రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం.. బీఆర్‌ఎస్‌ నేతలు డుమ్మా | Jishnu Dev Varma And CM Revanth Participated In At Home Program | Sakshi
Sakshi News home page

రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం.. బీఆర్‌ఎస్‌ నేతలు డుమ్మా

Published Thu, Aug 15 2024 7:48 PM | Last Updated on Thu, Aug 15 2024 8:21 PM

Jishnu Dev Varma And CM Revanth Participated In At Home Program

సాక్షి, హైదరాబాద్‌: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్ ‌హోం కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్‌ సహా మంత్రులు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పొంగులేటి, పొన్నం ప్రభాకర్‌, సీఎస్‌ శాంతకుమారి, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

కాగా, తెలంగాణ రాజ్‌భవన్‌లో ఎట్‌ హోం కార్యక్రమం జరుగుతోంది. ఈ సందర్భంగా స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబ సభ్యులను, పద్మ అవార్డు గ్రహీతలను గవర్నర్‌ జిష్ణు దేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పలికరించారు. మరోవైపు.. ఎట్‌ హోం కార్యక్రమానికి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌, బీజేపీ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట్ రామిరెడ్డి హాజరయ్యారు. ఇక, ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్‌ నేతలు డుమ్మా కొట్టారు. సీఎం రేవంత్‌పై విమర్శలు చేయడంలో బీఆర్‌ఎస్‌ నేతలు నిమగ్నమయ్యారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement