
సా క్షి, హైదరాబాద్: హైదరాబాద్ జీఎస్టీ కమిషనరేట్‌లోని పన్ను ఎగవేత నిరోధక విభాగంలో అవినీతికి పాల్పడ్డ ఇద్దరు అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. లంచం ఆరోపణలపై జీఎస్టీ సూపరింటెండెంట్ ఆనంద్ కుమార్‌తోపాటు ఇన్స్పెక్టర్ మనీష్ శర్మపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఐరన్ స్క్రాప్ గోదాంలో అక్రమాలపై జీఎస్టీ అధికారులు జరిమానా విధించారు. స్క్రాప్ గోదామును సీజ్ చేశారు. అనంతరం బాధితుడు నుంచి అయిదు లక్షల రూపాయలు లంచం తీసుకున్నారు. అయితే సీజ్ చేసిన గోదాంను ఓపెన్ చేసేందుకు మరో 3 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు సీబీఐని ఆశ్రయించాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన సీబీఐ.. రెండు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment