పవన్‌కు గవర్నర్ ఆహ్వానం
పవన్‌కు గవర్నర్ ఆహ్వానం
Published Tue, Aug 15 2017 12:35 PM | Last Updated on Sun, Sep 17 2017 5:33 PM
- రాజ్ భవన్‌లో 'ఎట్ హోం' కార్యక్రమం
- హాజరుకానున్న ప్రముఖులు
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ మంగళవారం రాజ్ భవన్ లో విందు ఇవ్వనున్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ ‘ఎట్ హోం’ పేరిట తేనీటి విందు ఇవ్వడం ఆనవాయితీ. ఈ కార్యక్రమానికి రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేబినెట్ మంత్రులు, ప్రతిపక్షనేతలు సహా అధికారులు అంతా హాజరవుతారు.
ఈ సారి ఎట్ హోం కార్యక్రమానికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆహ్వానం అందింది. గవర్నర్ ఆహ్వానం మేరకు ఆయన రాజ్‌భవన్‌లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నట్లు సమాచారం.
Advertisement
Advertisement