
ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్న ఒబామా
న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా దంపతులు రాష్ట్రపతి భవన్లో ఎట్ హోం కార్యక్రమంలో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం ఒబామా దంపతులు రాష్ట్రపతి భవన్కు వచ్చారు.
ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు.