్న డేగల రాజేంద్రాన్ని వరంగల్ ఏసీబీ డీఎస్పీ ఎస్.ప్రతాప్, సీఐలు ఎస్వీ రమణమూర్తి, ప్రవీణ్‌కుమార్, వెంకట్... రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అక్కడి నుంచి రైతు కుమారుడు వేణును, వీఆర్ఓ డేగల రాజేంద్రాన్ని ముదిగొండ తహసీల్దార్ కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. డీటీ కరుణాకర్‌రెడ్డి, వీఆర్ఓ నాగలక్ష్మి నుంచి వివరాలు తెలుసుకున్నారు. రైతు వద్దనున్న పట్టాదార్ పాస్ పుస్తకాలను పరిశీలించారు. అతని నుంచి వివరా లు సేకరించి రికార్డ్ చేశారు. వీఆర్ఓ డేగల రాజేంద్రాన్ని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు తరలించనున్నట్టు విలేకరులకు డీఎస్పీ ప్రతాప్ తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం అడిగినా, రైతుల పట్టాదార్ పాస్ పుస్తకాల విషయంలో ఏమైనా ఇబ్బంది పెట్టినా ఏసీబీ అధికారులకు 94407 00049 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని కోరారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ
విజయవాడ: గవర్నర్‌పేట సీఐ పవన్ కుమార్ లంచం తీసుకుంటూ దొరికిపోయారు. నగలకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో తెనాలికి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి రూ. ఐదున్నర లక్షలు సీఐ డిమాండ్ చేశారు. నగల వ్యాపారి ఓ పోలీసు ఉన్నతాధికారి బంధువు కావడంతో ఈ విషయాన్ని ఆయనకి తెలియజేశారు. ఈ విషయం చివరికి నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావుకు తెలిసింది. విచారణలో సీఐ డబ్బులు డిమాండ్ చేసినట్లు రుజువు కావడంతో సీఐపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కానిస్టేబుల్ విష్ణుపై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఒకే ఒక్కడు..
‘చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారు’.. అన్నట్లు తయారైంది ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి వ్యవహారం. ఓ ప్రజాప్రతినిధి మనిషిని అంటూ కార్యాలయానికి వచ్చేవారిని బెదిరిస్తున్నాడు. ఆ ఉద్యోగి మాట కాదన్నారంటే చాలు ఏకంగా కార్యాలయాన్నే తరలిస్తాం.. అంటూ హెచ్చరికలూ జారీ చేస్తున్నాడు! ఇదెక్కడి లేనిపోని తలనొప్పి అంటూ అక్కడికి వచ్చే కాంట్రాక్టర్లు, ఇతర ఉద్యోగులు ఆ కాంట్రాక్ట్ ఉద్యోగి చేతి తడిపి పని చేసుకుంటున్నారు. లేదంటే ఫైలు కదలదండోయ్! బాన్సువాడ టౌన్ : డివిజన్ కేంద్రంలోని పంచాయ తీ రాజ్ కార్యాలయంలో ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి బరితెగించాడు. బోధన్ ఎమ్మెల్యే అనుచరుడిని.. అం టూ సదరు ప్రభుత్వ ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిన పట్టించుకునేనాథుడే కరువయ్యా రు. సదరు ఎమ్మెల్యే పేరు చెప్పి బాన్సువాడలో ఉ న్న పంచాయత్ రాజ్ డివిజన్ కార్యాలయాన్ని బో ధన్‌కు తరలిస్తానని బెదిరిస్తున్నారు. నిత్యం బిల్లు ల కోసం కార్యాలయానికి వచ్చే కాంట్రాక్టర్ల నుం చి అందినంత దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాన్సువాడ పంచాయత్ రాజ్ డివిజన్ కార్యాలయంలో కాంట్రాక్ట్ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఓ కంప్యూటర్ ఆపరేటర్ అన్ని తానై వ్యవరిస్తున్నారు. సదరు ఆపరేటర్ జుక్కల్ నియో జకర్గ బాధ్యతలు వ్యవరిస్తున్నారు. జుక్కల్ నియో జకవర్గంలో ఏ అభివృద్ధి పని జరిగినా ఆ పనికి సంబంధించిన ప్రతి బిల్లు ఈ ఆపరేటర్ కంప్యూటరీకరణ చేసి ఫైల్‌ను ఉన్నతాధికారి టేబుల్‌పైకి పం పిస్తారు. జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, మద్నూర్ మండలాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు, మెట ల్ రోడ్లుకు సంబంధించిన బిల్లులు మంజూ రు కావాలంటే సదరు కాంట్రాక్టర్లు బాన్సువాడ డివిజన్ కార్యాలయానికి రావాల్సిందే. కార్యాల యం లోకి రాగానే ముందుగానే సదరు ఆపరేటర్ ను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఆపరేటర్‌ను కలిసి బిల్లుకు సంబంధించిన పత్రాలను కంప్యూటర్లో నమోదు చేసి ఫైల్‌ను డీఈ, ఈఈ టేబుల్‌పైకి పం పించాలి. ఫైల్ కదలాలంటే సదరు ఆపరేటర్ చేయి తడపాల్సిందే. చేయి తడిపితేనే ఫైల్ ప్రాసె స్ ముందుకు కదులుతుంది. లేదంటే ఏదో ఓ సాకు చెప్పి ఫైల్ వెనక్కివెళ్తుంది. కార్యాలయానికి వచ్చే ఏ వ్యక్తితోనైన మాటలు కలుపుకుని బాన్సువాడలో ఉన్న డివిజన్ కార్యాలయంలో బోధన్‌కు తరలిస్తానని చెప్పడం అలవాటైంది. బోధన్ ఎమ్మెల్యేతో నాకు మంచి సంబంధాలు ఉ న్నాయని చెప్పడం గమనార్హం. జుక్కల్ నియోజకవర్గం కాంట్రాక్టర్లకే కాదు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అనుచరుల వద్ద కూడా ముక్కుపిండి మరి వసూలు చేసిన సంఘటలను ఉన్నా యని తెలిసింది. సదురు ఆపరేటర్ బోధన్, నిజా మాబాద్, ఆర్మూర్ ప్రాంతాలో రూ.కోట్లాది విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం. -
లంచం.. లంచం
సాక్షి, యాదాద్రి : లంచం.. లంచం.. ప్రభుత్వ శాఖల్లో ఏ స్థాయిలో చూసినా, ఏ నోటా విన్నా ఇదే పదం..! నెలనెలా వేలకువేలు జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులు.. అక్రమార్జన కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అవకాశం దొరికిందం టే అందిన కాడికి దండుకుందామని అక్రమ మా ర్గాలను ఎంచుకుంటున్నారు. ఇందుకోసం ప్రతి పనికి ఓ రేటు నిర్ణయిస్తున్నారు. వారు అడిగినంత ఇచ్చుకోకపోతే ఫైల్ కదపరు. ఇదీ.. జిల్లాలో పలు శాఖల్లో నడుస్తున్న తంతు. వారి వేధింపులు తాళలేక, అడిగినంత ఇచ్చుకోలేక విధిలేని పరిస్థితుల్లో బాధితులు ఏసీబీ గడప తొక్కుతున్నారు. అవినీతి నిరోధక శాఖకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి జైలుపాలవుతున్నా సదరు వ్యక్తుల్లో మార్పు రావడం లేదు. జైలుకు వెళ్లడం, బెయిల్‌పై రావడం, తిరిగి విధుల్లో చేరడం ఒక ప్రక్రియగా మారిపోయింది. నిఘా పెంచిన ఏసీబీ జిల్లాలో అన్ని స్థాయిల్లోని ఉద్యోగులపై ఫిర్యాదులు లేకపోలేదు. ఇటీవల కాలంలో పెరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు ముందు ఇళ్లు, భవన నిర్మాణాల అనుమతుల కోసం కార్యదర్శులు, ఈఓపీఆర్డీలు పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.దీంతో పాటు ట్రాన్స్‌కో, సబ్‌రిజి స్ట్రార్ కార్యాలయాల్లోనూ సిబ్బంది అక్రమాలకు పాల్ప డుతున్నట్లు అవినీతి నిరోధక శాఖ దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటి అనుమతి కోసం ఈనెల 1న చౌటుప్పల్ ఈఓపీఆర్డీ ఓ వ్యక్తి నుంచి రూ.70వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు. జిల్లాలో కలకలం రేపిన ఈ ఘటన మరువక ముందే రెండు రోజుల క్రితం భువనగిరి సబ్‌డివిజన్ టీఎస్ ఎస్పీడీసీఎల్ డీఈ అవినీతి నిరోధక శాఖకు పట్టబడడం జిల్లాలో తీవ్ర చర్చనీయాంశమైంది. మరికొందరిపైనా ఫిర్యాదులు అందినందున నిఘా కొనసాగుతోందని ఏసీబీ అధికారి ఒకరు చెప్పారు. డబ్బు లేనిదే పని జరగదు ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరికీ లంచం తీసుకోవడం ప్రక్రియగా మారిపోయింది. డబ్బు లేని దే పనులు జరగడం లేదు. రెండున్నరేళ్ల కాలంలో చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు నిదర్శనం. 2015లో 21 మంది ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడగా 2016లో తొమ్మిది చిక్కారు. 2017లో ఏడుగురు, 2018లో ఇప్పటి వరకు ఆరుగురుని వలపన్ని పట్టుకున్నా రు. ఇప్పటి వరకు ఏసీబీకి పట్టుబడిన వారిలో విద్యుత్, రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ ఉద్యోగులే ఉన్నారు. వీరితోపాటు సబ్‌ట్రెజరీ, సబ్‌రిజిస్ట్రార్, ఆర్టీఏ, నీటి పారుదల శాఖ, సివిల్ సప్లయ్, చేనేత జౌళి శాఖ, విద్యాశాఖ, ఎక్సైజ్, టౌన్‌ప్లానింగ్, పోలీసు, ఇంజనీరింగ్ శాఖలు, దేవాదాయ శాఖల అధికారులపైనా ఏసీబీకి ఫిర్యాదులు అందుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా లంచాలు..! జిల్లాలో ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న అధికారులు మెజార్టీగా హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. వీరిలో చాలా వరకు తమ అక్రమ లావాదేవీలకు సంబంధించిన కార్యకలాపాలను హైదరాబాద్‌లోనే చేపడుతుంటారు. భువనగిరి సబ్ డివిజన్ టీఎస్ ఎస్పీడీసీఎల్ డీఈ దుర్గారావు హై దరాబాద్లోనిలో గల తన నివాసంలో ఆ సంస్థకు చెందిన ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఇలాంటి ఘటనలు గతంలోనూ చోటు చేసుకున్నాయి. పలు శాఖల అధి కారులు హైదరాబాద్‌లోని హోటళ్లు, తమ నివాస గృహాలకు లంచాలు ఇచ్చే వారిని రప్పించుకుని తీసుకోవడం పరిపాటిగా మారింది. ఏజెంట్ల ద్వారా లంచాల స్వీకరణ పలు శాఖల్లో పనుల కోసం నేరుగా వెళ్లే వారికి జరగడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారులు కొంత మంది ఏజెంట్లను నియమించుకుని వారి ద్వారా లంచాలు నిర్ణయించుకుని పనులు పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఏసీబీకి చిక్కకుండా ఉండేందుకు ఎక్కువ మంది ఈమార్గాన్ని ఎంచుకున్నారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి కార్యాలయాల వరకు నడుస్తున్న తంతు.. ఏసీబీ అధికారుల దృష్టికి సైతం రావడంతో వారు పరిశీ లన జరుపుతున్నట్లు తెలుస్తోంది. -
జగిత్యాల ప్రజావాణిలో కలకలం
సాక్షి, జగిత్యాల: జగిత్యాల ప్రజావాణిలో సోమవారం కలకలం రేగింది. తండ్రి ఆస్తిని తనపేర విరాసత్ చేయడానికి రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపిస్తూ దంపతులు ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే ప్రయత్నం చేశారు. రెవెన్యూ అధికారుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని, పైగా భారీ మొత్తం డబ్బులు లంచంగా డిమాండ్ చేస్తున్నారని ఎండి మౌలా అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు. మౌలా దంపతులు సోమవారం ఉదయం జగిత్యాలకు వచ్చి రెవెన్యూ కార్యాలయం ఎదుట ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. గమనించిన స్థానికులు, అధికారులు వెంటనే వారి వద్దకు వెళ్ళి వారించారు. వారిని ప్రజావాణి నిర్వహిస్తున్న అధికారుల వద్దకు తీసుకెళ్ళారు. సమస్యను పరిశీలించి పరిష్కరిస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. -
జడ్జీలకు లంచం కేసులో నేడు తీర్పు
న్యూఢిల్లీ: జడ్జీలకు లంచం ఆరోపణలపై దాఖలైన పిటిషన్ విచారణార్హతపై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఈ అంశంపై మంగళవారం తీర్పు వెలువరించే అవకాశముందని జస్టిస్ ఆర్కె అగర్వాల్ నేతృత్వంలోని త్రిసభ్య బెంచ్ తెలిపింది. పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని, అది న్యాయవ్యవస్థ గౌరవానికి భంగం కలిగించేలా ఉందని అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ అన్నారు. ఈ పిటిషన్‌ను నవంబర్ 9న జస్టిస్ జే.చలమేశ్వర్, ఎస్.అబ్దుల్ నజీర్‌ల ధర్మాసనం విచారణకు స్వీకరిస్తూ ఐదుగురు అత్యంత సీనియర్లతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారించాలని ఆదేశించింది. సీజేఐ జస్టిస్ మిశ్రా నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అత్యవసరంగా సమావేశమై. ‘ధర్మాసనాల ఏర్పాటు, కేసుల అప్పగింత అధికారం పూర్తిగా ప్రధాన న్యాయమూర్తికే ఉంటుంది’ అని తేల్చింది. ఫలానా సభ్యులతో ధర్మాసనం ఏర్పాటు, కేసు అప్పగింతకు ఇతర ధర్మాసనాలు ఆదేశాలు జారీ చేయలేవని తేల్చి చెప్పింది. ఈ కేసుపై సుప్రీంకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించాలని సుప్రీంలో ఒక స్వచ్ఛంద సంస్థ పిటిషన్ దాఖలు చేసింది. -
'కేజ్రీవాల్ ఎవరికీ లంచం ఇవ్వలేదు కదా'
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఊరట కలిగింది. ఆయనపై గతంలో దాఖలైన ఓ క్రిమినల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఆయన తప్పు చేసినట్లుగా పిటిషన్ దారులు ఎటువంటి సాక్ష్యాధారాలు చూపించలేకపోయినందున ఆ పటిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ బబ్రు భాన్ తీర్పు వెలువరించారు. ఢిల్లీ ఎన్నికల సమయంలో ప్రచారం సందర్భంగా అరవింద్ కేజ్రీవాల్ ఓటర్లను పక్కదారి పట్టించేలా వ్యవహరించారని, మిగితా అన్ని పార్టీల నుంచి డబ్బులు తీసుకోవచ్చని, కానీ ఓట్లు మాత్రం తమకే వేయాలని వారిని మభ్య పెట్టారని, అది ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినట్లే అవుతుందని ఆరోపిస్తూ ఇక్రాంత్ శర్మ అనే వ్యక్తి పిటిషన్ వేశాడు. అయితే, వ్యక్తిగతంగా కేజ్రీవాల్ ఎవరికీ లంఛం ఇవ్వలేదని, ఇతరులు ఇస్తే మాత్రం తీసుకోవచ్చని మాత్రమే చెప్పారని ఈ సందర్భంగా పిటిషన్ దారుకు కోర్టు తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 2015లో ఈ పిటిషన్ దాఖలైంది.