trade mark registration
-
ఢిల్లీ హైకోర్టులో ఎలోన్ మస్క్ పిటిషన్.. ఎందుకంటే
టెస్లా పవర్ ఇండియా కంపెనీకి ఢిల్లీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. సంస్థ పేరు మీద ఎన్ని ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉన్నాయి. ఉంటే వాటి అమ్మకాలతో సహా ఇతర వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. గురుగావ్ కేంద్రంగా సేవలందిస్తున్న టెస్లా పవర్ ఇండియాపై అపరకుబేరుడు, టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన దావాపై పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌కు ప్రతిస్పందనగా ఢిల్లీ హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. టెస్లా పవర్‌పై కేసును హైకోర్టు గురువారం విచారించనుంది.టెస్లా కంపెనీ ట్రేడ్ మార్క్‌తో భారత్‌లోని స్థానిక సంస్థ టెస్లా పవర్ ఇండియా వినియోగిస్తోందని, దీనిపై గందరగోళం నెలకొందని.. వ్యాపార ప్రయోజనాలకు హాని కలిగిస్తోందని వాదించింది. అంతేకాదు టెస్లా పవర్ బ్యాటరీలపై తమకు (టెస్లా-యూఎస్) ఫిర్యాదులు అందుతున్నాయని ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లో టెస్లా వెల్లడించింది. టెస్లా పవర్ బ్యాటరీలు ఎలోన్ మస్క్ టెస్లా కంపెనీవేనని ప్రచారం చేయడం, లోగోను వినియోగించుకున్నట్లు హైలెట్ చేసింది. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మస్క్ తరుపు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేసింది. -
మీడియా ట్రేడ్ మార్క్ వివాదం: ఆర్టీవీకి భారీ ఊరట
మీడియాలో ట్రేడ్ మార్క్ వివాదంలో తెలుగు న్యూస్ ఛానల్ ఆర్టీవీకి ఊరట లభించింది. రిపబ్లిక్ టీవీ లోగో, 'R'ను వినియోగించి RTV న్యూస్ ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందన్న ఆరోపణలను కోర్టు బాంబే హైకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. ఈ వ్యాజ్యాన్ని విచారించే వరకు ఆర్టీవీ న్యూస్ లోగో వినియోగంపై అత్యవసర స్టే విధించాలని కోరుతూ రిపబ్లిక్ టీవీ వేసిన మధ్యంతర దరఖాస్తును జస్టిస్ మనీష్ పితలే తోసిపుచ్చారు. జాతీయ ఛానెల్ రిపబ్లిక్ టీవీ, రవిప్రకాష్ నేతృత్వంలోని R TV న్యూస్‌పై ట్రేడ్‌మార్క్ ఉల్లంఘనకు రూ.100 కోట్ల నష్ట పరిహారం కోరుతూ బాంబే హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. RTV తన ట్రేడ్‌మార్క్‌ను కాపీ కొట్టి, మోసపూరితంగా వ్యవరించిందని ఆరోపించింది. ఈ ఉల్లంఘనకు గాను ఆర్టీవీపై శాశ్వత నిషేధాన్ని విధించాలని కోరుతూ రిపబ్లిక్ TV మాతృ సంస్థ ARG Outlier మార్చి 2023లో దావా వేసింది. తాజాగా ఈ విషయంలో రిపబ్లిక్ టీవీకి భారీ షాక్ తగిలింది. -
ఆర్టీసీ.. ట్రేడ్‌మార్క్ రిజిస్టర్డ్!
పేరును దుర్వినియోగం చేస్తే చట్టరీత్యా చర్యలు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తన బ్రాండ్‌గా ‘ఏపీఎస్ఆర్టీసీ’ పేరును ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయిం చింది. ఇకపై ఈ ట్రేడ్‌మార్క్‌ను దుర్వినియోగం చేసే సంస్థలు, వ్యక్తులపై ఆర్టీసీ చట్టరీత్యా చర్యలు తీసుకోనుంది. బస్సు టికెట్ల బుకింగ్ కోసం ఆన్లైన్లో ఆర్టీసీ వెబ్‌పేజ్‌ను క్లిక్ చేస్తే ఏవేవో ప్రైవేటు ట్రావెల్స్ వివరాలు ప్రత్యక్షమవుతుంటాయి. దీంతో చాలామంది ప్రయాణికులు ఆయా సంస్థల నుంచే టికెట్లు కొంటున్నారు. తన బ్రాండ్‌ను దుర్వినియోగం చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బస్సు ప్రయాణ వివరాలు, సీట్ల బుకింగ్, శుభకార్యాలకు బస్సుల బుకింగ్, రెంట్ ఏ కార్, మార్కెటింగ్, పర్యటనలు, ప్రకటనలు.. పలు విషయాలకు సంబంధించి ఈ ట్రేడ్‌మార్క్‌ను వినియోగిస్తే ట్రేడ్‌మార్క్ చట్టం-1999 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది.