లంచం డబ్బులతో పట్టుబడిన వీఆర్‌ఓ వెంకటయ్య
సాక్షి, రామచంద్రాపురం: రామచంద్రాపురం తహసీల్దార్ కార్యాలయంలో పని చేసే వీఆర్‌ఓ ఒకరు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పని చేసే వీఆర్‌ఓ వెంకటయ్య, మహ్మద్ జాకీర్ హుస్సేన్ అనే వ్యక్తి నుంచి గురువారం రూ.2 వేల లంచం తీసుకుంటూ దొరికిపోయారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు సెక్షన్‌లో పని చేసే వెంకటయ్య పహణీ నఖలు ఇచ్చేందుకు జాకీర్‌ను లంచం అడిగారు. రూ.6 వేల లంచం డిమాండ్ చేయగా రూ.4 వేలు ఇస్తానని చెప్పినా వెంకటయ్య వినిపించుకోలేదని, దాంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు జాకీర్ వివరించారు. వెలిమెల గ్రామంలోని సర్వే నంబర్ 361, 364లోని తన కుటుంబీకుల భూమి వివరాలకు సంబంధించిన రికార్డులు అవసరమై తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నానని తెలిపాడు. రికార్డు సెక్షన్‌లో ఉన్న వెంకటయ్య లంచం అడిగాడని బాధితుడు వివరించారు. ఏసీబీ డీఎస్పీ రవికుమార్ ఆధ్వర్యంలోవీఆర్‌ఓ వెంకటయ్యను వలపన్ని పట్టుకున్నారు. అనంతరం డీఎస్పీ రవి కుమార్ విలేకరులతో మాట్లాడుతూ జాకీర్ ఇచి్చన ఫిర్యాదుతో వెంకటయ్యను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని చెప్పారు.
ఫిర్యాదులు వస్తున్నాయి: ఏసీబీ డీఎస్పీ
రామచంద్రాపురం తదితర ప్రాంతాల్లో భూము ల విలువ బాగా పెరిగిందని, దాంతో అధికారులు కూడా లంచాలు ఆశిస్తున్నారనే ఫిర్యాదు లు పెరిగాయని ఏసీబీ డీఎస్పీ రవికుమార్ వివరించారు. ఆ అంశంపై కూడా దృష్టి పెట్టినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment