వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కొత్త బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వెల్లడించారు.
విజయవాడ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కొత్త బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వెల్లడించారు. మే 15 నుంచి విజయవాడ కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ కార్పొరేట్ ఆఫీస్ కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లోని ఆఖరి రెండు వరుసలకు ఛార్జీలో 20 శాతం తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. మార్చి ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా 81 ఆర్టీసీ బస్టాండ్ల ఆధునీకరణ చేస్తామని చెప్పారు.
ఈ ఏడాది వందకోట్ల మేరకు నష్టాలు తగ్గినట్టు తెలిపారు. ఆపరేషన్ నష్టాలను పూర్తి స్థాయిలో అధిగమించమన్నారు. 250 కిలీమీటర్లు ప్రయాణించినవారికి చుట్టుపక్కల తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రకటించారు.