లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ | Governorpet CI Pawan Kumar caught By Taking Bribe | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ సీఐ

Published Sat, Nov 17 2018 10:15 AM | Last Updated on Mon, Jul 29 2019 6:59 PM

Governorpet CI Pawan Kumar caught By Taking Bribe - Sakshi

విజయవాడ: గవర్నర్‌పేట సీఐ పవన్‌ కుమార్‌ లంచం తీసుకుంటూ దొరికిపోయారు. నగలకు సంబంధించిన బిల్లులు లేకపోవడంతో తెనాలికి చెందిన ఓ నగల వ్యాపారి నుంచి రూ. ఐదున్నర లక్షలు సీఐ డిమాండ్‌ చేశారు. నగల వ్యాపారి ఓ పోలీసు ఉన్నతాధికారి బంధువు కావడంతో ఈ విషయాన్ని ఆయనకి తెలియజేశారు. ఈ విషయం చివరికి నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమల రావుకు తెలిసింది. విచారణలో సీఐ డబ్బులు డిమాండ్‌ చేసినట్లు రుజువు కావడంతో సీఐపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ కేసుతో సంబంధం ఉన్న కానిస్టేబుల్‌ విష్ణుపై నాన్‌బెయిలబుల్‌ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement