సాక్షి, విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు.
గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు, ధర్మాన, జోగి రమేష్, చెల్లబోయిన వేణు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ అధ్యక్షుడు రుద్ర రాజు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు.
కాగా, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment