చేవెళ్ల,న్యూస్‌లైన్: విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఓ వ్యక్తిని విజిలెన్స్ అధికారులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చేవెళ్ల ఏడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ విజిలెన్స్ సీఐ చేబ్రోలు లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన అంకన్నగారి అనంతరాములు ఇంటికి అక్రమంగా విద్యుత్ వాడుకుంటుండగా గత ఏప్రిల్ 29న అప్పటి డివిజన్ ఏడీ రామకృష్ణారెడ్డి కేసునమోదు చేసి రూ. 1000 జరిమా నా విధించారు. కాగా అకస్మాతుగా ఈనెల 26వతేదీన విద్యుత్ అధికారు లు జరిపిన ఆకస్మిక తనిఖీలో అతను మళ్లీ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో రెండోసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ అనంతరాములు పట్టుబడటంతో విజిలెన్స్ అధికారులు అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ విద్యుత్ డీఈఈ సాంబశివరావు, ఏడీ అశోక్‌రావు, ఏఈ మహేశ్వర్, విద్యుత్ విజిలెన్స్ ఎస్‌ఐ మల్లయ్య, కానిస్టేబుల్ జహంగీర్, హోంగార్డులు శ్రీనివాస్‌రెడ్డి, గురువయ్యపాల్గొన్నారు.
ఉపేక్షించేదిలేదు
విద్యుత్ అక్రమంగా వాడుకున్నా, చౌర్యానికి పాల్పడినా ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని జిల్లా సౌత్ విభాగం విద్యుత్ సీఐ చేబ్రోలు లక్ష్మీనారాయణ తెలిపారు. ఎస్పీ మురళీధరరావు ఆదేశాలమేరకు ఐదు టీంలద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ను అక్రమంగా వాడి కేసులు నమోదైన వ్యక్తులకు ప్రభుత్వ పథకాల లబ్ధికూడా నిలిపివేయటం జరుగుతుందని ఆయన చెప్పారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ ఒకసారి దొరికితే జరిమానా విధిస్తామని, రెండోసారి అదే వ్యక్తి దొరికితే తప్పనిసారిగా కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఆలూరుకు చెందిన అంకన్నగారి అనంతరాములు రెండోసారి దొరికినందునే కేసునమోదుచేశామని స్పష్టంచేశారు. విద్యుత్ చౌర్యం నేరమనే విషయాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయటానికి గ్రామా ల్లో త్వరలో లీగల్ ఎయిడ్ క్యాంపులు నిర్వహిస్తామని వివరించారు. విద్యుత్ అధికారులు, సిబ్బందిగాని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు సరైన, నిర్ధిష్టమైన ఆధారాలు ఉంటే ఫోన్: 040-23431007 నంబర్‌కు ఫ్యాక్స్ చేయాలని సూచించారు.
విద్యుత్ చౌర్యంపై కొరడా ఓ వ్యక్తికి రిమాండ్
Published Sat, Nov 30 2013 4:54 AM | Last Updated on Wed, Sep 5 2018 1:46 PM
Advertisement