
బనశంకరి: గోకాక్ సీఐ గోపాల్ రాథోడ్, ఎస్‌ఐ ఒక హత్యకేసులో అమాయకులను అరెస్ట్‌చేసి రూ.15 లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు గుప్పుమన్నాయి. 2021 జూలై 17 గోకాక్‌లోని మహంతేశ్ నగర లేఔట్‌లో మంజునాథ మురకిబావి అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఈ కేసులో సిద్దప్ప బబలి పిల్లలైన కృష్ణ, అర్జున్ అనే ఇద్దరిని అరెస్ట్‌చేశారు. నిందితుల అక్క కుమార్తెను మంజునాథ ప్రేమించేవాడని, అదే హత్యకు కారణమని ఎవరో చెప్పడంతో తమవారిని సీఐ అరెస్టు చేశాడని నిందితుల బంధువులు ఆరోపించారు.
అంతేగాక భారీగా డబ్బు ఇవ్వకపోతే కుటుంబసభ్యులపై కూడా కేసు పెడతామని బెదిరింపులకు దిగారని, ఇలా అప్పటి గోకాక్ సీఐ గోపాల్ రాథోడ్, ఎస్‌ఐ రూ.15 లక్షలు లంచం తీసుకున్నారని సిద్దప్పబబలి కుటుంబసభ్యులు ఆరోపించారు. భూమి కుదవపెట్టి డబ్బు ఇచ్చామని, తమకు న్యాయం చేయాలని వారు ఆదివారం మీడియా ముందు కన్నీరు పెట్టారు. ఈ విషయమై దర్యాప్తు చేయాలని ఏఎస్పీని ఎస్పీ లక్ష్మణ నింబరగి ఆదేశించారు.
(చదవండి: అన్నను దారుణంగా చంపిన తమ్మడు)