at home programme
-
రాజ్‌భవన్‌లో ఎట్ హోం.. బీఆర్ఎస్ నేతలు డుమ్మా
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ సహా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్, సీఎస్ శాంతకుమారి, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.కాగా, తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను, పద్మ అవార్డు గ్రహీతలను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పలికరించారు. మరోవైపు.. ఎట్ హోం కార్యక్రమానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రామిరెడ్డి హాజరయ్యారు. ఇక, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ నేతలు డుమ్మా కొట్టారు. సీఎం రేవంత్‌పై విమర్శలు చేయడంలో బీఆర్ఎస్ నేతలు నిమగ్నమయ్యారు. -
అమెరికాలో కాల్పులు.. నలుగురు మృతి
ఫ్లోరెన్స్: అమెరికాలో కెంటకీ రాష్ట్రం ఫ్లోరెన్స్‌లోని ఓ ఇంట్లో బర్త్ డే పార్టీ సందర్భంగా జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. శనివారం వేకువజామున ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాల్పులకు కారకుడిగా భావిస్తున్న యువకుడిని పోలీసులు వెంటాడారు. ఛేజింగ్ సమయంలో అతడు కారు సహా లోయలో పడిపోయాడని పోలీసులు తెలిపారు. అతడు తనను తాను కాల్చుకున్నాడని, గాయాలతో ఆస్పత్రిలో మృతి చెందాడని చెప్పారు. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉందన్నారు. -
ఏపీ గవర్నర్ ఎట్ హోం కార్యక్రమంలో సీఎం జగన్, వైఎస్ భారతి
-
హైదరాబాద్ రాజ్ భవన్ లో ఘనంగా ఎట్ హోం కార్యక్రమం
-
రాజ్‌భవన్‌లో ‘ఎట్ హోం’ కార్యక్రమం.. హాజరైన సీఎం జగన్ దంపతులు
సాక్షి, విజయవాడ: రిపబ్లిక్ డే సందర్భంగా రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్ హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దంపతులు హాజరయ్యారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఏర్పాటు చేసిన ఎట్ హోం కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. కాగా, శుక్రవారం ఉదయం విజయవాడలో పర్యటించిన సీఎం జగన్.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర దినోత్సవంలో పాల్గొన్నారు. సాయంత్రం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆతిథ్యం ఇచ్చిన ఎట్ హోం కార్యక్రమానికి హాజరయ్యారు. -
At Home Event: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’ కార్యక్రమం (ఫొటోలు)
-
రాజ్‌భవన్ ఎట్‌హోం.. సీఎం జగన్ దంపతుల హాజరు
సాక్షి, విజయవాడ: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ తేనీటి విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీసమేతంగా హాజరయ్యారు. గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఈ కార్యక్రమం జరిగింది. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు కొట్టు, ధర్మాన, జోగి రమేష్, చెల్లబోయిన వేణు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, ఏపీసీసీ అధ్యక్షుడు రుద్ర రాజు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. కాగా, విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం సాయుధ దళాల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శకటాలతో వివిధ శాఖలు ప్రదర్శన నిర్వహించారు. -
ఎట్‌హోం కార్యక్రమంలో సీఎం జగన్ దంపతులు (ఫొటోలు)
-
ఎట్‌హోం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్
సాక్షి, విజయవాడ: గణతంత్ర దినోత్సవ వేడుకలు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో గురువారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సాయుధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అయితే, గణతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో ఎట్‌హోం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఎట్‌హోం కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ దంపతులు పాల్గొన్నారు. వారితో పాటుగా హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా కూడా పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గవర్నర్ తేనేటి విందుకు సీఎం గైర్హాజరు
సాక్షి, హైదరాబాద్: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్ ప్రాంగణంలో నిర్వహించిన తేనేటి విందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు గైర్హాజరయ్యారు. ఆయన ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్టు తొలుత సమాచారం అందినా, చివరి నిమిషంలో రద్దు అయినట్టు తెలుస్తోంది. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్, సీఎస్ సోమేశ్‌కుమార్, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తేనేటి విందు ముగిసిన తర్వాత గవర్నర్ విలేకరులతో మాట్లాడారు. వస్తారని కబురు అందింది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి, ముఖ్యమంత్రికి తాను స్వయంగా లేఖలు పంపి వ్యక్తిగతంగా ఆహ్వానించినట్టు తమిళిసై తెలిపారు. సీఎం కేసీఆర్ సాయంత్రం 6:55కు రాజ్‌భవన్‌కు చేరుకుంటారని సీఎంఓ నుంచి తమకు కబురు అందిందని చెప్పారు. తాను పుదుచ్చేరి నుంచి బయలుదేరి 6 గంటలకు రాజ్‌భవన్‌కు చేరుకున్నట్టు తెలిపారు. తనతో పాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సైతం సీఎం కేసీఆర్ కోసం నిరీక్షించినట్లు తెలిపారు. సీఎం రాకపోవడం, దురదృష్టశాత్తూ ఆయన కార్యాలయం నుంచి కూడా ఎలాంటి సమాచారం లేకపోవడంతో దాదాపు అర్ధగంట పాటు వేచి చూసి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు. గవర్నర్, సీఎం మధ్య నిర్మాణాత్మక సంబంధాలుండాలని తాను కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు. బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యల పరిష్కారానికి ఇన్చార్జి వీసీ చర్యలు తీసుకుంటున్నారని గవర్నర్ చెప్పారు. అతిథులందరికీ పలకరింపు గవర్నర్ నిర్వహించిన తేనేటి విందు (ఎట్ హోం) కార్యక్రమం ఆహ్లాదకరంగా సాగింది. స్వాతంత్య్ర సమరయోధులు, వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న ప్రముఖ వ్యక్తులు, పద్మశ్రీ అవార్డు గ్రహీతలు, డాక్టర్లు, ఇంజనీర్లు, స్వచ్ఛంద సేవకులను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కాగా గవర్నర్ అతిథులందరి వద్దకు వెళ్లి పలకరించారు. బీజేపీ ఎంపీ డి.అరవింద్, ఎమ్మెల్యే రఘునందన్ రావు, సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్సీ అమీనుల్ జాఫ్రీ, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్.రమణ, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. కరోనా సోకడంతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పాదయాత్రలో ఉండడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకాలేదు. ‘కనెక్ట్ ది చానల్సర్’కార్యక్రమం కింద వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో గెలుపొందిన 75 మంది విద్యార్థులకు గవర్నర్ పురస్కారాలు ప్రదానం చేశారు. -
ఆగస్టు 15న రాజ్‌భవన్‌లో "ఎట్ హోమ్" రద్దు
విజయవాడ: ఏపీలో ఆగస్టు 15న రాజ్‌భవన్‌లో జరగాల్సిన "ఎట్ హోమ్" కార్యక్రమాన్ని రద్దు చేశారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా "ఎట్ హోమ్" కార్యక్రమం రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. కాగా ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు పాటించాలని గవర్నర్ బిశ్వభూషణ్ తెలిపారు. వ్యాక్సిన్ వేయించుకున్నా.. జాగ్రత్తలు పాటించాలని ఆయన కోరారు. -
రాజ్‌భవన్‌లో ఘనంగా ఎట్ హోం
సాక్షి, అమరావతి: గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్‌భవన్‌లో ఆదివారం ఎట్ హోం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర విభజన అనంతరం తొలిసారిగా విజయవాడలో ఈ కార్యక్రమం జరగడం విశేషం. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇచ్చిన తేనీటి విందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రాజ్‌భవన్‌లో సీఎం వైఎస్ జగన్‌కు గవర్నర్ ప్రత్యేక ఆహ్వానం పలికారు. అనంతరం తేనీటి విందుకు హాజరైన వారి ప్రతి టేబుల్ వద్దకు వెళ్లి పలకరించి అభివాదం చేశారు. ఈ కార్యక్రమంలో శాసన సభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసన మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్, లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, వెలంపల్లి శ్రీనివాస్, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్ఎస్ రావత్, ప్రవీణ్ ప్రకాష్, సతీష్‌చంద్ర, నాగులాపల్లి శ్రీకాంత్, సిద్ధార్థ జైన్, అజయ్ జైన్, అర్జా శ్రీకాంత్, జె.వెంకట మురళీ, వినయ్ మోహన్, ప్రద్యుమ్న, గవర్నర్ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు, శాంతిభద్రతల ఏడీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీనియర్ ఐపీఎస్ అధికారులు ఎంవీ సురేంద్రబాబు, ఏఆర్ అనురాధ, హరీష్‌కుమార్, బత్తిన శ్రీనివాస్ పాల్గొన్నారు. అలాగే సమాచార శాఖ కమిషనర్ టి.విజయ్‌కుమార్‌రెడ్డి, తెలుగు భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురామ్, టీటీడీ అర్చకులు రమణ దీక్షితులు, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు, ఎమ్మెల్యేలు జోగి రమేష్, కైలే అనిల్‌కుమార్, ముదునూరి ప్రసాదరాజు, కొఠారు అబ్బయ్యచౌదరి, పుప్పాల శ్రీనివాసుబాబు, సీనియర్ పాత్రికేయుడు తుర్లపాటి కుటుంబరావుతోపాటు పలువురు రాజకీయ నాయకులు, స్వాతంత్య్ర సమరయోధులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమానికి హాజరైన మంత్రులు, అధికారులు చంద్రబాబుతో సహా ప్రతిపక్ష సభ్యులు గైర్హాజరు.. ప్రతియేటా రిపబ్లిక్ డే రోజున రాజ్‌భవన్‌లో గవర్నర్ ఆనవాయితీగా ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. అధికార, ప్రతిపక్ష పార్టీల ప్రతినిధులతోపాటు రాజకీయ పార్టీల నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు తేనీటి విందు ఇస్తుంటారు. ఈ సారి ఏపీలో తొలిసారిగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రతిపక్ష నేత చంద్రబాబుతోపాటు టీడీపీకి చెందిన సభ్యులు ఎవరూ హాజరు కాకపోవడం గమనార్హం. గవర్నర్‌తో అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ భేటీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌తో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్‌లు వేర్వేరుగా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను తమ్మినేని సీతారాం శనివారం సాయంత్రం మర్యాదపూర్వకంగా కలిశారు. వారిద్దరి మధ్య రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. మండలి చైర్మన్ ఎంఏ షరీఫ్ ఆదివారం ఉదయం గవర్నర్‌ను కలిశారు. పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు వంటి కీలక బిల్లులు మండలిలో చర్చకు రాకుండా ప్రతిపక్ష టీడీపీ అడ్డుకోవడం, రూల్–71 కింద చర్చ చేపట్టడం, చివరకు ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు ప్రధాన బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతామంటూ ప్రకటించడం వంటి కీలక పరిణామాల నేపథ్యంలో గవర్నర్‌ను చైర్మన్ షరీఫ్ కలవడం చర్చనీయాంశమైంది. మండలిలో చోటు చేసుకున్న పరిణామాలు వారి మధ్య చర్చకు వచ్చినట్టు సమాచారం. సోమవారం అసెంబ్లీ సమావేశం కానుండటంతో మండలి కొనసాగింపులో ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే ఆసక్తి సర్వత్రా నెలకొన్న తరుణంలో గవర్నర్‌తో స్పీకర్, మండలి చైర్మన్ భేటీ కావడం గమనార్హం. -
రాజ్‌భవన్‌లో ఘనంగా ఎట్ హోం కార్యక్రమం
-
రాజ్‌భవన్‌లో ఘనంగా ఎట్ హోం కార్యక్రమం
సాక్షి, అమరావతి : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, స్పీకర్ తమ్మినేని సీతారాం, శాసనమండలి చైర్మన్ షరీఫ్,మంత్రులు బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్, వెల్లంపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరయ్యారు.గణతంత్ర దినోత్సవాన్ని పురష్కరించుకుని ప్రతి ఏడాది రాజ్‌భవన్‌లో ఎట్ హోం కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయిగా వస్తోంది. -
రాష్ట్రపతి నిలయంలో 'ఎట్ హోం'
సాక్షి, హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో మంగళవారం ‘ఎట్ హోమ్’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్‌లతో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నాలుగు రోజులుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఈ రోజు సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహిస్తారు. కాగా, నగరంలో నాలుగు రోజుల పర్యటన అనంతరం 27వ తేదీ ఆయన ఏపీ రాజధాని అమరావతికి బయల్దేరుతారు. -
పవన్‌కు గవర్నర్ ఆహ్వానం
- రాజ్ భవన్లో 'ఎట్ హోం' కార్యక్రమం - హాజరుకానున్న ప్రముఖులు హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం రాజ్ భవన్ లో విందు ఇవ్వనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ ‘ఎట్ హోం’ పేరిట తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, ప్రతిపక్షనేతలు సహా అధికారులు అంతా హాజరవుతారు. ఈ సారి ఎట్ హోం కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయన రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం. -
రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’
హైదరాబాద్: బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఏర్పాటు చేసిన ‘ఎట్ హోమ్’ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వారం రోజులుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి నిలయంలో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి ఛైర్మన్ స్వామిగౌడ్, ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ, పలువురు మంత్రులు, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నేతలు, సాయుధ దళాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. దక్షిణాది రాష్ట్రాల పర్యటన ముగియటంతో శనివారం ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ఢిల్లీకి తిరుగు పయనం అవుతారు. -
రాష్ట్రపతి నిలయంలో ‘ఎట్ హోం’
-
అపోహలకు తావివ్వకండి: నరసింహన్
* తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో గవర్నర్ నరసింహన్ * ‘ఎట్ హోం’ అనంతరం 45 నిమిషాలు ఏకాంతంగా భేటీ * ఎంసెట్, నాగార్జునసాగర్ వివాదంపై మంతనాలు! * చర్చించుకుని పరిష్కరించుకోవాలని సూచన * ఆహ్లాదంగా సాగిన ‘ఎట్ హోం’ కార్యక్రమం * హాజరైన ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు, ప్రముఖులు * అందరి దగ్గరికీ వెళ్లి చొరవగా పలకరించిన గవర్నర్ దంపతులు సాక్షి, హైదరాబాద్: ‘‘రెండు రాష్ట్రాల మధ్య ఏవైనా సమస్యలు ఉంటే కూర్చుని చర్చించుకుని పరిష్కరించుకోండి. అనవసరమైన అపోహలకు అవకాశం కల్పించకండి. లేని వివాదాలకు తావివ్వకండి...’’.. అని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. 66వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ సోమవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో నిర్వహించిన ‘ఎట్ హోం’ కార్యక్రమానికి తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఆ కార్యక్రమం ముగిసిన అనంతరం కేసీఆర్, చంద్రబాబుతో తన నివాసంలో గవర్నర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం దాదాపు 45 నిమిషాల పాటు సాగింది. కొద్దిరోజులుగా తెలంగాణ, ఏపీ మధ్య ఎంసెట్ నిర్వహణతోపాటు ప్రాజెక్టుల్లో నీళ్లు, విద్యుత్ తదితర అంశాలపై వివాదాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దాంతో ఇప్పటికే ఇరు రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులతో పలుమార్లు గవర్నర్ భేటీ అయ్యారు. ఒకసారి ఇద్దరు సీఎంల తోనూ సమావేశం జరిగినా సమస్య ఓ కొలిక్కి రాలేదు. ఈ సమస్యలను చర్చించుకుని పరిష్కరించుకోవాలని నరసింహన్ పలుమార్లు సూచించారు కూడా. ఈ నేపథ్యంలో ‘ఎట్ హోం’ రూపంలో కలిసివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న గవర్నర్ ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి చర్చించారు. ఎంసెట్ మాత్రమేగాకుండా నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల వ్యవహారం ఇటీవల ప్రధాన సమస్యగా మారింది. సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. కృష్ణా నదీ జలాల వివాదం ఇంకా పెండింగ్‌లోనే ఉంది. ఈ అంశాలపైనా సీఎంల మధ్య చర్చ జరిగి నట్లు భావిస్తున్నారు. ఎంసెట్ నిర్వహణపై పంతానికి పోకుండా చెరో ఏడాది నిర్వహించుకోవాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం. ఇద్దరు సీఎంలు మాట్లాడుకుంటారు ఈ భేటీకి ముందు ‘ఎట్ హోం’ కార్యక్రమం నుంచి సీఎంలను తన నివాసంలోకి తీసుకుని వెళుతూ గవర్నర్ మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. ‘‘రెండు రాష్ట్రాల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. చూస్తున్నారు కదా.. ఇద్దరు సీఎంలూ ఎంతో ఆనందంగా ఉన్నారు. అందరికీ మంచి జరిగేలా, అన్ని సమస్యలపై ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటారు..’’ అని గవర్నర్ చెప్పారు. అందరికీ పలకరింపు: ‘ఎట్ హోం’ కార్యక్రమానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల స్పీకర్లు మధుసూదనాచారి, కోడెల శివప్రసాద్, తెలంగాణ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ హాజరయ్యారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, నాయిని నర్సింహారెడ్డి, హరీశ్‌రావు, కేటీఆర్ సహా మంత్రులంతా వచ్చారు. ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం మంత్రులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, అచ్చెన్నాయుడు హాజరయ్యారు. కాంగ్రెస్ నుంచి సీఎల్పీ నేత జానారెడ్డి, డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, సీపీఐ నుంచి చాడ వెంకటరెడ్డి పాల్గొన్నారు. అధికార టీఆర్ఎస్కు చెందిన పలువురు ఎమ్మెల్యేలూ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి వచ్చిన ఇరు రాష్ట్రాల మంత్రులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, అధికారులను ఒక్కో టేబుల్ వద్దకు వెళుతూ గవర్నర్ దంపతులు కలిశారు. ఇద్దరు ‘చంద్రుల’ ముచ్చట్లు ‘ఎట్ హోం’కు హాజరైన కేసీఆర్, చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్ సీటుకు అటూ ఇటూ ఇద్దరు ముఖ్యమంత్రులకు సీట్లు కేటాయించారు. అయితే గవర్నర్ సీట్లో లేని సమయంలో కేసీఆర్, చంద్రబాబు ఒకొరికొకరు దగ్గరగా వచ్చి మాట్లాడుకున్నారు. దీనిని చూసిన నేతలంతా... ఆ ఇద్దరు సీఎంలు ఏం మాట్లాడుకుని ఉంటారని ఆసక్తిగా చర్చించుకోవడం కనిపించింది. ‘ఏపీ రాజధానిని తుళ్లూరులోనే ఏర్పాటు చేసుకోండి. నదికి అభిముఖంగా రాజధాని నగరం ఉంటే మంచిది..’ అని చంద్రబాబుతో కేసీఆర్ వ్యాఖ్యానించారని తెలిసింది. -
ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ఒబామా దంపతులు రాష్ట్రపతి భవన్‌కు వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.