ఒకే ఒక్కడు.. | Bribe In Panchayati Raj Nizamabad | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు..

Published Tue, Aug 21 2018 12:46 PM | Last Updated on Wed, Oct 17 2018 6:10 PM

 Bribe In Panchayati Raj Nizamabad  - Sakshi

 బాన్సువాడ సబ్‌డివిజన్‌ పంచాయతీ రాజ్‌ కార్యాలయం 

‘చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకుంటున్నారు’.. అన్నట్లు తయారైంది ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి వ్యవహారం. ఓ ప్రజాప్రతినిధి మనిషిని అంటూ కార్యాలయానికి వచ్చేవారిని బెదిరిస్తున్నాడు. ఆ ఉద్యోగి మాట కాదన్నారంటే చాలు ఏకంగా కార్యాలయాన్నే తరలిస్తాం.. అంటూ హెచ్చరికలూ జారీ చేస్తున్నాడు! ఇదెక్కడి లేనిపోని తలనొప్పి అంటూ అక్కడికి వచ్చే కాంట్రాక్టర్లు, ఇతర ఉద్యోగులు ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగి చేతి తడిపి పని చేసుకుంటున్నారు. లేదంటే ఫైలు కదలదండోయ్‌!

బాన్సువాడ టౌన్‌ : డివిజన్‌ కేంద్రంలోని పంచాయ తీ రాజ్‌ కార్యాలయంలో ఓ కాంట్రాక్ట్‌ ఉద్యోగి బరితెగించాడు. బోధన్‌ ఎమ్మెల్యే అనుచరుడిని.. అం టూ సదరు ప్రభుత్వ ఉద్యోగులను భయబ్రాంతులకు గురి చేస్తున్న విషయం ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిన పట్టించుకునేనాథుడే కరువయ్యా రు. సదరు ఎమ్మెల్యే పేరు చెప్పి బాన్సువాడలో ఉ న్న పంచాయత్‌ రాజ్‌ డివిజన్‌ కార్యాలయాన్ని బో ధన్‌కు తరలిస్తానని బెదిరిస్తున్నారు. నిత్యం బిల్లు ల కోసం కార్యాలయానికి వచ్చే కాంట్రాక్టర్ల నుం చి అందినంత దండుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. బాన్సువాడ పంచాయత్‌ రాజ్‌ డివిజన్‌ కార్యాలయంలో కాంట్రాక్ట్‌ పద్ధతిన విధులు నిర్వహిస్తున్న ఓ కంప్యూటర్‌ ఆపరేటర్‌ అన్ని తానై వ్యవరిస్తున్నారు.

సదరు ఆపరేటర్‌ జుక్కల్‌ నియో జకర్గ బాధ్యతలు వ్యవరిస్తున్నారు. జుక్కల్‌ నియో జకవర్గంలో ఏ అభివృద్ధి పని జరిగినా ఆ పనికి సంబంధించిన ప్రతి బిల్లు ఈ ఆపరేటర్‌ కంప్యూటరీకరణ చేసి ఫైల్‌ను ఉన్నతాధికారి టేబుల్‌పైకి పం పిస్తారు. జుక్కల్‌ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, పిట్లం, నిజాంసాగర్, మద్నూర్‌ మండలాల్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీలు, కల్వర్టులు, మెట ల్‌ రోడ్లుకు సంబంధించిన బిల్లులు మంజూ రు కావాలంటే సదరు కాంట్రాక్టర్లు బాన్సువాడ డివిజన్‌ కార్యాలయానికి రావాల్సిందే. కార్యాల యం లోకి రాగానే ముందుగానే సదరు ఆపరేటర్‌ ను ప్రసన్నం చేసుకోవాల్సిందే.

ఆపరేటర్‌ను కలిసి బిల్లుకు సంబంధించిన పత్రాలను కంప్యూటర్‌లో నమోదు చేసి ఫైల్‌ను డీఈ, ఈఈ టేబుల్‌పైకి పం పించాలి. ఫైల్‌ కదలాలంటే సదరు ఆపరేటర్‌ చేయి తడపాల్సిందే. చేయి తడిపితేనే ఫైల్‌ ప్రాసె స్‌ ముందుకు కదులుతుంది. లేదంటే ఏదో ఓ సాకు చెప్పి ఫైల్‌ వెనక్కివెళ్తుంది. కార్యాలయానికి వచ్చే ఏ వ్యక్తితోనైన మాటలు కలుపుకుని బాన్సువాడలో ఉన్న డివిజన్‌ కార్యాలయంలో బోధన్‌కు తరలిస్తానని చెప్పడం అలవాటైంది.

బోధన్‌ ఎమ్మెల్యేతో నాకు మంచి సంబంధాలు ఉ న్నాయని చెప్పడం గమనార్హం. జుక్కల్‌ నియోజకవర్గం కాంట్రాక్టర్లకే కాదు మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అనుచరుల వద్ద కూడా ముక్కుపిండి మరి వసూలు చేసిన సంఘటలను ఉన్నా యని తెలిసింది. సదురు ఆపరేటర్‌ బోధన్, నిజా  మాబాద్, ఆర్మూర్‌ ప్రాంతాలో రూ.కోట్లాది విలువ చేసే ఆస్తులు కూడబెట్టుకున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement