samba siva rao
-
నారా లోకేష్ పీఏ సాంబశివరావుపై షాకింగ్ ఆరోపణలు
-
వారంలోగా బెల్టు షాపులు నిర్మూలించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వారంలోగా బెల్టు షాపుల్ని సమూలంగా నిర్మూలించాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ఎక్సైజ్ శాఖ కమిషనరేట్‌లో మంగళవారం అన్ని జిల్లాల అధికారులతో బెల్టు షాపుల నిర్మూలనపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కొద్ది రోజుల కిందట సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎక్సైజ్ శాఖపై సమీక్ష నిర్వహించి ఇచ్చిన ఆదేశాలతో ఎక్సైజ్ యంత్రాంగం కదిలింది. మద్యాన్ని ప్రజలకు దూరం చేసే విధంగా కార్యాచరణ రూపొందించాలని, బెల్టు షాపులు కనిపించకుండా చేయాలని సీఎం ఆదేశించడంతో ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగారు. ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయించాలని, తప్పు చేస్తే ఎవరినీ ఉపేక్షించబోమని స్పెషల్ సీఎస్ సాంబశివరావు స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల ప్రకారం మద్యాన్ని ప్రజలకు దూరం చేసేందుకు విద్యార్థుల్లో, యువతలో చైతన్య కార్యక్రమాలతోపాటు గ్రామాల్లో అవగాహన కల్పించాలన్నారు. బెల్టు షాపుల నిర్మూలన, మద్యాన్ని దూరం చేసే చైతన్య కార్యక్రమాలు బాగా నిర్వహించిన అధికారులకు రివార్డులు కూడా అందిస్తామన్నారు. గంజాయిపై సాగు దశ నుంచే నిఘా పెట్టి ధ్వంసం చేయాలని సూచించారు. తప్పు జరిగినట్లు నిర్ధారణ అయితే ఏ స్థాయి అధికారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే 27 వరకు రాష్ట్రంలో 9,246 బెల్టు షాపులపై కేసులు నమోదు చేసి 9,355 మందిని అరెస్ట్ చేశామన్నారు. అలాగే 644 వాహనాలను సీజ్ చేశామని తెలిపారు. బెల్టు షాపుల నిర్మూలనకు ప్రతి గ్రామానికి ఒక్కో కానిస్టేబుల్, ప్రతి మండలానికి ఒక్కో ఎస్సైకు బాధ్యతలు అప్పగిస్తామని ఎక్సైజ్ కమిషనర్ ముకేష్‌కుమార్ మీనా చెప్పారు. బెల్టు షాపుల నిర్మూలనపై రోజూ నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. -
కల్యాణమస్తు తరహాలో మరో పథకం
సాక్షి, తిరుమల: కల్యాణమస్తు పథకం తరహాలోనే మరో కొత్త పథకానికి నాంది పలకాలని టీటీడీ ఈవో సాంబశివరావు సంకల్పించారు. పెళ్లి వేడుకల పేరుతో పేద కుటుంబాలకు తిరుమల కల్యాణ వేదిక చేయూత అందించాలని భావిస్తున్నారు. ఇటీవల కల్యాణ వేదికను సందర్శించిన సాంబశివరావు మౌలిక వసతులు పెంచాలని అధికారులను ఆదేశించారు. ‘కల్యాణ వేదికలో పెళ్లి చేసుకునే జంటలకు చేయూత నివ్వాలని భావిస్తున్నాం. ఇప్పటికే కల్పిస్తున్న సౌకర్యాలను పెంచనున్నా’ మని ఆయన తెలిపారు. త్వరలోనే వివాహాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వివరాలను కూడా వెల్లడిస్తామని తెలిపారు. -
'ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తాం'
విజయవాడ: వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు వేల కొత్త బస్సులు నడుపుతామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు వెల్లడించారు. మే 15 నుంచి విజయవాడ కేంద్రంగా ఏపీఎస్ ఆర్టీసీ కార్పొరేట్ ఆఫీస్ కార్యకలాపాలు కొనసాగుతాయని ఆయన అన్నారు. ఆదివారం విజయవాడలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆర్టీసీ బస్సుల్లోని ఆఖరి రెండు వరుసలకు ఛార్జీలో 20 శాతం తగ్గించనున్నట్టు పేర్కొన్నారు. మార్చి ఆఖరునాటికి రాష్ట్రవ్యాప్తంగా 81 ఆర్టీసీ బస్టాండ్ల ఆధునీకరణ చేస్తామని చెప్పారు. ఈ ఏడాది వందకోట్ల మేరకు నష్టాలు తగ్గినట్టు తెలిపారు. ఆపరేషన్ నష్టాలను పూర్తి స్థాయిలో అధిగమించమన్నారు. 250 కిలీమీటర్లు ప్రయాణించినవారికి చుట్టుపక్కల తమ గమ్యస్థానాలు చేరుకునేందుకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తామని ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ప్రకటించారు. -
ఏఎన్‌యూ ఇన్‌ఛార్జి వీసీగా ఉదయలక్ష్మి
హైదరాబాద్: ర్యాగింగ్‌కు బలైన రిషితేశ్వరి ఉదంతంతో ఒక్కసారిగా వార్తల్లోకొచ్చిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇన్‌ఛార్జి బాధ్యతల నుంచి ప్రొఫెసర్ సాంబశివరావును ప్రభుత్వం తప్పించింది. ఆయన స్థానంలో.. కొత్తగా.. సాంకేతిక విద్యా కమిషనర్ ఉదయలక్ష్మికి ఇన్‌ఛార్జి వీసీగా బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉదయలక్ష్మికి ఉత్తర్వులు జారీ చేసింది. -
సామాజిక విప్లవకారుడు పూలే
బీసీ మహాజన సమితి అధ్యక్షుడు సాంబశివరావు ఏఎన్‌యూ: విశ్వమేధావి పూలే అని బీసీ మహాజన సమితి అధ్యక్షుడు సాంబశివరావు కొనియాడారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం మహాత్మా జ్యోతిరావు పూలే అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మా పూలే వర్ధంతి జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలోని పీడిత జాతుల విముక్తి ప్రదాత పూలే అని చెప్పారు. ఆధునిక భారతదేశ చరిత్రలో కులవ్యవస్థను సమగ్రంగా విశ్లేషించి కులనిర్మూలన కోసం రాజీలేని పోరాటం చేసిన సామాజిక విప్లవకారుడని పేర్కొన్నారు. పూలే సిద్ధాంతాలపై ఏఎన్‌యూ అధ్యయన కేంద్రంలో సమగ్రంగా పరిశోధనలు చేయాలని సూచించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వీసీ ఆచార్య కె.వియన్నారావు మాట్లాడుతూ పూలేపై ఇతర భాషల్లో ఉన్న గ్రంథాలు, రచనలను ఏఎన్‌యూ పూలే అధ్యయన కేంద్రం ఆధ్వర్యంలో తెలుగులో ప్రచురించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమానికి పూలే అధ్యయన కేంద్రం డెరైక్టర్ ఆచార్య నూర్‌బాషా అబ్దుల్ అధ్యక్షత వహించారు. రెక్టార్ ఆచార్య కె.ఆర్.ఎస్.సాంబశివరావు, రిజిస్ట్రార్ ఆచార్య పి.రాజశేఖర్, ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.మధుబాబు, సీడీసీ డీన్ ఆచార్య ఎం.కోటేశ్వరరావు, బీసీ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఎం.వి.ప్రసాద్, భావనారుషి, బీసీ విద్యార్థి సంఘం అధ్యక్ష, కార్యదర్శులు రామకృష్ణ, వెంకటకృష్ణ, తదితరులు పాల్గొన్నారు. సొషల్ సైన్స్ డీన్ తొలగింపు అన్యాయం యూనివర్సిటీ సోషల్ సైన్స్ డీన్‌గా నియమితులైన చంద్రకుమార్‌ను రెండునెలల్లో తొలగిం చడం అన్యాయమని ఏఎన్‌యూ ఎస్పీఎస్‌ఎఫ్ (గిరిజన విద్యార్థి సమాఖ్య) శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. గిరిజనుడైన చంద్రకుమార్‌ను అకారణంగా పదోన్నతి తొలగించడం అప్రజాస్వామికమని సంఘ నాయకులు పేర్కొన్నారు. ప్రకటన విడుదల చేసిన వారిలో ఎస్టీఎస్ఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ఎం.శ్రీనివాసనాయక్, డి.అంకన్న ఉన్నారు. నేడు మిణుగురులు సినిమా ప్రదర్శన యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో శనివారం మిణుగురులు సినిమా ప్రదర్శన జరుగుతుందని ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.మధుబాబు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటలకు డైక్మెన్ ఆడిటోరియంలో సినిమా ప్రదర్శన ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. -
పనిచేయకపోతే..పంపించేస్తాం
మెదక్ మున్సిపాలిటీ/ సిద్దిపేట జోన్: ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ప్రభుత్వ ఆస్పత్రులకు వస్తున్న రోగులకు సమగ్ర వైద్య సేవల్ని అందించాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య సంచాలకులు సాంబశివరావు పేర్కొన్నారు. సిద్దిపేట, మెదక్ ఏరియా ఆస్పత్రుల్లో మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టిన ఆయన పలు విభాగాలను సందర్శించారు. అక్కడ పనిచేస్తున్న వైద్యులు, సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సాంబశివరావు తీవ్రంగా హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైద్యులు, సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండి నిస్వార్థంగా సేవలందించాలన్నారు. పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కచ్చితంగా విధుల్లో ఉండాలన్నారు. విధులకు గైర్హాజర్ కావడం, రోగుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేయడం వంటి ఫిర్యాదులు వస్తే వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. ఏరియా ఆస్పత్రుల్లో నిర్వహించే అత్యవసర సేవలకు సంబంధించి తప్పనిసరిగా బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలో ఉన్న 325 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం 107 జీఓను విడుదల చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే మెదక్ జిల్లాలోని 21 పోస్టులకు గానూ 160 దరఖాస్తులు వచ్చాయన్నారు. వీటిని పరిశీలించి త్వరలోనే అన్ని పోస్టులను భర్తీ చేస్తామన్నారు. స్థానిక ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ ఆదేశాల మేరకు మెదక్ ఏరియా ఆస్పత్రిలో త్వరలోనే బ్లడ్‌బ్యాంకును ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం సిద్దిపేట ఏరియా ఆస్పత్రిలో పలు విభాగాల ను సాంబశివరావు సందర్శించారు. బ్లడ్ బ్యా ంక్ పని తీరు, ఓపీ, ల్యాబ్, స్టోర్‌రూం, వీ ఆర్టీ కేంద్రాలను పరిశీలించి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కుక్క కాటుకు మం దులు సెంట్రల్ మెడిసిన్ స్టోర్‌లో పుష్కలంగా ఉన్నాయని ప్రతిపాదనలు పంపి సిద్దిపేటకు తెప్పించుకోవాలని స్టోర్ ఇన్చార్జిని ఆదేశిం చారు. అనంతరం ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. నవజాత శిశు సంరక్షణ కేంద్రం.. సిద్దిపేటలో నవజాత శిశు సంరక్షణ కేంద్రం ప్రారంభించడానికి చర్యలు చేపడతామన్నారు. బ్లడ్ బ్యాంక్‌ల పనితీరును మెరుగుపర్చడం, 104 వాహనంలో అవసరమైతే తాత్కాలిక వైద్యుల నియామకానికి కృషి చేస్తామన్నారు. కు.ని. శిబిరాలకు కనీస మౌలిక వసతుల కల్పిస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మూత్ర, రక్త, ఈజీసీ, అల్ట్రా, ల్యాబ్ లాంటి పరీక్షలను బయటకు రాస్తే ఊరుకోబోమన్నారు. ఆయన వెంట జిల్లా వైద్యాధికారి బాలాజి పవర్, క్లస్టర్ అధికారులు సునీల్,శివానందం, ఆస్పత్రుల సూపరింటెండెంట్స్ పీసీ శేఖర్, శివరాం, తదితరులు ఉన్నారు. -
ముంచెత్తిన వాన
వరంగల్ : వరుస వర్షాలు జిల్లాను ముంచెత్తుతున్నాయి. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఏజెన్సీ ఏరియాలో వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాతోపాటు ఎగువ ప్రాంతంలో కురిసిన వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. గోదావరి నీటిమట్టం రాత్రి వరకు 10.20 మీటర్లకు చేరుకోవడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఏటూరునాగారం మండలంలోని ఐలాపురం, ముళ్లకట్ట, రాంపూర్, కోయగూడెం, ఎల్లాపూరం, రాంనగర్, ఘనపురం, చెల్పాక, వీరాపురం, బనాజీబంధం గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ధర్మారావుపేట-కొండాపూర్మధ్య మోరంచవాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పరకాల శివారు చలివాగు పొంగిపొర్లుతోంది. భారీ వర్షాలతో ఏటూరునాగారం, మంగపేట మండలాల్లో 60 ఎకరాల మేరకు పంటలు నీటమునిగాయి. ఏజెన్సీలో పొంగుతున్న వాగులు ఆదివారం జిల్లాలో 32.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. తాడ్వాయిలో అత్యధికంగా 124 మి.మీల వర్షం కురిసినట్లు అధికారులు తెలిపారు. భూపాలపల్లి, ములుగు ఘనపూర్, ములుగు, ఏటూరునాగారం, మంగపేట, పరకాల, రేగొండ, మొగుళ్లపల్లి, నల్లబెల్లి, ఖానాపూర్ మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. మోరంచవాగు, చలివాగు, బొగ్గులవాగు, దయ్యాలవాగులు పొంగిపొర్లుతున్నాయి. ఇక జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండ, వరంగల్, వర్ధన్నపేట ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు కురిశాయి. నిండుతున్న చెరువులు ఈ సీజన్లో తాజాగా కురుస్తున్న వర్షాలతో కుంటలు, చెరువులు, మధ్యతరహా నీటి వనరులు నీటితో నిండిపోతున్నాయి. మొన్నటివరకు నీటి చుక్కలేక ఎండిపోయి వెలవెలబోయిన చెరువులు ఇప్పుడు నీటితో నిండుకుండలా మారాయి. వారం రోజుల క్రితం కురిసిన వర్షాలతో చెరువుల్లోకి సగానికి కంటే ఎక్కువ నీరు చేరింది. తాజా వర్షాలతో చెరువులు పూర్తిస్థారుులో కళకళలాడుతున్నారుు. చిన్న చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. పాఖాల, లక్నవరం, రామప్ప, గణపసముద్రం చెరువుల్లోకి భారీగా నీరు చేరింది. ఇదే సమయంలో బలహీనంగా ఉన్న చెరువులు, కుంటలకు గండ్లు పడుతున్నాయి. చెరువు కట్టల నిర్మాణ బలహీనతలు బహిర్గతమవుతున్నాయి. కాగా, రామన్నగూడెం పీహెచ్సీలో అందుతున్న వైద్యసేవలపై ఆరోగ్య శాఖ డెరైక్టర్ సాంబశివరావు సమీక్షించారు. ఏటూరునాగారంలోని రొయ్యూర్ ఊర చెరువు ఉధృతిని ఐటీడీఏ పీఓ పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. -
గ్రూప్ ఇన్సూరెన్స్‌పై వడ్డీ 8.7 శాతం
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌పై ఏడాదికి 8.7 శాతం వడ్డీ నిర్ణయిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సాంబశివరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ వడ్డీ పెంపు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2015 మార్చి 31 వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. -
అండగా ఉంటామన్న వారికే మద్దతు!!
* అలాంటి వారికే మా ఓట్లు * మా పట్ల ఆలా మాట్లాడడం బాధాకరం * మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ వారేమో చుట్టాలు.. * సొంత రాష్ట్రం వారిమేమో శత్రువులమా? * ఇదీ ‘ఆంధ్రా నగర్’ వాసుల మనోగతం ఈ ఊరిలో అందరూ ఆంధ్రా ప్రాంతం నుంచి వచ్చిన వారే. ఇక్కడే భూములు కొన్నారు. ఇక్కడే వ్యవసాయం చేస్తున్నారు. వారి పిల్లలు ఇక్కడే చదివారు. ఇక్కడే ఉద్యోగాలు చేస్తున్నారు. మొదట వచ్చిన వారు, వారి పిల్లలు, పిల్లల పిల్లలు అంటే మూడు తరల వారు ఇక్కడే ఉంటున్నారు. అయితే వీరిని ఇప్పటికీ ఆంధ్రా వారిగానే చూస్తున్నారు. ఇతర గ్రామా లతో వీరికి పెద్దగా సంబంధాలు ఉండవు. ఆ ఊరి పేరికి పేరు కూడా వారే పెట్టుకున్నారు. ఇది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికల పట్ల ఆ ఊరి ప్రజల అభిప్రాయం ఏలా ఉంటుందనే విషయంపై కొంత ప్రాధాన్యం ఏర్పడింది. ఆంధ్రానగర్‌కు వెళ్లి అక్కడి వారిని ‘సాక్షి’ పలకరించిన ప్పుడు అసక్తికర విషయాలు వెలుగుచూశాయి. రాష్ర్టం విడిపోయే సమయంలో, విడిపోయిన తర్వాత రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న వైఖరి పట్ల ఈ ఊరి ప్రజలు కొంత ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ వంటి పట్టణాల్లో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ నుంచి వచ్చిన వారు చాలా మం ది ఉన్నారు. వారిపట్ల లేని వివక్షను తమపై చూపుతున్నార నే అభిప్రాయం వారిలో ఉంది. ఎన్నికలకు సంబంధించి.. తమకు అండగా నిలుస్తారనే నమ్మకం కుదుర్చిన వారికే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. గ్రామానికి సొంత రెవెన్యూ డివిజన్ (శివారు) ఏర్పడలేదు. గతంలో వైఎస్ హామీ ఇచ్చారు. అయితే వెంటనే ఆయన మృతి చెందడంతో ఆ హామీ ఇప్పటికీ నెరవేరలేదని గుర్తు చేస్తున్నారు. మమ్మల్ని ఈ రాష్ట్రం పౌరులుగానే పరిగణించాలని కోరుతున్నారు. తమ పట్ల శత్రుభావం ప్రదర్శించే వారికి ఓట్లు వేయబోమని స్పష్టం చేశారు. ఉదాహరణకు గత పదేళ్లలో స్థానిక ఎంపీ మధుయాష్కీ ఒక్క సారి కూడా ఆ గ్రామానికి వెళ్లలేదు. ఈ గ్రామం గుండా వెళ్లాల్సిన సమయంలోనూ కారును ఆపకుండానే వెళ్లిపోయేవారు. ఎంపీ నిధుల నుంచి పైసా కూడా గ్రామానికి ఖర్చు చేయలేదని గ్రామస్తులు గుర్తు చేశారు. ఇక్కడ స్థిరపడిన వారంతా కృష్ణా, గుంటూరు వంటి ప్రాంతాల నుంచి వచ్చిన వారే. 1975 నుంచి ఇక్కడ నివాసాలు ఏర్పరచుకున్నారు. ఇప్పుడు వారి సంతతే పెరిగి పెద్దదైంది. 1718 ఓటర్లు ఉన్న ఈ గ్రామం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలోకి వస్తుంది. దీంతో పాడిపంటలకు కొదవ లేదు. మొదట్లో నిజాంసాగర్ నుంచి నీటిని సరఫరా చేసేవారు. తర్వాత ప్రాజెక్టులో నీటి కొరత ఏర్పడి ఈ ప్రాంతంలోని ఆయకట్టుకు సమస్యలు వచ్చాయి. వైఎస్సార్ సీఎం అయ్యాక గుత్ప ప్రాజెక్టును నిర్మించారు. మళ్లీ అప్పటి నుంచి పంటలకు కావాల్సిన నీరు అందుతోంది. రెవిన్యూ రికార్డులను మార్చాలి మా గ్రామాన్ని ఇప్పటికే ఆంధ్రానగర్గా గుర్తించారు. అందులో భాగంగా సర్పంచ్ ఎన్నికలను కూడా నిర్వహిస్తున్నారు. అయితే.. రెవెన్యూ రికార్డుల్లోనూ పేరు చేర్చాలి. ఆ మేరకు మా గ్రామ శివారుల్లోని భూముల పరిధిని నిర్ణయించారు. ఆలా జరగని పక్షంలో పక్క గ్రామాల నుంచి ఇబ్బందులు తప్పడం లేదు. వైఎస్ ఉంటే...ఈ సమస్య తీరేది. ఆయన హామీ ఇచ్చారు. మ సమస్యల్ని పరిష్కరించిన వారికే మా మద్దతు ఉంటుంది. -వై.రాము మాది తెనాలి...అయినా ఇక్కడే ఉంటాను మాది తెనాలి ప్రాంతం. మా నాన్న వారు ఇక్కడి వ చ్చారు. నేను ఆర్టీసీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మా పిల్లలు ఇక్కడే పుట్టి...ఇక్కడే చదివారు. మా అమ్మాయికి ఇక్కడే పెళ్లి కూడా చేశాను. ఇప్పుడు తిరిగి వెళ్లడం సాధ్యం అవుతుందా ? నా జీవితం ఇక్కడే. - ఈదర సత్యనారాయణ మాకెలాంటి ఇబ్బంది లేదు రాష్ర్టం విడిపోయినా మాకు ఏలాంటి ఇబ్బంది లేదు. మేం ఇక్కడే ఉంటాం. నాకు మూడు ఎకరాల పొలం ఉంది. అయితే ఇక్కడి ప్రజలు కూడా మమ్మల్ని తమ వారిగానే చూడాలి. మేం పరాయి వారిగా పరిగణించవద్దు. కొన్ని రాజకీయ పార్టీలు మా పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చుకోవాలి. - సాంబశివరావు -
25లోగా ఎస్సీ, ఎస్టీలు సర్టిఫికెట్లు అందజేయాలి
తాండూరు టౌన్, న్యూస్‌లైన్ : యాభై యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకుంటున్న ఎస్సీ, ఎస్టీలు ఈ నెల 25వ తేదీలోగా సర్టిఫికెట్లను అందజేయాలని వికారాబాద్ డివిజన్ విద్యుత్ శాఖ డీఈఈ సాంబశివరావు కోరారు. గురువారం సాయంత్రం ఆయన తాండూరులోని ఏడీఈ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ప్రకారం యాభై యూనిట్ల లోపు విద్యుత్‌ను వినియోగించుకునే ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి బిల్లులు చెల్లించనవసరం లేదన్నారు. ఒకవేళ 51 యూనిట్లు వినియోగించుకుంటే మాత్రం మొత్తం బిల్లు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ అవకాశం పట్టణంలోని ఎస్సీ, ఎస్టీ కాలనీల వారితో పాటు గ్రామీణ ప్రాంతాల్లోని వారికీ వర్తిస్తుందన్నారు. తాండూరు పట్టణంలోని హరిజనవాడ, మాణిక్‌నగర్, చెంగోల్ బస్తీ, పుల్లమ్మ దొడ్డి ప్రాంతాల్లో నివసించే వారు ఈ పథకం కిందికి వస్తారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీలు కులధ్రువీకరణ పత్రం, 6నెలల లోపు చెల్లించిన విద్యుత్ బిల్లు జిరాక్స్‌లను సహాయ లైన్‌మన్ సహా ఆపై అధికారులకు ఎవరికైనా సమర్పించవచ్చన్నారు. ఈ వివరాలన్నిం టినీ ఆన్లైన్లో అందుబాటులో ఉంచనున్నామని వివరించారు. డివిజన్లో రూ.10కోట్ల మేర వినియోగదారులకు లబ్ధి ఈ పథకంతో వికారాబాద్ డివిజన్లోని 17 మండలాల్లో సుమారు 35వేల మంది ఎస్సీ, ఎస్టీ సర్వీసుదారులకు సుమారు రూ.10 కోట్లు లబ్ధి చేకూరుతుందని విద్యుత్ డీఈఈ సాంబశివరావు పేర్కొన్నారు. 31 మార్చి 2013లోపు 50 యూనిట్లలోగా వినియోగించుకున్న ఎస్సీ, ఎస్టీలు ఒకవేళ బిల్లులు చెల్లించి ఉంటే అందుకు సంబంధిం చిన డబ్బులను వారికి తిరిగి అందించనున్నామన్నారు. గతంలో తొలగించిన మీటర్లు పునరుద్ధరించాలంటే రూ.1100 డీడీ చెల్లించాలని సూచించారు. 6వేల మంది రైతులకు స్లాబ్ పుస్తకాల అందజేత ఇటీవలే డివిజన్ పరిధిలోని 6వేల మంది రైతులకు ఉచిత విద్యుత్ వినియోగానికి సంబంధించిన స్లాబ్ పుస్తకాలను అందజేశామని ఆయన చెప్పారు. దీనివల్ల సర్వీసు చార్జీల బకాయిలు రూ.70లక్షలు వసూలయ్యాయన్నారు. అలాగే రూ.12.50కోట్ల బకాయిలు కూడా రైతులు చెల్లించినట్లు తెలిపారు. రూ.77 కోట్ల బకాయిలు.. డివిజన్వ్యాప్తంగా విద్యుత్ బకాయిలు రూ.కోట్లలో పేరుకుపోయాయని డీఈఈ పేర్కొన్నారు. గృహ వినియోగదారులు రూ.45 కోట్లు, వీధి దీపాలు, నీటి సరఫరాకు సంబంధించి రూ.30 కోట్లు, ప్రభుత్వ కార్యాలయాలు రూ.2 కోట్లు కలిపి మొత్తం రూ.77 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. బకాయిలు చెల్లించని ప్రభుత్వ కార్యాలయాలకు కనెక్షన్లు తొలగిస్తున్నామని చెప్పారు. విద్యుత్ సరఫరాలో ఇబ్బం దులు తలెత్తకుండా చూసేందుకు, ప్రమాదాలు నివారించేందుకు 19 సబ్ స్టేషన్లలో 76మంది ఆపరేటర్లను నియమిం చినట్లు తెలిపారు. ఈసారి వేసవిలో ఎలాంటి కరెంటు కోతలు ఉండవని, ఏప్రిల్ తర్వాత రాష్ట్రానికి నార్త్‌గ్రిడ్ నుంచి సుమారు 1500 మెగావాట్ల విద్యుత్ రానుందన్నారు. అంతకుముందు తాండూరు ఏఈ తుల్జారామ్‌సింగ్‌తో కలిసి ఆయన సబ్‌డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ సిబ్బందితో సమావేశమయ్యారు. -
ఉచిత విద్యుత్ వ్యవసాయదారులకు ‘చార్జీల పుస్తకం’
తాండూరు, న్యూస్‌లైన్: వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ పొందుతున్న రైతుల నుంచి సర్వీస్ చార్జీలు వసూలు చేసేందుకు త్వరలో ‘విద్యుత్ చార్జీల పుస్తకం’(స్లాబ్ పాస్‌బుక్) అందజేయనున్నట్టు వికారాబాద్ డివిజన్ విద్యుత్ డీఈ సాంబశివరావు పేర్కొన్నారు. గురువారం తాండూరు విద్యుత్ ఏడీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉచిత విద్యుత్ వినియోగించుకుంటున్న రైతులను గుర్తించడంతో పాటు, సర్వీసు చార్జీల బకాయిల వసూలు, విద్యుత్ చౌర్యాన్ని నిరోధించేందుకు స్లాబ్ పాస్‌బుక్‌లు అందించనున్నట్టు వివరించారు. 2004 సంవత్సరానికి ముందు ఈ తరహా పుస్తకాలు ఉండేవన్నారు. ఈ పుస్తకాలతో బకాయిల వసూలుతో పాటు అక్రమ సర్వీసుసు గుర్తించి క్రమబద్ధీకరణకు ఆస్కారం ఉంటుందన్నారు. వికారాబాద్ డివిజన్ పరిధిలోని 17 మండలాల్లో 45వేల ఉచిత విద్యుత్ సర్వీసులు ఉన్నాయని, ఇందులో సుమారు 6-7 వేల వరకు అక్రమ సర్వీసులున్నాయని ఆయన తెలిపారు. 2004వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉచిత విద్యుత్ వినియోగదారుల నుంచి సుమారు రూ.9కోట్ల సర్వీసు చార్జీలు, అలాగే ఉచిత విద్యుత్ వర్తించని వ్యవసాయదారుల నుంచి మరో రూ.3కోట్లు వసూలు కావాల్సి ఉందని వివరించారు. స్లాబ్ పాస్‌బుక్ పొందిన రైతులకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి ఒక సర్వీసు నంబర్‌ను కేటాయిస్తామన్నారు. ఈ సర్వీసు నంబర్ లేని రైతులు అక్రమ సర్వీసులు కలిగి ఉన్నట్టు పరిగణిస్తామన్నారు. అయితే బకాయి ఉన్న సర్వీసు చార్జీలు మొత్తం చెల్లించిన రైతులకే ఈ పుస్తకం అందజేస్తామని ఆయన స్పష్టం చేశారు. జనవరి 31వ తేదీ వరకు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి బకాయిలు చెల్లించిన రైతులకు పుస్తకాలు ఉచితంగా అందిస్తామన్నారు. ఫిబ్రవరి నుంచి పుస్తకాలు లేని రైతుల సర్వీసులను తొలగిస్తామన్నారు. ఇటీవలనే బండెనకచర్లలో రైతులకు ఈ పుస్తకాలు అందించామని చెప్పారు. శుక్రవారం బంట్వారం మండలం తోర్మామిడి, శనివారం నుంచి తాండూరు సబ్‌డివిజన్ పరిధిలోని చెంగోల్, బెల్కటూర్, మైల్వార్, ఎల్మకన్నె, రాస్నం తదితర గ్రామాల్లో శిబిరాలు నిర్వహించనున్నట్టు ఆయన తెలిపారు. బకాయిలు కచ్చితంగా చెల్లించాల్సిందే.. గతంలో విద్యుత్ వినియోగించుకొని, బోర్లు ఎండిపోయిన రైతులు రూ.5,400 చెల్లిస్తే మళ్లీ కనెక్షన్ రెగ్యులర్ చేస్తామని డీఈ తెలిపారు. నెలకు రూ.30 చొప్పున 9ఏళ్లుగా బకాయిపడ్డ సర్వీసు చార్జీలను రైతులు కచ్చితంగా చెల్లించాల్సిందేనని, లేకపోతే స్టార్టర్లు తీసుకువెళతామని ఆయన స్పష్టం చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఉచిత విద్యుత్ కనెక్షన్ల కోటా 5వేలు ఉండగా, ఇప్పటివరకు సుమారు 2500 దరఖాస్తులు మాత్రమే వచ్చాయని వివరించారు. వికారాబాద్ డివిజన్లో 61 విద్యుత్ సబ్స్టేషన్ల పరిధిలో పెద్ద పరిశ్రమలను మినహాయించి 2.40లక్షల ఎల్టీ సర్వీసులు ఉన్నాయని, వీటిపై నెలకు సుమారు 90 మిలియన్ల యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతుందన్నారు. ఇందులో వ్యవసాయరంగానికే నెలకు సుమారు 30లక్షల యూనిట్ల డిమాండ్ ఉందని వివరించారు. జిల్లా సౌత్ సర్కిల్లో చాలామంది రైతులు సర్వీసు చార్జీలు చెల్లించడం లేదన్నారు. రూ.కోట్లలో బకాయిలు పేరుకుపోతున్నందున వాటి వసూలుకు స్లాబ్ పాస్‌బుక్కులను అందిస్తున్నట్టు చెప్పారు. చార్జీలు చెల్లించిన తేదీ, రసీదు నంబరు తదితర వివరాలన్నీ పుస్తకంలో ఉంటాయని, రైతు ఫోటో జత చేస్తే మండల ఏఈ సంతకం చేస్తారని వివరించారు. అంతకుముందు విద్యుత్ సిబ్బందితో సమావేశమైన డీఈ, విద్యుత్ బకాయిల వసూలు వేగవంతం చేసి లక్షా ్యలను సాధించాలని ఆదేశించారు. సమావేశంలో మండల ఏఈ తుల్జారామ్సింగ్ పాల్గొన్నారు. -
విద్యుత్ చౌర్యంపై కొరడా ఓ వ్యక్తికి రిమాండ్
చేవెళ్ల,న్యూస్‌లైన్: విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఓ వ్యక్తిని విజిలెన్స్ అధికారులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చేవెళ్ల ఏడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ విజిలెన్స్ సీఐ చేబ్రోలు లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన అంకన్నగారి అనంతరాములు ఇంటికి అక్రమంగా విద్యుత్ వాడుకుంటుండగా గత ఏప్రిల్ 29న అప్పటి డివిజన్ ఏడీ రామకృష్ణారెడ్డి కేసునమోదు చేసి రూ. 1000 జరిమా నా విధించారు. కాగా అకస్మాతుగా ఈనెల 26వతేదీన విద్యుత్ అధికారు లు జరిపిన ఆకస్మిక తనిఖీలో అతను మళ్లీ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో రెండోసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ అనంతరాములు పట్టుబడటంతో విజిలెన్స్ అధికారులు అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ విద్యుత్ డీఈఈ సాంబశివరావు, ఏడీ అశోక్‌రావు, ఏఈ మహేశ్వర్, విద్యుత్ విజిలెన్స్ ఎస్ఐ మల్లయ్య, కానిస్టేబుల్ జహంగీర్, హోంగార్డులు శ్రీనివాస్‌రెడ్డి, గురువయ్యపాల్గొన్నారు. ఉపేక్షించేదిలేదు విద్యుత్ అక్రమంగా వాడుకున్నా, చౌర్యానికి పాల్పడినా ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని జిల్లా సౌత్ విభాగం విద్యుత్ సీఐ చేబ్రోలు లక్ష్మీనారాయణ తెలిపారు. ఎస్పీ మురళీధరరావు ఆదేశాలమేరకు ఐదు టీంలద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ను అక్రమంగా వాడి కేసులు నమోదైన వ్యక్తులకు ప్రభుత్వ పథకాల లబ్ధికూడా నిలిపివేయటం జరుగుతుందని ఆయన చెప్పారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ ఒకసారి దొరికితే జరిమానా విధిస్తామని, రెండోసారి అదే వ్యక్తి దొరికితే తప్పనిసారిగా కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఆలూరుకు చెందిన అంకన్నగారి అనంతరాములు రెండోసారి దొరికినందునే కేసునమోదుచేశామని స్పష్టంచేశారు. విద్యుత్ చౌర్యం నేరమనే విషయాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయటానికి గ్రామా ల్లో త్వరలో లీగల్ ఎయిడ్ క్యాంపులు నిర్వహిస్తామని వివరించారు. విద్యుత్ అధికారులు, సిబ్బందిగాని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు సరైన, నిర్ధిష్టమైన ఆధారాలు ఉంటే ఫోన్: 040-23431007 నంబర్‌కు ఫ్యాక్స్ చేయాలని సూచించారు.