మీడియా ట్రేడ్ మార్క్ వివాదం: ఆర్‌టీవీకి భారీ ఊరట | Trademark Infringement Bombay High Court Denies Interim Relief To Republic TV Against RTV - Sakshi
Sakshi News home page

మీడియా ట్రేడ్ మార్క్ వివాదం: ఆర్‌టీవీకి భారీ ఊరట

Published Fri, Sep 1 2023 12:51 PM | Last Updated on Fri, Sep 1 2023 1:44 PM

 trademark infringement Bombay High Court denies interim relief to RepublicTV against RTV - Sakshi

మీడియాలో ట్రేడ్ మార్క్ వివాదంలో తెలుగు న్యూస్‌ ఛానల్‌ ఆర్‌టీవీకి ఊరట లభించింది. రిపబ్లిక్ టీవీ లోగో, 'R'ను వినియోగించి  RTV న్యూస్‌ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలను కోర్టు బాంబే హైకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. ఈ వ్యాజ్యాన్ని విచారించే వరకు ఆర్‌టీవీ న్యూస్ లోగో వినియోగంపై అత్యవసర స్టే విధించాలని కోరుతూ రిపబ్లిక్ టీవీ వేసిన మధ్యంతర దరఖాస్తును జస్టిస్ మనీష్ పితలే తోసిపుచ్చారు.

జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ, రవిప్రకాష్‌ నేతృత్వంలోని R TV న్యూస్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు రూ.100 కోట్ల నష్ట పరిహారం కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. RTV తన ట్రేడ్‌మార్క్‌ను కాపీ కొట్టి, మోసపూరితంగా   వ్యవరించిందని  ఆరోపించింది. ఈ ఉల్లంఘనకు గాను ఆర్‌టీవీపై శాశ్వత నిషేధాన్ని విధించాలని కోరుతూ రిపబ్లిక్ TV మాతృ సంస్థ ARG Outlier మార్చి 2023లో దావా వేసింది. తాజాగా ఈ విషయంలో రిపబ్లిక్ టీవీకి  భారీ షాక్‌ తగిలింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement