పేరును దుర్వినియోగం చేస్తే చట్టరీత్యా చర్యలు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ తన బ్రాండ్‌గా ‘ఏపీఎస్‌ఆర్టీసీ’ పేరును ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్ చేయిం చింది. ఇకపై ఈ ట్రేడ్‌మార్క్‌ను దుర్వినియోగం చేసే సంస్థలు, వ్యక్తులపై ఆర్టీసీ చట్టరీత్యా చర్యలు తీసుకోనుంది. బస్సు టికెట్ల బుకింగ్ కోసం ఆన్‌లైన్‌లో ఆర్టీసీ వెబ్‌పేజ్‌ను క్లిక్ చేస్తే ఏవేవో ప్రైవేటు ట్రావెల్స్ వివరాలు ప్రత్యక్షమవుతుంటాయి. దీంతో చాలామంది ప్రయాణికులు ఆయా సంస్థల నుంచే టికెట్లు కొంటున్నారు. తన బ్రాండ్‌ను దుర్వినియోగం చేసేవారిపై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. బస్సు ప్రయాణ వివరాలు, సీట్ల బుకింగ్, శుభకార్యాలకు బస్సుల బుకింగ్, రెంట్ ఏ కార్, మార్కెటింగ్, పర్యటనలు, ప్రకటనలు.. పలు విషయాలకు సంబంధించి ఈ ట్రేడ్‌మార్క్‌ను వినియోగిస్తే ట్రేడ్‌మార్క్ చట్టం-1999 ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించింది.