ramakrishna reddy
-
ప్రజల్లో తిరుగుబాబు మొదలైంది: జక్కంపూడి రాజా
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదవరి జిల్లాలో బిక్కవోలు మండలం ఇల్లపల్లిలో వైఎస్సార్సీపీ సర్పంచ్ లొల్ల భద్రంను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ కి ప్రయత్నించారు. కారులో తీసుకెళ్తుండగా కేకలు వేయగా గ్రామస్తులు.. కిడ్నాపర్లను పట్టుకుని దేహశుద్ధి చేయడంతో సర్పంచ్ క్షేమంగా బయట పడ్డారు. దండగుల పెనుగులాటలో సర్పంచ్‌కి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపి నేత గూడూరు శ్రీనివాస్ ఇల్లపల్లి సర్పంచ్‌ను పరామర్శించారు. అనంతరం జక్కంపూడి రాజా మీడియాతో మాట్లడారు. ‘‘ కూటమి ప్రభుత్వం దాడులు పెచ్చు మీరుతున్నాయి. ఇల్లపల్లిలో ప్రజలే తిరగబడి సర్పంచును కాపాడుకున్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అనపర్తిలో మరొక్క హింస పక్క సంఘటన చోటుచేసుకున్నా ఊరుకునేది లేదు. వేలాదిగా ప్రజలతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. అధికారం శాశ్వతం కాదు’’ అని అన్నారు. -
సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం
లేహ్/రాచర్ల: సైనిక విన్యాసాల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. విన్యాసాల్లో భాగంగా యుద్ధ ట్యాంకుతో నదిని దాటుతుండగా హఠాత్తుగా వరద పోటెత్తడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జూనియర్ కమిషన్డ్ అధికారి(జేసీఓ) ముత్తముల రామకృష్ణారెడ్డి సహా ఐదుగురు జవాన్లు మృత్యువాత పడ్డారు. తూర్పు లద్దాఖ్‌లో భారత్–చైనా సరిహద్దు వాస్తవా«దీన రేఖ(ఎల్ఏసీ) సమీపంలోని షియోక్ నదిలో శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఒంటి గంట సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు సైనికాధికారులు వెల్లడించారు. లేహ్ నుంచి 148 కిలోమీటర్ల దూరంలోని మందిర్ మోర్హ్ వద్ద భారత సైన్యం విన్యాసాలు చేపట్టింది. ఈ విన్యాసాల్లో భాగంగా జవాన్లు యుద్ధ ట్యాంకులు నడుపుతూ షియోక్ నదిని దాటుతుండగా, టి–72 ట్యాంకు నదిలో ఇరుక్కుపోయింది. ఇంతలో ఎగువ ప్రాంతం నుంచి ఆకస్మికంగా వరద పోటెత్తింది. నదిలో నీటిమట్టం ఒక్కసారిగా పెరిగిపోయింది. క్షణాల వ్యవధిలోనే టి–72 ట్యాంకు నీట మునిగిపోయింది. యుద్ధ ట్యాంకుపై ఉన్న ఐదుగురు సైనికులు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగినప్పటికీ నదిలో వరద ఉధృతి అధికంగా ఉండడంతో జవాన్లను రక్షించలేకపోయాయి. నదిలో ఐదుగురి మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఐదుగురు జవాన్లు తూర్పు లద్దాఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ మిలటరీ బేస్‌లోని 52 ఆర్మర్డ్ రెజిమెంట్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. విన్యాసాల్లో పాల్గొంటూ దుదృష్టవశాత్తూ మరణించారు. ఈ సైనిక శిబిరం చైనా సరిహద్దుకు అత్యంత సమీపంలో∙ఉంది. ఎగువ ప్రాంతాల్లో మంచు కరిగిపోవడం వల్లే షియోక్ నదిలో వరద ప్రవాహం హఠాత్తుగా పెరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ రక్షణపరంగా వ్యూహాత్మకంగా కీలకమైన దెప్సాంగ్ ప్రాంతంలో ఈ నది ప్రవహిస్తోంది. పదవీ విరమణకు ఆరు నెలల ముందు మృత్యువాత తూర్పు లద్దాఖ్‌లో సైనిక విన్యాసాల్లో ప్రాణాలు కోల్పోయిన ముత్తముల రామకృష్ణారెడ్డి(47) స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం కాలువపల్లె. ఆయన భారత సైన్యంలో 30 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్‌గా సేవలందిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో రామకృష్ణారెడ్డి పదవీ విరమణ చేయాల్సి ఉందని గ్రామస్థులు తెలిపారు. ఆయనకు భార్య ఉమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమారుల చదువుల కోసం ఉమాదేవి హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. రామకృష్ణారెడ్డి మృతదేహం ఆదివారం సాయంత్రం కాలువపల్లెకు చేరుకోనున్నట్లు స్థానికులు చెప్పారు. రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలిసిన వెంటనే హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఆయన భార్య ఉమాదేవి, కుమారులు కాలువపల్లెకు బయలుదేరారు. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాజ్‌నాథ్ సింగ్ వాస్తవా«దీన రేఖ సమీపంలో ఐదుగురు సైనికులు మరణించడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని శనివారం ‘ఎక్స్’లో పోస్టు చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాం«దీ, ప్రియాంక సంతాపం ప్రకటించారు. -
టీడీపీ నేత రామకృష్ణ రెడ్డి పై ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఫైర్
-
చౌళూరు కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది
హిందూపురం: చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకేసు దర్యాప్తులో ఎలాంటి ఒత్తిళ్లకూ తావుండదని రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. ఎవరైనా అలాచేస్తే ముఖ్యమంత్రి, తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. పోలీసులను మభ్యపెట్టి చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరని, ఈ కేసు పురోగతిని స్వయంగా పరిశీలిస్తానని చెప్పారు. రామకృష్ణారెడ్డి కుటుంబానికి పార్టీ అన్నివిధాలా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. హిందూపురం నియోజకవర్గం చౌళూరులో ఇటీవల హత్యకు గురైన నియోజకవర్గ వైఎస్సార్ సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులను మంగళవారం ఆయన పరామర్శించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ ధైర్యంగా ఉండాలని వారికి సూచించారు. తనకు, తన కుమారుడు మిథున్‌రెడ్డికి వ్యక్తిగతంగా కూడా కావాల్సిన వ్యక్తి రామకృష్ణారెడ్డి అని చెప్పారు. రామకృష్ణారెడ్డిని కోల్పోవడం పార్టీకి నష్టమని చెప్పారు. దోషులు ఎవరైనా వదిలేది లేదని, అందుకు తాను హామీ అని వారికి మంత్రి భరోసా ఇచ్చారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన వారిలో శ్రీసత్యసాయి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే శంకర్‌నారాయణ, ఎమ్మెల్యేలు దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, సిద్ధారెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ నవీన్‌నిశ్చల్ ఉన్నారు. -
చౌళూరు హత్యకేసు దర్యాప్తు ముమ్మరం
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. ఇప్పటికే నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు హంతకుల కోసం వేట సాగిస్తున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు కర్ణాటకలోను గాలిస్తున్నాయి. హత్య జరిగిన ప్రదేశంలో అనుమానమున్న వస్తువులు, వేలిముద్రలను క్లూస్ టీం సేకరించింది. తనిఖీల్లో వేటకొడవలి పిడి కూడా దొరికింది. సంఘటన జరిగిన వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తాజాగా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. చౌళూరు గ్రామానికే చెందిన నేరచరిత్ర కలిగిన వరుణ్ అలియాస్ మంజు పాత్ర ఉందేమోనన్న కోణంలోను దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్య జరిగినప్పటి నుంచి వరుణ్ అజ్ఞ్తాంలోకి వెళ్లిపోయాడు. రామకృష్ణారెడ్డి వ్యాపార, ఆర్థిక లావాదేవీలు, రాజకీయ విభేదాలు, ధాబా పునరుద్ధరణ విషయంలో తలెత్తిన సమస్యలు తదితర అంశాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇది సుపారీ హత్యనా అనే కోణంలోను దర్యాప్తు సాగిస్తున్నారు. ఇటీవల రామకృష్ణారెడ్డి రాజకీయంగానే కాకుండా బెంగళూరులో వ్యాపారపరంగాను కొంత బిజీగా ఉంటూ వచ్చారు. తన ధాబా వద్ద బార్ ఏర్పాటు చేసేందుకు పనులు చేపడుతున్నారు. ఈ విషయంలో ఆయనకు వరుణ్‌తో గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. బార్ కూడా ప్రారంభిస్తే రామకృష్ణారెడ్డి ఆర్థికంగా మరింత బలంగా తయారవుతారన్న కక్షతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అనే విషయంపైనా పోలీసులు ఆరా తీస్తున్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు మాత్రం రాజకీయంగా వ్యతిరేకులే హత్యకు కారణమని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైతే స్పష్టమైన కారణాలేవీ తెలియడంలేదు. సమగ్ర దర్యాప్తు కొనసాగించి నిజాలు తేలుస్తామని పోలీసులు చెబుతున్నారు. రూరల్ సీఐ, ఎస్ఐలపై శాఖాపరమైన చర్యలు హిందూపురం అప్‌గ్రేడ్ రూరల్ పోలీసుస్టేషన్ సీఐ జి.టి.నాయుడు, ఎస్ఐ కరీంలను వీఆర్‌కు పంపుతూ ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్ ఉత్తర్వులిచ్చారు. చౌళూరు రామకృష్ణారెడ్డి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు తెలిపినా రక్షణ కల్పించలేదన్న కారణంతో వీరిపై చర్యలు తీసుకున్నట్లు తెలిసింది. విచారణాధికారిగా టూటౌన్ సీఐ వెంకటేశ్వర్లును నియమించారు. ఆయన రూరల్ స్టేషన్ ఇన్‌చార్జ్‌గాను వ్యవహరిస్తారు. -
Sri Sathya Sai District: వైఎస్సార్సీపీ నేత దారుణ హత్య
హిందూపురం: శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ మాజీ సమన్వయకర్త చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు శనివారం రాత్రి చౌళూరు గ్రామంలోని ఆయన ఇంటి వద్ద వేట కొడవళ్లతో నరికి చంపారు. పోలీసులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రామకృష్ణారెడ్డి ఏపీ సరిహద్దుల్లో కర్ణాటకలోని తన దాబా వద్ద శనివారం రాత్రి పని ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో కారులో ఇంటికి వచ్చారు. ఇంటి వద్ద కారు దిగుతున్న సమయంలో అప్పటికే మొఖానికి మాస్క్‌లు ధరించి కాపు కాచి ఉన్న ముగ్గురు నలుగురు ఒక్కసారిగా వేట కొడవళ్లతో దాడి చేశారు. తల, గొంతు, చేతులు, కాళ్లపై దారుణంగా నరికి పారిపోయారు. రామకృష్ణారెడ్డి అరుపులు విన్న స్థానికులు పరుగు పరుగున అక్కడికి వచ్చారు. ఇంటి ముందు పడి ఉన్న రామకృష్ణారెడ్డిని ఆయన కారులోనే హిందూపురం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారిం చారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ సీఐ ఇస్మాయిల్, రూరల్ సీఐ జీటీ నాయుడు ఆస్పత్రికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్య వార్త తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, చౌళూరు గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చౌళూరు రామకృష్ణారెడ్డి వైఎస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం కృషి చేశారు. హిందూపురం మండలంలో మంచి పట్టు ఉన్న నాయకుడు. ఆయన భార్య, కుమారుడు ప్రస్తుతం బెంగళూరులో ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఆయన మృతి సమాచారాన్ని వారికి అందించారు. ఆయన తల్లి, బంధువులు, గ్రామస్తుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. రామకృష్ణారెడ్డి హత్యను వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండించాయి. హత్య విషయం తెలిసిన వెంటనే పార్టీ నేతలు, కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకొన్నారు. దుండగులను వెంటనే పట్టుకోవాలి: ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ చెప్పారు. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు దారుణ హత్యకు గురికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగించిందన్నారు. ఆయన పార్టీ కోసం చేసిన సేవలు మరవలేనివని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. హత్య విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్సీ రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్ సింగ్‌తో ఫోన్లో మాట్లాడి ఈ హత్యకు పాల్పడిన దుండగులను వెంటనే పట్టుకోవాలని కోరారు. హత్యకు కారణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి, దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. హిందూపురం నియోజకవర్గంలో కక్ష సాధింపు హత్యల సంస్కృతి లేదని, ఈ ఘటనకు కారణమైన వారిని ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. -
ఆయిల్ ఫెడ్ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ సంస్థ చైర్మన్‌గా కంచర్ల రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మరో రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నది. తాజా ఉత్తర్వులతో ఆయిల్ ఫెడ్ సంస్థకు వరుసగా నాలుగోసారి కూడా కంచర్ల చైర్మన్‌గా నియమితుల య్యారు. మొదట 2018లో 2020 వరకు అవకాశం ఇవ్వగా, తరువాత 2020 నుంచి 2021 వరకు, అనంతరం 2021 నుంచి 2022 జూలై వరకు చైర్మన్‌గా కొనసాగారు. ప్రస్తుత ఉత్తర్వులతో 2024 జూలై వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. నాలుగోసారి కూడా తనకే చైర్మన్‌గా అవకాశమివ్వడంతో సీఎం కేసీఆర్‌కు రామకృష్ణారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్‌తో కంచర్ల రామకృష్ణారెడ్డి. చిత్రంలో మంత్రి జగదీశ్‌రెడ్డి, గ్యాదరి కిశోర్ -
ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలు ప్రక్రియ నెలాఖరులోగా కొలిక్కి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల ప్రధాన సమస్యలను వచ్చే నెలాఖరులోగా పరిష్కరించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. బుధవారం తాడేపల్లిలో సీఎం కార్యాలయం అధికారులతో కలసి ఏపీ ఎన్జీవో, ఏపీ అమరావతి జేఏసీ సంఘాల నేతలతో ఆయన సమావేశమై ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. అనంతరం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్ వద్ద ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, ఏపీ అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లుతో కలసి మీడియాతో మాట్లాడారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక ఉద్యోగులకు ప్రాధాన్యత పెరిగిందని సజ్జల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేయాల్సిన కీలక బాధ్యత ఉద్యోగుల భుజస్కందాలపై ఉందన్నారు. ఉద్యోగులను తన జట్టుగా సీఎం జగన్ భావిస్తారన్నారు. ఉద్యోగుల సంక్షేమం, భద్రత విషయంలో రెండడుగులు ముందుండాలన్నది సీఎం జగన్ విధానమన్నారు. అధికారంలోకి వచ్చిన వారంలోనే ఎవరూ అడగకుండానే 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. దీనివల్ల ఏటా రూ.10 వేల కోట్ల భారం పడుతున్నప్పటికీ వెనుకాడకుండా ఇచ్చామన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని ఎన్నాళ్లగానో ఉన్న డిమాండ్‌ను నెరవేర్చి సిబ్బంది సమస్యలను సీఎం పరిష్కరించారన్నారు. త్వరలోనే అధికారిక చర్చలు ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని సజ్జల స్పష్టం చేశారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశామని, కొత్తగా 1.30 లక్షల ఉద్యోగాలను కల్పించి పరిపాలనను వికేంద్రీకరించామని చెప్పారు. గత రెండేళ్లుగా కరోనా వల్ల రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారిందని, ఆ కారణంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో కొంత జాప్యం జరిగిందన్నారు. పరిపాలన వ్యవహారాలు, సంక్షేమాభివృద్ధి పథకాల అమలులో నిమగ్నం కావడం వల్ల సీఎం జగన్‌కు సమయం చాలడం లేదని, ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఏ సమస్యతో వచ్చినా తాము పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని వివరించారు. ఇప్పుడు జరిగినవి అధికారికంగా జరుగుతున్న చర్చలు కావని, త్వరలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో నిర్వహించే సమావేశమే అధికారికమని, అప్పుడు అన్ని సంఘాలను ఆహ్వానిస్తారన్నారు. ఉద్యోగ సంఘాల వ్యవహారాల్లో రాజకీయాలు చొప్పించాలని ప్రయత్నిస్తే ఫూల్స్ అవుతారన్నారు. -
రాష్ట్ర పోర్టులపై కేంద్ర పెత్తనమా?
సాక్షి, అమరావతి: రాష్ట్ర పోర్టులపై హక్కులను లాక్కునే విధంగా తీసుకొస్తున్న ఇండియన్ పోర్టు బిల్–2020ను ఏపీ మారిటైమ్ బోర్డు తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బిల్లు అమల్లోకి వస్తే 974 కి.మీ. పొడవున సుదీర్ఘ తీరప్రాంతం కలిగిన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని, కొత్తగా సుమారు రూ.10,000 కోట్లతో నిర్మించతలపెట్టిన పోర్టుల నిర్మాణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ఎన్.పి.రామకృష్ణారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో కేంద్ర ప్రభుత్వం 13 మేజర్ పోర్టులను నిర్వహిస్తుండగా, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు 160 మైనర్ పోర్టులు కలిగి ఉన్నాయి. ఇప్పుడు ఈ బిల్లు అమల్లోకి వస్తే 13 మేజర్ పోర్టులకు ఒక్కొక్క రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తారని, ఇదే సమయంలో దేశవ్యాప్తంగా మైనర్ పోర్టులన్నింటికీ కలిపి ఒకే ఒక రెగ్యులేటరీ వ్యవస్థను ఏర్పాటు చేయడం రాష్ట్ర పోర్టులపై వివక్ష చూపడమేనని రామకృష్ణారెడ్డి చెప్పారు. ఉమ్మడి జాబితా (కాంకరెంట్ లిస్ట్) ప్రకారం మేజర్ పోర్టులు కేంద్రం పరిధిలో ఉంటే మైనర్ పోర్టుల నిర్వహణ పూర్తిగా రాష్ట్ర పరిధిలోకి వస్తుందని, ఇప్పుడు కొత్త చట్టం ద్వారా మైనర్ పోర్టులపై అధికారాలు కేంద్రం తీసుకోవాలనుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులు ఉండగా, సుమారు రూ.10,000 కోట్లతో మరో మూడు పోర్టులను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే పాత పోర్టుల నిర్వహణకు అనుమతుల మంజూరులో జాప్యం జరగడంతో పాటు కొత్త పోర్టుల నిర్మాణంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిల్లును ఉపసంహరించుకోవాలి దేశవ్యాప్తంగా పోర్టు వాణిజ్య లావాదేవీల్లో మైనర్ పోర్టులు 45 శాతం వాటాను కలిగి ఉండగా, రాష్ట్రంలో మూడు మైనర్ పోర్టుల ద్వారా ఏటా సుమారు 110 మిలియన్ టన్నుల సరుకు రవాణా జరుగుతోంది. కొత్త చట్టం అమల్లోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో ఎప్పటి నుంచో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ మూడు పోర్టులు రెండేళ్లలో కేంద్రం నుంచి అనుమతి తీసుకోవాలని, లేకపోతే వాటి కార్యకలాపాలు నిలిపివేస్తామని చట్టంలో పేర్కొనడాన్ని ఏపీ మారిటైమ్ బోర్డు తీవ్రంగా తప్పుపట్టింది. రాష్ట్ర హక్కులను కాలరాసే ఈ బిల్లును తక్షణం ఉపసంహరించుకోవాలని, లేకపోతే కనీసం ఇప్పటికే ఉన్న పోర్టులను ఈ బిల్లు పరిధి నుంచి తప్పించాలంటూ కేంద్రానికి ఏపీ మారిటైమ్ బోర్డు లేఖ రాసింది. -
దొంగ ఎవరో దొర ఎవరో తేలిపోయింది
సాక్షి, తూర్పుగోదావరి : మాజీ టీడీపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అవినీతిని రుజువు చేస్తానంటూ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బుధవారం సత్య ప్రమాణానికి సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బిక్కవోలు గణపతి ఆలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసు అధికారులు లక్ష్మీ గణపతి ఆలయం వద్ద భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. అనపర్తి, బిక్కవోలు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేశారు. మధ్యాహ్నం ఉద్రిక్త పరిస్థితుల మధ్యే ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి బిక్కవోలు లక్ష్మీ గణపతి ఆలయంలో ఆయన భార్యతో కలిసి సత్యప్రమాణం చేశారు. ప్రమాణం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ వినాయకుని సత్యనీతితో ప్రమాణం చేశా. రామకృష్ణారెడ్డి భార్య ప్రమాణం చేయలేదు. ఆమెపై ఆరోపణలు వచ్చాయి. దేవుని దగ్గర దొంగ ఎవరో దొర ఎవరో తేలిపోయింది. అసత్య ఆరోపణలు చేసే వారికి మీడియా టైం కేటాయించొద్దు. రాబోయే రోజుల్లో రామకృష్ణా రెడ్డి ఆరోపణలు ఇక పట్టించుకోం. ఆయనవి పిచ్చివాగుడు గానే భావిస్తాం. ఈ రోజుతో రామకృష్ణారెడ్డితో పరస్పర ఆరోపణలకు పుల్ స్టాప్ పెట్టేశా. పిచ్చి వారి వాదనల్ని ఇకపై పట్టించుకోను’’ అని స్పష్టం చేశారు. ( కాపురంలో పొలిటికల్ చిచ్చు; స్పందించిన సుజాత) కాగా, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి ప్రమాణం చేయటానికి మొదట వెనకడుగు వేశారు. ప్రమాణం తర్వాత చేద్దాం.. చర్చించుకుందామని అన్నారు. ఇక తప్పని పరిస్థితుల్లో సత్యప్రమాణం చేశారు. -
అనపర్తి, బిక్కవోలు మండలాల్లో హైటెన్షన్
తూర్పు గోదావరి : జిల్లాలోని అనపర్తి, బిక్కవోలు మండలాల్లో పొలిటికల్ హైటెన్షన్ నెలకొంది. అనపర్తి ఎమ్మెల్యే సూర్యనారాయణరెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య మరోసారి రాజకీయ విబేధాలు భగ్గుమన్నాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇరు మండలాల్లో 144 సెక్షన్ అమలు చేయనున్నారు. రామకృష్ణా రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న హయాంలో జరిగిన అవినీతి చిట్టాను బయటపెడతానని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఆయన అవినీతిని రుజువు చేసేందుకు తనతో పాటు సాక్షులుతో సత్యప్రమాణాలు చేయించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో నేడు బిక్కవోలు వినాయక గుడి లో మధ్యాహ్నం 2.30గంటలకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తన భార్య తో కలసి సత్యప్రమాణం చేయనున్నారు. ఇదే సమయంలో రామకృష్ణారెడ్డి కూడా సతీ సమేతంగా అదే గుడిలో సత్యప్రమాణానికి సిద్ధమయ్యారు. దీంతో అక్కడ ఏం జరగనుందనే దానిపై రాజకీయ వర్గాల్లో హైటెన్షన్ నెలకొంది. కాగా ఇరు వర్గాలకు ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. -
బరితెగించిన పచ్చ గూండాలు
-
దాడి చేసింది రైతులు కాదు.. టీడీపీ గూండాలే
సాక్షి, అమరావతి బ్యూరో/పట్నంబజారు/మంగళగిరి: రాజధాని రైతుల ముసుగులో పక్కా ప్రణాళికతో టీడీపీ గూండాలు తనపై దాడి చేశారని ప్రభుత్వ విప్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక పథకం ప్రకారం కొంతమంది బయటివారిని తీసుకొచ్చి ఈ దాడి చేయించారన్నారు. ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులపై దాడులు చేసి.. రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాజధానిలో ఏదో జరిగిపోతున్నదని శాంతిభద్రతల సమస్య లేవనెత్తాలని మాజీ సీఎం ఇటువంటి కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మంగళవారం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకాని వద్ద తన కారుపై దాడి ఘటన అనంతరం పీఆర్కే.. ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబుతో కలసి గుంటూరులో విలేకరులతో మాట్లాడారు. అంతకుముందు కాజ గ్రామంలో వైఎస్సార్సీపీ నేత అన్నపురెడ్డి బ్రహ్మానందరెడ్డి కార్యాలయంలోనూ మీడియాతో మాట్లాడారు. తాను గుంటూరు నుంచి విజయవాడకు సర్వీసు రోడ్డుపై వెళుతుండగా.. మూకుమ్మడిగా తన కారుపైకి 50 మందికిపైగా వచ్చి రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారని తెలిపారు. కారును ధ్వంసం చేశారని, గన్‌మెన్‌పై దాడి చేశారని చెప్పారు. తనపై దాడికి పాల్పడింది రైతులు కాదని, టీడీపీ అల్లరిమూకలు, బయటినుంచి వచ్చిన గూండాలేనన్నారు. నిజంగా రైతులే దాడి చేసుంటే.. అప్పటికప్పుడు వాళ్ల చేతిలోకి రాళ్లు, కర్రలు ఎలా వస్తాయని ప్రశ్నించారు. చంద్రబాబు బినామీలు, ఓ వర్గం వారు తమ కలలు చెరిగిపోతున్నాయనే అసూయతో దాడిచేసి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారన్నారు. రాజధాని రైతులు చంద్రబాబు ట్రాప్‌లో పడవద్దని హితవు పలికారు. తన కారుమీద రాళ్లు వేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. దాడులు చేయించటం బాబుకు కొత్తేమీ కాదు: అంబటి అమరావతిపై జరుగుతున్న ఆందోళన శ్రుతి మించుతోందని అంబటి రాంబాబు అన్నారు. ఉద్యమం పేరుతో దాడులకు దిగుతూ.. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించడాన్ని వైఎస్సార్సీపీ సీరియస్‌గా పరిగణిస్తోందన్నారు. చంద్రబాబు వ్యక్తిగత పర్యవేక్షణలో ఉద్యమం పేరుతో కొంతమంది హింసాకాండలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తన పదవికి నష్టం వాటిల్లితే చంద్రబాబు ఎంతటి దుర్మార్గాలకైనా వెనుకాడరన్నారు. వంగవీటి రంగాను హత్య చేయించింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. పరిటాల రవి హత్య జరిగినప్పుడు టీడీపీ నాయకులందరికీ చంద్రబాబే బస్సులు కాల్చండి, హింసను ప్రోత్సహించండని పిలుపునిచ్చిన విషయాన్ని దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన పుస్తకంలో పేర్కొన్నారని తెలిపారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఒక వర్గానికి చెందినవారు చంద్రబాబు ప్రోద్బలంతో ఉద్యమాలు చేపడుతున్నారన్నారు. కుట్రపూరితంగా ఉద్యమం జరుగుతోందని, అందుకు నిదర్శనం మీడియా యాంకర్ దీప్తిపై, ఎమ్మెల్యే పిన్నెల్లిపై దాడులు చేయటమేనన్నారు. ఎమ్మెల్యే విడదల రజని మాట్లాడుతూ పిన్నెల్లిపై జరిగిన హత్యాయత్నం టీడీపీ ఉన్మాదుల చర్యేనన్నారు. వీడియో ఫుటేజీల ద్వారా దాడి ఘటనపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. బాబూ.. ముసుగు తీసి రా చంద్రబాబూ.. రాజధాని ముసుగులో కాకుండా, ముసుగు తీసి నువ్వూ నీ కొడుకు రండి.. తెరవెనుక రాజకీయాలు చేయడమేంటని పీఆర్కే మండిపడ్డారు. డైరెక్ట్‌గా వస్తే తమ సత్తా ఏంటో చూపుతామన్నారు. రాజదాని ముసుగులో భయపెట్టాలని చూస్తే బెదిరేవారు ఎవరూ లేరన్నారు. మీకు దమ్ముంటే తమను టచ్ చేస్తే తమ సత్తా ఏంటో చూపుతామన్నారు. సీఎంను కలిసిన పిన్నెల్లి ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మంగళవారం రాత్రి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ని కలిశారు. తనపై జరిగిన దాడి గురించి వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతులకోసం సీఎం వైఎస్ జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, వాటిని డిస్ట్రబ్ చేసేందుకు, ఈ నెల 9 నుంచి ప్రారంభమయ్యే అమ్మఒడి పథకం నుంచి ప్రజల దృష్టి మరలించేందుకే చంద్రబాబు రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నారని విమర్శించారు. మరొక్కసారి తమ జోలికొస్తే పల్నాడు పౌరుషం చూపిస్తామన్నారు. దాడికి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాల వీడియోను ఎస్పీని కలసి అందజేసినట్టు తెలిపారు. రాజధాని రైతులపై సీఎంకు పూర్తి సానుభూతి ఉందని, తప్పక న్యాయం చేస్తారని తెలిపారు. రాజధానిలో బాబు చేసిన ఇన్సైడర్ ట్రేడింగ్ బయటపడుతుందని రాజధాని రైతులను చంద్రబాబు రెచ్చగొట్టి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై దాడులు చేయిస్తున్నారని ఎమ్మెల్యే కిలారి రోశయ్య అన్నారు. -
వివరాలన్నీ సాయంత్రం వెల్లడిస్తాం : ఆర్కే
సాక్షి, గుంటూరు : రాజధాని విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురువారం స్పందించారు. ‘నాలుగు రోజులుగా నా వ్యక్తిగత పనులపై తిరుగుతున్నాను. మా ఇంట్లో త్వరలో ఒక పెళ్లి జరగబోతోంది. ఆ పని మీద కాస్త బిజీగా ఉన్నాను. చంద్రబాబు గత నలభై ఏళ్లుగా కుప్పంలో కనపడడం లేదని అక్కడి ప్రజలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ముందుగా వారికి సమాధానం చెప్పాలి. నేను రైతుల కోసం చాలా పోరాటాలు చేశాను. ఇప్పుడు కూడా వైఎస్సార్సీపీ రైతుల పక్షాన నిలబడుతుంది. సాయంత్రం జరిగే మీటింగ్‌లో అన్ని వివరాలు వెల్లడిస్తామ’ని ఎమ్మెల్యే పేర్కొన్నారు. -
వైఎస్సార్ జిల్లాలో విషాదం..
సాక్షి, వైఎస్సార్ జిల్లా : అన్న మరణవార్త విన్న ఓ చెల్లి గుండెపోటుతో మృతి చెందడంతో శనివారం జిల్లాలోని బద్వేలులో విషాదచాయలు అలుముకున్నాయి. బద్వేలుకు చెందిన ఉపాధ్యాయ ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. రామకృష్ణా రెడ్డి మృతి విషయం తెలుసుకున్న ఆయన చెల్లెలు సుబ్బలక్ష్మీ కూడా గుండెపోటుకు గురై మృతిచెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది. కాగా... రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలుసుకున్న పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు నివాళులర్పించారు. అలాగే అన్నా చెల్లెలి మధ్య అనురాగం, ఆప్యాయతను పలువురు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. -
బెంగళూరులో ‘అనంత’ యువతి ఆత్మహత్య
భర్తే హత్య చేశాడంటున్న మృతురాలి బంధువులు అనంతపురం: అనంతపురం నగరానికి చెందిన ఓ వివాహిత ఆదివారం బెంగళూరు నగరంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఆమె మృతికి భర్తే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం...అనంతపురం నగరంలోని గుత్తి రోడ్డు టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ఆర్డబ్ల్యూఎస్ ఉద్యోగి జి.చంద్రశేఖర్‌రెడ్డి రెండో కుమార్తె రమ్యకృష్ణారెడ్డి (30)ని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తలుపులకు చెందిన నారాయణరెడ్డికి ఇచ్చి మూడేళ్ల కిందట వివాహం జరిపించారు. రమ్యకృష్ణారెడ్డి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా బెంగళూరులో పనిచేస్తోంది. వివాహం తర్వాత కొద్దికాలం ఆనందంగా గడిచిన వీరి సంసారంలో మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. నారాయణరెడ్డి రోజూ రమ్యకృష్ణారెడ్డిని వేధించేవాడు. ఈ క్రమంలో ఆమె ఏడాదిన్నర క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. అప్పటి నుంచి పుట్టింటిలోనే ఉంటోంది. నాలుగుల రోజుల క్రితం కుమారుడిని పుట్టింటిలోనే వదిలి భర్త వద్దకు వెళ్లింది. తల్లిదండ్రలు వారించినా తన భర్తతో తానే మాట్లాడుకొని సర్దుబాటు చేసుకుంటామని చెప్పి వెళ్లింది. అయితే ఆదివారం ఉదయం 11.25 గంటల సమయంలో తాను మార్కెట్టు వెళ్తున్నానంటూ.. రమ్యకృష్ణారెడ్డి అనంతపురంలో ఉన్న బంధువులకు మెసేజ్ పంపింది. 12.45 గంటలకు రమ్యకృష్ణారెడ్డి ఆత్మహత్య చేసుకుందంటూ.. తల్లిదండ్రులకు సమాచారం అందింది. దీంతో వారు హుటాహుటిన బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. అప్పటికే పోలీస్‌స్టేషన్‌లో ఉన్న అల్లుడు నారాయణరెడ్డిని నిలదీయగా 11.30 గంటల సమయంలో ఆత్మహత్య చేసుకుందని తెలిపాడు. అయితే 11.25 గంటల సమయంలో మార్కెట్టు వెళ్తున్నట్లు తనకు మేసేజ్ పెట్టిన తమ బిడ్డ ఐదు నిమిషాల్లోనే ఇంట్లో ఎలా ఉరి వేసుకుంటుందని రమకృష్ణారెడ్డి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు రమ్యకృష్ణారెడ్డి తండ్రి చంద్రశేఖర్‌రెడ్డి తన కుమార్తె మృతికి అల్లుడే కారణమంటూ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
రామకృష్ణారెడ్డి మరోసారి బరిలోకి
కర్నూలు(అగ్రికల్చర్): నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష పదవికి జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి రెండోసారి బరిలోకి దిగుతున్నారు. కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీనియర్ అసిస్టెంట్‌గా ఉన్న ఈయన మరోసారి ఆశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి ప్యానల్ తరఫున ఆదివారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్ వెంగళరెడ్డి, జవహార్‌లాల్, కోశాధికారి పి.రామకృష్ణారెడ్డి ఆయన పేరును ప్రతిపాదించనున్నారు. విజయవాడలో రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలకు ¯సంబంధించి నేడు జరిగే నామినేషన్ కార్యక్రమానికి జిల్లా నుంచి వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తరలివెళ్లారు. ఈ సందర్భంగా వెంగళరెడ్డి మాట్లాడుతూ జిల్లా కార్యవర్గం పూర్తిగా రామకృష్ణారెడ్డికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. -
‘ఫిరాయింపుల’పై కేసీఆర్‌తో ఏజీ భేటీ
పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్లోకి ఫిరాయించిన నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుకు సంబంధించి సీఎం కేసీఆర్, శాసనసభావ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు సమాలోచనలు జరిపారు. శుక్రవారం సీఎం అధికారిక నివాసానికి అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారె డ్డిని పిలిపించి చర్చించారు. ఈ నెల 8లోగా ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఏం చర్యలు తీసుకుంటారో తెలపాలంటూ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారికి సుప్రీంకోర్టు సూచిం చిన నేపథ్యంలో కోర్టులో వేయాల్సిన పిటిషన్‌పై చర్చించేందుకు, న్యాయ సలహా పొందేందుకు కేసీఆర్, హరీశ్‌రావులు ఏజీని పిలిపించి చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. గతంలో ఇతర రాష్ట్రాల్లో ఇలాంటి పరిస్థితులే తలెత్తినప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై నిర్ణయం తీసుకునే పూర్తి విచక్షణాధికారం స్పీకర్‌కే ఉన్నా న్యాయ వ్యవస్థను గౌరవిస్తూ ఈ వ్యవహారంలో ఏం చర్యలు తీసుకుంటున్నారో వివరిస్తూ సమాధానం ఇవ్వాల్సిన అవసరంపై చర్చించారని సమాచారం. 2014 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ముథోల్ ఎమ్మెల్యే గడ్డం విఠల్‌రెడ్డి, డోర్నకల్ ఎమ్మెల్యే రెడ్యానాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరెం కనకయ్య, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యలు టీఆర్ఎస్లో చేరారు. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని కాంగ్రెస్ శాసనసభాపక్షం (సీఎల్పీ) విప్, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. అయితే స్పీకర్ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో దీన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరోవైపు అసెంబ్లీ సమావేశాలను ఎప్పటి నుంచి నిర్వహించాలనే అంశంపైనా కేసీఆర్, హరీశ్‌రావు చర్చించుకున్నట్లు అధికార పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. -
ఏజీతో మంత్రి హరీశ్‌రావు భేటీ
సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల, శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు అసెంబ్లీలోని తన కార్యాలయంలో అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, శాసనసభా కార్యదర్శి రాజా సదారాం కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఈ నెల 8 కల్లా తెలపాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో హరీశ్ ఏజీతో సమావేశమైనట్లు సమాచారం. ఈ వ్యవహారంలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు, అవసరమైన న్యాయ సలహా తీసుకునేందుకు ఏజీని అసెంబ్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. కాగా, స్పీకర్ మధుసూదనచారి స్థానికంగా లేకపోవడంతో ఈ భేటీకి హాజరుకాలేదు. అయితే స్పీకర్ కూడా ఇప్పటికే ఏజీని న్యాయ సలహా కోరినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఇతర రాష్ట్రాల స్పీకర్లు తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరును తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. -
ఎస్సై ఆత్మహత్య ఘటనపై హెచ్చార్సీ ఆగ్రహం
ఉన్నతాధికారుల ఒత్తిడి వల్ల ఆత్మహత్య చేసుకున్న కుకునూర్‌పల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి ఆత్మహత్య ఘటనపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించిన హెచ్చార్సీ ఆత్మహత్యకు గల కారణాలపై సమగ్ర నివేదిక అందివ్వాలని హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ, డీజీపీలకు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 30 లోగా నివేదిక అందించాలని ఆదేశించింది. -
రోడ్ల పేరుతో ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే
గుంటూరు: రాజధాని పేరుతో ఇళ్లను తొలగించి రోడ్లు వేస్తున్న ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. కృష్ణాయపాలెంలో ఇళ్ల తొలగింపుపై హైకోర్టు స్టే ఇచ్చింది. ప్రభుత్వం ఇళ్లను తొలగించి రోడ్లు వేస్తుండటంతో బాధితుల తరపున వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు.. బాధితులకు అనుకూలంగా స్టే ఇచ్చింది. స్టే కాపీలను ఆర్కే బాధితులకు అందించారు. -
'తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలి'
విజయవాడ: రాజధాని ముసుగులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవినీతి పరాకాష్టకు చేరిందని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అన్నారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతి విషయంలో తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. అలాగే చంద్రబాబు విదేశీ కంపెనీలతో చేసుకుంటున్న ఒప్పందాలు, అవినీతిపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని చర్యలు తీసుకోవాలని ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. -
ఆ సలహా నేనే ఇచ్చా! - హీరో శ్రీకాంత్
‘‘గతంలో నాతో ‘వీడికి దూకుడెక్కువ’ చిత్రాన్ని బెల్లం రామకృష్ణా రెడ్డి నిర్మించారు. సినిమాపై ఆయనకున్న ఆసక్తిని చూసి, దర్శకునిగా మారమని నేనే సలహా ఇచ్చా. అన్నట్లుగానే ఆయన ఇప్పుడు ‘దృశ్యకావ్యం’ చిత్రంతో దర్శకుడయ్యారు’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ‘దృశ్యకావ్యం’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘‘ దర్శకుడిగా చేసిన మొదటి ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. చిత్రం హీరో, హీరోయిన్లు, కెమేరామ్యాన్ సంతోష్ శానమోని, సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్, ఎడిటర్ నాగిరెడ్డి తదితరులు మాట్లాడారు. -
దృశ్యకావ్యం... ఆద్యంతం ఉత్కంఠభరితం
‘‘‘దృశ్యకావ్యం’లోని ప్రధాన తారాగణంతో పాటు టెక్నీషియన్స్‌కు కూడా ఎటువంటి స్టార్ వాల్యూ లేదు. కంటెంట్ మీద నమ్మకంతో తీసిన సినిమా ఇది’’ అని దర్శక-నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి అన్నారు. కార్తీక్, కశ్మీర జంటగా పుష్యమి ఫిలిం మేకర్స్ పతాకంపై స్వీయదర్శకత్వంలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన చిత్రం ‘దృశ్యకావ్యం’. ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి చెప్పిన విశేషాలు.... పుష్యమి ఫిలిం మేకర్స్‌పై ఇది రెండో సినిమా. ఇదే బ్యానర్‌పై శ్రీకాంత్, కామ్నా జెఠ్మలానీ జంటగా ‘వీడికి దూకుడెక్కువ’ అనే యాక్షన్ ఎంటర్టైనర్ను నిర్మించాం. రెండో సినిమాగా కొత్త తారాగణంతో, టెక్నీషియన్లతో ‘దృశ్యకావ్యం’ రూపొందించాను. ఎంటర్టైన్ చేస్తూనే, హారర్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో ఆద్యంతం ఉత్కంఠకు గురి చేసే చిత్రమిది. వరంగల్, హైదరాబాద్, ఇంకా పలు లొకేషన్లలో 90 రోజుల్లో పూర్తి చేశాం. ‘ఎవడి గోల వాడిదే’, ‘వాన’, ‘ప్రాణం’ చిత్రాల ఫేమ్ కమలాకర్ ఈ చిత్రానికి మంచి స్వరాలు అందించారు. ఇప్పటికే మ్యూజికల్‌గా మంచి హిట్ సాధించింది. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని మిగిల్చే చిత్రం ఇది. మొదటి 20 నిమిషాలు పాత్రల పరిచయం తదితర దృశ్యాలతో సాగుతూ, ఆ తర్వాత ప్రతి నిమిషం ఆసక్తికరంగా సాగుతూ థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ‘దృశ్యకావ్యం’ అని టైటిల్ ఎందుకు పెట్టామో క్లయిమాక్స్‌లో తెలుస్తుంది. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ చిత్రం కనువిందుగా ఉంటుంది. హృదయానికి హత్తుకునే చిత్రం కూడా. ప్రస్తుతం నా దగ్గర కొన్ని కథలు ఉన్నాయి. ఏ కథతో సినిమా చేయబోతున్నానో త్వరలో చెబుతాను. దర్శకత్వమే కాకుండా కొత్త కథలతో దర్శకులు వస్తే వాళ్లతో కూడా సినిమా నిర్మించడానికి రెడీ. -
చిన్నారిపై టీచర్ లైంగిక దాడి
చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాలపై దాడికి దిగారు. బస్సులను తగులబెట్టి, ఫర్నిచర్‌ను ధ్వంసంచేశారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఈ ఘటన మెదక్ జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మిర్దొడ్డిలోని వికాస్ ప్రైమరీ స్కూలులో కుమార్(22) అనే వ్యక్తి పీఈటీగా పనిచేస్తున్నాడు. అతడు స్కూల్లో చదువుకునే ఆరేళ్ల బాలికపై కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. రెండు రోజుల క్రితం ఆ విషయం తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. దీంతో వారు దుబ్బాక సీఐ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం బంధువుల తో కలసి పాఠశాలకు చేరుకుని సిబ్బందిపై దాడికి యత్నించారు. ఆవరణలోని రెండు పాఠశాల బస్సులను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. పాఠశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం మిర్దొడ్డి ప్రధాన జంక్షన్లో రాస్తారోకోకు దిగారు. విషయం తెలిసి సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌గౌడ్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి, పంపేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపేందుకు డిప్యూటీ డీఈవో శ్యాంప్రసాద్‌రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో మాజీ మంత్రి కుమారుడు మృతి
బత్తులపల్లి (అనంతపురం) : వేగంగా వెళ్తున్న వాహనం.. ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి పల్టీలు కొట్టిన ఘటనలో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనలో మృతి చెందినవారిలో ఒకరు మాజీ మంత్రి గరుడమ్మగారి నాగిరెడ్డి కుమారుడు సతీష్ రెడ్డి(45) కాగా.. మరొకరు అతని బంధువు రామకృష్ణా రెడ్డి(60)గా గుర్తించారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా బత్తులపల్లి మండలం మరుగొడ్డువంక వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. అనంతపురం నుంచి తన స్వగ్రామమైన తాడిమర్రి మండలం దాడితోటకు స్కార్పియో వాహనంలో బయలుదేరిన సతీష్ రెడ్డి మరుగొడ్డువంక వద్దకు చేరుకోగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నం చేశాడు. అదే సమయంలో కారు అదుపుతప్పడంతో.. రోడ్డుపై పల్టీలు కొట్టుకుంటూ వెళ్లి బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
చంద్రబాబుది నియంత పాలన : ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి: భూముల సర్వేను లైసైన్స్‌డ్ సర్వేయర్లకు అప్పగిస్తే భూ వివాదాలు మరింత పెరగడంతో పాటు అవినీతి విచ్చలవిడిగా మారే అవకాశం ఉందని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణంలోని తన కార్యాలయంలో ఆర్కే గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. లైసైన్స్‌డ్ సర్వేయర్ల కు సర్వే బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. ముఖ్యంగా రాజధాని ప్రాంత పేదలకు చెందిన లంక అసైన్డ్భూములను కొట్టేసేందుకే ప్రభుత్వ పెద్దలు చేసిన కుట్రలో భాగమే లెసైన్స్డ్ సర్వేయర్లను ప్రవేశపెడుతున్నారని ఆరోపించారు. అధికారపార్టీ నేతలు రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై ఉన్నతాధికారులతో ఒత్తిళ్లు తెచ్చి ఇప్పటికే అక్రమాలు చేయిస్తూ రెవెన్యూ కార్యాలయాల్లో దళారులుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మాటవినని అధికారులను సైతం బదిలీ చేయిస్తామని, అవినీతి నిరోధక శాఖకు పట్టిస్తామంటూ బెదిరిస్తూ.. పనులు చేయించుకుంటూ అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు ఇక సర్వేలను తమ ఇష్టానుసారంగా నిర్వహించి భూములు కాజేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. కీలకమైన రెవెన్యూ శాఖలో నూతన రిక్రూట్మెంట్తో ఉద్యోగాలను భర్తీచేసి ప్రజలకు భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం.. ఇలా ప్రైవేటు వ్యక్తులకు సర్వే బాధ్యతలను అప్పగించి అవినీతిని ప్రోత్సహించడం దుర్మార్గమన్నారు. వెనుకబడిన వర్గాలకు చెందిన రెవెన్యూ మంత్రి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా చంద్రబాబు రెవెన్యూశాఖలో నిర్ణయాలు తీసుకోవడంపై మంత్రివర్గంలోనే అసంతృప్తి వ్యక్తమవుతోందన్నారు. అవేమీ పట్టించుకోని ముఖ్యమంత్రి నియంతపాలన సాగిస్తున్నారని దుయ్యబట్టారు. జన్మభూమి కమిటీలగానే లెసైన్స్ సర్వేయర్లతో అవినీతి పెచ్చరిల్లే ప్రమాదం ఉన్నందున వెంటనే జీవోను ఉపసంహకరించుకోకపోతే కోర్టులో పిల్ వేస్తానని స్పష్టం చేశారు. తన సామాజికవర్గానికి దోచిపెట్టేందుకే.. పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ వుండగా, అది కాదని అధికార యంత్రాంగాన్ని హడావుడిగా తరలించాలని అనుకోవడం వెనుక చంద్రబాబు అద్దె నివాసాల పేరుతో తన అనుకూల సామాజిక వర్గానికి దోచిపెట్టేందుకేనని విమర్శించారు. అందులో భాగంగా తనకు అక్రమ కట్టడమైన అతిథి గృహాన్ని అద్దెకు ఇచ్చిన వారికి బహుమతిగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురు వున్న అపార్ట్మెంట్లు, విల్లాలకు భారీ అద్దెలు చెల్లించి దోచిపెడుతున్నారని ఆర్కే ఆరోపించారు. ఉద్యోగులను తరలించాలని విజయవాడ చుట్టుపక్కల అద్దెలకు తీసుకుంటున్న అపార్ట్మెంట్లు, అతిథి గృహాలు అన్ని తన బినామీలు, సామాజిక వర్గానికి చెందినవేనని, వాటికి అత్యధిక అద్దెలు చెల్లించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని పేర్కొన్నారు. -
ఆడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డితో క్వశ్చన్ టైమ్
-
'పార్టీకి ఓట్లేసిన వారికే పని చేస్తామని జీవో జారీ చేయండి'
-
'పార్టీకి ఓట్లేసిన వారికే పని చేస్తామని జీవో జారీ చేయండి'
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అణగదొక్కేందుకు... పోలీసుల సాయం తీసుకుందామన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల వ్యాఖ్యలపై ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్‌లో ఆర్కే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటలోనే మంత్రులు పయనిస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌ల్లో కొంతమంది పచ్చచొక్కాలేసుకుంటే మంచిదని సూచించారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి ఓట్లేసిన వారికే పనిచేస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారణమన్నారు. టిడిపికి ఓట్లేసిన వారికే పనిచేస్తామని జీవో విడుదల చేయండి అంటూ ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యమా ? లేక రాచరికమా ? అని ఆర్కే ఈ సందర్భంగా చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. -
సమరదీక్షను జయప్రదం చేయండి: ఎమ్మెల్యే ఆర్కే
గుంటూరు: ప్రజాసమస్యల పరిష్కారంలో వైఫల్యం చెందిన టీడీపీ ప్రభుత్వ తీరును ఎండగడుతూ ప్రతిపక్షనేత, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి జూన్ 3, 4 తేదీలలో మంగళగిరిలో తలపెట్టిన సమరదీక్షను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు పలు హామీలిచ్చి..తీరా అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయడంలో వెనుకంజ వేస్తున్నారని మండిపడ్డారు. రాజధాని పేరుతో భూములు లాక్కొని రైతులను భయపెడుతున్నారని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం ప్రజా సమస్యలను పూర్తిస్థాయిలో విస్మరించిందన్నారు. అన్ని వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడితెచ్చి ప్రజల పక్షాన నిలబడేందుకే జగన్మోహన్రెడ్డి సమరదీక్షను చేపట్టినట్లు వెల్లడించారు. -
జగన్ యాత్ర.. రైతుకు భరోసా
మంగళగిరి : రాజధాని ప్రాంత రైతులకు, రైతు కూలీలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆ పార్టీ ముఖ్యనేతలు స్పష్టం చేశారు. తమ పార్టీ అధినేత ైవె .ఎస్.జగన్మోహన్రెడ్డి ఈనెల 3వ తేదీన రాజధాని ప్రాంతంలో పర్యటిస్తారని, రైతుల్లో ధైర్యం నింపేలా ఆయన పర్యటన సాగుతుందని వివరించారు. పార్టీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్, జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలు సంయుక్తంగా ఆదివారం జగన్ పర్యటన వివరాలు వెల్లడించారు. రైతులకు భరోసా కల్పించి వారి సాధకబాధకాలు తెలుసుకోవటానికే జగన్ పర్యటిస్తున్నారని, రైతులు, రైతు కూలీలతో మాట్లాడి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకోనున్నారని తెలిపారు. రాజధాని వ్యవహారంలో రైతులకు తమ పార్టీ అండగా నిలిచిందని ఇప్పటికే పలు దఫాలు పార్టీ నేతలు రైతు సంఘ నాయకులు పార్టీ ప్రతినిధి బృందం, శాసనసభాపక్ష బృందం ఈ ప్రాంతంలో పర్యటించిందని చెప్పారు. తద్వారా పార్టీ నేతలు ఎప్పటికప్పుడు రాజధాని ప్రాంత రైతుల సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారని, ఆయన సంబంధిత అధికారులతో, పార్టీ నాయకులతోనూ మాట్లాడి రైతులకు అండగా నిలిచారని వివరించారు. రాజధాని నిర్మాణంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అసెంబ్లీలోనే పార్టీ అధినేత జగన్ ప్రకటించిన విషయం గుర్తుచేశారు. రాజధాని నిర్మాణ క్రమంలో రైతులు, రైతుకూలీల ప్రయోజనాలకు విఘాతం కలిగించకుండా చూడాలని తాము మొదటి నుంచీ డిమాండ్ చేస్తున్నామన్నారు. జగన్ పర్యటన షెడ్యూల్ ఇదీ.. మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో వై.ఎస్.జగన్మోహన్రెడ్డి విజయవాడ చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి వచ్చి రాజధాని ప్రాంతంలోని ఉండవల్లిలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంటారు. ఉదయం 9 గంటల నుంచి తాడేపల్లి, మంగళగిరి, తుళ్లూరు మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటిస్తారు. అక్కడి రైతులు, రైతు కూలీలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారు. సాయంత్రం అక్కడ నుంచి బయలుదేరి గుంటూరు నగరానికి చేరుకుంటారు. అక్కడ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కొద్దిసేపు మాట్లాడి, హైదరాబాద్ తిరుగు పయనమవుతారని పార్టీ నేతలు వివరించారు. -
రైతులకే రూ.కోటి లీజు ఇవ్వాలి: ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, హైదరాబాద్: రాజధాని నిర్మాణం కోసమని భూమిని సమీకరిస్తున్న ప్రభుత్వం అక్కడి రైతులకు ఎకరాకు ఏడాదికి రూ.కోటి చొప్పున లీజు కింద 99 ఏళ్ల కాలవ్యవధికి చెల్లించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఆయన మంగళవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరి ప్రాంతంలో ఎకరాకు ఏడాదికి రూ.కోటి చొప్పున 33 సంవత్సరాల లీజుకు అమెరికాకు చెందిన ‘పై డేటా సెంటర్’ అనే సంస్థకివ్వాలని ఏపీ మంత్రివర్గ సమావేశం నిర్ణయించిందని వివరించారు. ఈ మేరకు పత్రికల్లో వచ్చిన వార్తలను చూపుతూ.. రైతుల అభీష్టానికి భిన్నంగా రాజధాని ప్రాంతంలో వారి భూములను లాక్కుంటున్న చంద్రబాబు విదేశీ సంస్థల మెప్పుకోసం, అడ్డదారిలో సంపాదించుకోవడంకోసం రైతుల భూములను లాక్కోవడం దారుణమన్నారు. అక్కడి భూములను విదేశీ సంస్థలకు ఎకరాకు రూ.కోటి చొప్పున లీజుకు ఇస్తున్నపుడు.. అదే మొత్తాన్ని రైతులకిచ్చి ప్రతి ఏటా పెరిగే ధరల సూచీ ప్రకారం లీజును పెంచుతూ ఎందుకివ్వకూడదని ప్రశ్నించారు. మంగళగిరిలో స్వచ్ఛందంగా భూములిచ్చిన రైతులే లేరని, 90 శాతం మంది 9.2 ఫారాలు ఇస్తున్నపుడు స్పష్టత లేకుండా అమెరికా కంపెనీకి భూమిని లీజుకు ఎలా ఇస్తారని ఆర్కే ప్రశ్నించారు. చరిత్రలో ఏ రాజూ రైతుల భూములను లాక్కోలేదని, రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కొంటున్న చంద్రబాబు చరిత్రహీనుడుగా మిగిలిపోతారని దుయ్యబట్టారు. -
హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి గొడ్డలిపెట్టు
-
కాయకల్ప చికిత్స ప్రకృతి సేద్య కళతో పునరుజ్జీవనం!
{పకృతి సేద్య కళను ఉద్యమ స్ఫూర్తితో రైతులకందిస్తున్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ సంస్థ అన్నదాతల ఆత్మహత్యల్లేని ఆరోగ్యదాయక సమాజం కోసం విస్తృతంగా రైతు శిక్షణ శిబిరాలు 6 నెలల్లో వెయ్యి మంది ప్రకృతి వ్యవసాయ ఉపాధ్యాయులకు శిక్షణతో ఊరూరా శిబిరాలు.. ఉచిత కాల్‌సెంటర్.. {పకృతి వ్యవసాయ పంచాంగం రూపకల్పన.. రైతుల భాగస్వామ్యంతో స్వతంత్ర మార్కెటింగ్ వ్యవస్థ ఏర్పాటు యత్నాలు తెలుగునాట రెండేళ్లలో ప్రకృతి వ్యవసాయ విప్లవం తథ్యం.. ఐదేళ్లలో పూర్తిగా రసాయనిక అవశేషాల్లేని ఆహారోత్పతి సాధ్యమే.. ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలుగు రాష్ట్రాల సారథి పులిమామిడి రామకృష్ణారెడ్డి వెల్లడి తెలుగునాట సంక్షోభంలో కూరుకుపోయి అల్లాడుతున్న అన్నదాతలకు ప్రకృతి వ్యవసాయాన్ని ‘జీవన కళ’తో మేళవించి అందిస్తోంది ఆర్ట్ ఆఫ్ లివింగ్(ఏఓఎల్) ఆధ్యాత్మిక సంస్థ. రైతుల జీవితాలను, భూములను పునరుజ్జీవింపజేయడానికి సుభాష్ పాలేకర్ ప్రకృతి వ్యవసాయ పద్ధతి ద్వారా సులువుగా సాధ్యమవుతుందని ఏఒఎల్ విశ్వసిస్తున్నదని తెలుగు రాష్ట్రాల కమిటీ అధ్యక్షుడు పులిమామిడి రామకృష్ణారెడ్డి (98490 57599) ‘సాక్షి’ ఇంటర్వ్యూలో తెలిపారు. నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించిన పారిశ్రామికవేత్త రామకృష్ణారెడ్డి ఏఓఎల్‌కు ఎనిమిదేళ్లుగా సారథ్యం వహిస్తున్నారు. అప్పులు, ఆత్మహత్యల్లేని వ్యవసాయాన్ని రైతులు.. విషరహిత ఆహారాన్ని వినియోగదారులు కోరుకుంటున్నారన్నారు. ఈ లక్ష్య సాధన కోసమే గత ఆర్నెల్లుగా ‘రుషి కృషి’ పేరుతో ప్రకృతి వ్యవసాయ శిక్షణ ఇస్తు న్నామని చెప్పారు. మనిషి మారితేనే వ్యవసాయ పద్ధతి మారుతుందంటూ.. జీవన కళతో మేళవించిన వ్యవసాయ శిక్షణ సత్ఫలితాలనిస్తున్నదన్నారు. ఇలాఉండగా, హైదరాబాద్‌కు చెందిన చక్కిలం ఉమామహేశ్వరి(90004 08907) ప్రకృతి వ్యవసాయ శిక్షణ కార్యకలాపాలను సమన్వయపరుస్తున్నారు. బ్యాంకులో ఉన్నతోద్యాగాన్ని పదేళ్లు ముందే వదిలేసి ఆర్ట్ ఆఫ్ లివింగ్ కార్యక్రమాలకు ఆమె పూర్తికాలాన్ని వెచ్చిస్తున్నారు. చాలా గ్రామాల్లో ఆవుల జాడే లేదని, వయసులో ఉన్న వారు పొట్టచేతపట్టుకొని పట్నాలకు వలస పోగా వృద్ధులే గ్రామాల్లో మిగిలారన్నారు. ఈ పరిస్థితిని సమూలంగా మార్చే శక్తి ప్రకృతి సేద్యానికే ఉందని ఆమె విశ్వసిస్తున్నారు. వ్యవసాయ సంక్షోభానికి ప్రకృతి సేద్యమే పరిష్కారమా? అవును. యూరప్‌కు రెండు, మూడు వేల ఏళ్లు, అమెరికాకు రెండొందల ఏళ్లకు క్రితమే వ్యవసాయం తెలుసు. మనది పది వేల ఏళ్ల నాటి సుసంపన్నమైన వ్యవసాయ సంస్కృతి. మన దేశప్రజల డీఎన్ఏలోనే వ్యవసాయ సంస్కృతి ఉంది. హరిత విప్లవం పేరిట రసాయనిక వ్యవసాయం అలవాటు చేయడం వల్ల ఈ సంస్కృతి ధ్వంసమైంది. 30 శాతం సాగు భూమి నిస్సారమైపోవడమో, చౌడుదేలడమో అయ్యింది. ఇప్పుడు తిరిగి ప్రకృతి వ్యవసాయ సంస్కృతిని అలవరచుకోవడమే సంక్షోభానికి పరిష్కారం. {పకృతి సేద్యంపై శిక్షణ ఇచ్చే క్రమంలో అవరోధాలను ఎలా అధిగమిస్తున్నారు? మనిషి మారితేనే వ్యవసాయ పద్ధతి మారుతుంది. అలవాటు లేని ప్రకృతి సేద్య పద్ధతి గురించి తెలియజెప్పడానికి ముందు జీవన కళ గురించి పరిచయం చేస్తున్నాం. టన్నుల కొద్దీ పశువుల ఎరువు అవసరం లేని, దుక్కి అవసరంలేని, స్వల్ప ఖర్చుతో చేసుకునే పాలేకర్ పద్ధతిని తెలియజెపుతున్నాం. ఒక ఆవు ద్వారా 10-15 ఎకరాల్లో వ్యవసాయానికి కావాల్సిన ఎరువులు, పురుగుమందులు, శిలీంధ్రనాశనులు తయారు చేసుకునే పద్ధతులు నేర్పిస్తున్నాం. ఆవును కొని ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు.. ఆరు నెలల్లో ఆవు ఖరీదు తిరిగొచ్చేస్తోంది. రైతుల ఆర్థిక, పర్యావరణ, సాంఘిక సమస్యల పరిష్కారానికి బాటలు వేస్తున్నాం. ప్రభుత్వ సంస్థలు నిర్వహించే శిక్షణకు స్పందించని రైతులు సైతం మా శిక్షణకు స్పందిస్తున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఉన్నతాధికారులకు, సిబ్బందికి కూడా శిక్షణ ఇస్తున్నాం. శిక్షణ పొందిన రైతులకు ఎటువంటి తోడ్పాటునందిస్తారు? ఒకసారి శిక్షణ పొందిన రైతు.. ఆర్ట్ ఆఫ్ లివింగ్ బృందంలో జీవిత సభ్యుడవుతాడు. ప్రకృతి వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలు, సందేహాల నివృత్తి కోసం ఉచిత కాల్‌సెంటర్‌ను రెండు నెలల్లో ఏర్పాటు చేస్తున్నాం. 24 మంది శాస్త్రవేత్తల బృందం నిరంతరం అన్ని భాషల్లోనూ రైతులకు సూచనలు సలహాలు ఇస్తారు. కరువు బారిన పడకుండా వ్యవసాయం చేసే మెలకువలతో కూడిన ‘ప్రకృతి వ్యవసాయ పంచాగం’ సిద్ధమవుతోంది. మారిన వాతావరణాన్ని బట్టి వ్యవసాయ పనులు 1 లేదా 2 కార్తెలు ముందుకు జరగాలన్నది మా అభిప్రాయం. వర్షాల తీరు మారింది. స్థానికంగా చెట్లు, అడవి ఎక్కువగా ఉన్న చోటే కురుస్తున్నాయి. శాస్త్రబద్ధమైన ఈ విషయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించడం ద్వారా.. వారిలో చెట్ల పెంపకం, చెట్ల జాతులతో కలిపి వార్షిక పంటలు పండించడంపై ఆసక్తిని పెంచుతున్నాం. భూసారం పెంపుదల, చౌడు భూమిని తిరిగి వినియోగంలోకి తెచ్చుకోవడం ప్రకృతి సేద్య పద్ధతుల ద్వారానే సాధ్యం.. వీటన్నిటినీ నిరంతరం సమన్వయం చేయడానికి శ్రీశ్రీ కిసాన్ సంఘాలను, జిల్లా, రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నాం. రైతులందరికీ ప్రకృతి వ్యవసాయ శిక్షణ అందేదెలా? మా సంస్థకు విస్తృతమైన యంత్రాంగం, ప్రణాళికాబద్ధంగా వ్యవహరించే నైపుణ్యం, దాతల మద్దతు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల రైతులందరికీ రెండేళ్లలో శిక్షణ ఇచ్చేదిశగా కదులుతున్నాం. జూన్ నుంచి వారానికో శిబిరం నిర్వహిస్తున్నాం. రాబోయే 6 నెలల్లో వెయ్యి మంది ప్రకృతి సేద్యం నేర్పించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. ఇప్పటికే ఎందరో రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ అనుభవం గడించారు. వీరి అనుభవాలు చెప్పించి రైతుల్లో పూర్తి భరోసా కలిగిస్తున్నాం. ప్రతి గ్రామంలో కొందరికి సరిగ్గా నేర్పితే చాలు.. వాళ్లను చూసి మిగతా వాళ్లు నేర్చుకుంటారు. విరాళాలు, ప్రభుత్వ తోడ్పాటుతో రైతులందరికీ రెండేళ్లలో శిక్షణ ఇస్తాం. ఏదేమైనా ఐదేళ్లలో 100% విష రసాయనాల అవశేషాల్లేని ఆహారోత్పత్తి జరిగేలా చూడాలన్నది మా లక్ష్యం. సహజాహారంపై చైతన్యం వినియోగదారుల్లోనూ పెరుగుతోంది. {పకృతి వ్యవసాయదారుల మార్కెటింగ్ సమస్యలపై మీ అభిప్రాయం? వేల సంఖ్యలో రైతులు ఇప్పటికే ప్రకృతి సేద్యం చేస్తున్నారు. వారికి ఖర్చు తగ్గింది. ఆదాయం పెరిగింది. సరుకును మార్కెట్‌కు తీసుకెళ్లాల్సిన బాధే లేదు. మంచి ఆహారం కావాల్సిన వాళ్లు రైతుల ఇళ్లకొచ్చి కొనుక్కెళ్తున్నారు. రైతుల భాగస్వామ్యంతో విశ్వసనీయమైన మార్కెటింగ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం. రైతులకు నిరంతరం అండగా ఉండి నడిపించేందుకు ఏ లోటూ లేకుండా చూస్తున్నాం. - సంభాషణ : పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
నేనే పెద్దరౌడీనంటూ వీసీ వీరంగం
అనంతపురం: ఎస్కే యూనివర్సిటీ వైస్ చాన్సలర్ రామకృష్ణారెడ్డి విద్యార్థి సంఘం నాయకులపై చిందులు తొక్కారు. తానే పెద్ద రౌడీనని, రోడ్డుపైకి వస్తే తేల్చుకుందామంటూ వీరంగం సృష్టించారు. ఎస్కే యూనివర్సిటీలో అధికార టీడీపీ మద్దతుదారులకు ఉద్యోగాలు ఇవ్వడంపై వైఎస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. విద్యార్థి విభాగం నాయకుడు లింగారెడ్డి తదితరులు వీసీని కలసి ఈ విషయం గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా వీసీ రామకృష్ణారెడ్డి, విద్యార్థి సంఘం నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. వీసీ రెచ్చిపోయి తానే పెద్ద రౌడీనంటూ, లింగారెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఆయన చొక్కా పట్టుకుని లాగేందుకు ప్రయత్నించారు. -
అవకాశాలకు వేదిక
కొత్తదనం కోరుకునే కంపెనీలే కాదు... సరికొత్త ఆలోచనలను అందించే యువత ఈ సిటీలో ఉన్నారు. వాళ్లను గుర్తించి ప్రోత్సహిస్తే మౌలిక వసతుల రంగంలో వినూత్న ఒరవడి సృష్టించవచ్చు. ఇలాంటి వేదికే ఆగస్ట్ ఫెస్ట్. దీని ద్వారానే తన నెట్‌వర్క్‌ను పెంచుకోవడం సాధ్యమైందని చెబుతున్నారు ‘స్పూర్స్’ అధినేత రామకృష్ణారెడ్డి. అదెలాగో ఆయన మాటల్లోనే విందాం. దాదాపు 15 ఏళ్లు మైక్రోసాఫ్ట్, ఇంటెల్ కంపెనీల్లో పనిచేశా. యాంత్రిక జీవనం కిక్ ఇవ్వలేదు. ఓ గుర్తింపు కావాలనుకుని ఆలోచనల్లో పడ్డా. ఉద్యోగానికి రాజీనామా చేసి, హైదరాబాద్‌కు వచ్చా. ఓ రోజు ఇంట్లో పనికోసం ప్లంబర్‌ను పిలిచా. ఎప్పుడు కాల్చేసినా ‘ఇదిగో వస్తున్నా... ఇక్కడే ఉన్నా‘ అంటున్నాడే తప్ప రాలేదు. అతను అబద్ధం ఆడుతున్నాడని తెలిసిపోయింది. అక్కడి నుంచే నా ఆలోచన మొదలైంది. బిజీగా ఉండే సిటీలో ఇలా ఒకరి కోసం సమయం వృథా చేసుకోవడం ఏమిటి? చాలా కంపెనీల్లో ఫీల్డ్ వర్క్ చేసే వాళ్లూ ఇలాగే చేస్తే..! కస్టమర్లు ఎలా ఫీలవుతారు? దీనికి పరిష్కారం కనుక్కోవడమే లక్ష్యంగా పెట్టుకున్నా. మొబైల్ యాప్ ఓ మిత్రుడిని భాగస్వామిగా చేసుకుని ఆలోచనలను కార్యరూపంలోకి తెచ్చా. నాలుగేళ్ల క్రితం మొబైల్ యాప్ రూపొందించా. స్పూర్స్ పేరుతో మార్కెట్లోకి వెళ్లా. నిజానికి ఇలాంటి సాఫ్ట్వేర్ ఇప్పటి వరకూ మార్కెట్లో ఎక్కడా లేదు. కేవలం మొబైల్ ఫోన్ ద్వారానే ఫీల్డ్ వర్క్ మొత్తం సంస్థ యజమాని తెలుసుకోవచ్చు. ఫీల్డ్ వర్క్‌కు వెళ్లినవారు వుళ్లీ ఆఫీసుకు రాకుండానే మొత్తం తన పని అంతా రిపోర్టు చేసే సదుపాయంఇందులో ఉంటుంది. ఫెస్ట్‌తో ప్రోత్సాహం కష్టపడి ఓ కొత్త సాఫ్ట్వేర్ తయారు చేసినా, దాన్ని మార్కెట్ ఎలా చేసుకోవాలో... ఎవరిని కలవాలో తెలియలేదు. ఈ సమయంలో గత ఏడాది ఆగస్టు ఫెస్ట్ నిర్వహించారు. దాంట్లో నా ప్రొడక్ట్‌ను పారిశ్రామికవేత్తలకు పరిచయం చేశా. చాలామంది ఇంప్రెస్ అయ్యారు. ఇప్పుడు హైదరాబాద్‌లో మెడ్‌ప్లస్ సహా 30 కంపెనీలు నా సాఫ్ట్వేర్ వాడుతున్నాయి. ఈసారి కూడా ఆగస్ట్ ఫెస్ట్‌లో పాల్గొంటున్నా. ఇప్పటికి నా బిజినెస్ కేవలం 3 శాతమే పెరిగింది. ఇంకా 97 శాతం మార్కెటింగ్ అవకాశాలున్నాయి. నా మార్కెట్ సర్వే ప్రకారం హైదరాబాద్‌లో దాదాపు 200 కంపెనీలు ఫీల్డ్ వర్క్‌లో పారదర్శకత, వురింత నాణ్యమైన సేవలు కోరుకుంటున్నాయి. ఇందుకు నా సాఫ్ట్వేర్ బాగా ఉపయోగపడుతుంది. -
అప్పటినుంచి కాలేజీలది దాటవేత ధోరణే
ఇంజనీరింగ్ కాలేజీలు 2012 నుంచి దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ కాలేజిల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు, సౌకర్యాలు కూడా లేవని ఆయన చెప్పారు. ఏమాత్రం అర్హత లేనివారిని అధ్యాపకులుగా నియమించుకుంటున్నాయని, వాస్తవానికి అక్కడ ప్రిన్సిపల్‌గా పీహెచ్డీ, లెక్చరర్లుగా పీజీ పూర్తి చేసిన వారినే నియమించాలని ఆయన తెలిపారు. కాలేజీలు ఇచ్చిన అండర్ టేకింగ్ పత్రాలకే విలువ లేకుండా పోయిందని ఏజీ రామకృష్ణారెడ్డి విమర్శించారు. నాణ్యమైన విద్య లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన చెప్పారు. -
ఏ ఒక్క రాష్ట్రానికో అధికారమిచ్చినట్లుకాదు!
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇంజనీరింగ్ అడ్మిషన్లు విభజన చట్టానికి లోబడే ఉండాలన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వివరణ ఇచ్చారు.చట్ట ప్రకారం ఎంసెట్ కౌన్సిలింగ్ నిర్వహించాలని మాత్రమే సుప్రీంకోర్టు పేర్కొందని ఆయన తెలిపారు. దీంతో ఏ ఒక్క రాష్ట్రానికో అధికారం ఇచ్చినట్లు కాదన్నారు. ఇరు రాష్ట్రాలు సమన్వయంతో కౌన్సిలింగ్ నిర్వహించాలని రామకృష్ణా రెడ్డి సూచించారు. కామన్ అడ్మిషన్లను ఏపీ ఉన్నత విద్యామండలి నిర్వహించాలనడం సరైనది పద్దతి కాదన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎవరికి ఇవ్వాలన్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలదే నిర్ణయంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. తమ రాష్ట్రాల ఆర్ధిక పరిస్థితి విధానాలకు అనుగుణంగా ఫీజు రీయింబర్స్ మెంట్ అమలు చేస్తారని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ విషయంలో ధర్మాసనం జోక్యం ఉండదన్నారు. ఆగస్టు 31 లోగా కౌన్సెలింగ్ పూర్తికావాలని, సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని గత తీర్పులో సుప్రీం పేర్కొన్న సంగతి తెలిసిందే. ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో మాత్రం తాము జోక్యం చేసుకోబోమని చెప్పింది. అక్టోబరు 31 వరకూ కౌన్సెలింగ్ పొడిగించాలన్న తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అలాగే స్థానికత అంశాన్ని కూడా పక్కనపెట్టింది. -
న్యాయం చేయండి
సాక్షి, గుంటూరు: ‘మేం పైసా పైసా కూడబెట్టుకోని స్థలం కొనుకున్నాం. అప్పు, సప్పు చేసి లోన్లు పెట్టుకొని, కష్టార్జితంతో ఇల్లు కట్టుకొన్నాం. 30,40 ఏళ్లుగా నివాసం ఉంటున్నాం. ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి ఇళ్లు ఖాళీ చేయాలని దౌర్జ్యనం చేస్తున్నారు. ఆడవాళ్లను కూడా దారుణంగా బెదిరిస్తున్నారు’ అని మంగళగిరి నియోజకవర్గం యర్రబాలెం అంబటినగర్ కాలనీ వాస్తవ్యులు వాపోయారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో వారంతా బుధవారం కలెక్టర్ కాంతిలాల్ దండేను కలిసి సమస్యను వివరించారు. భూమికి సంబంధించిన రికార్డులను కలెక్టర్‌కు చూపించారు.1967లొనే ఫ్లాట్లకు పంచాయతీ నుంచి అనుమతి పొందామని వివరించారు. ఇప్పుడు సింగ్‌నగర్ నుంచి రౌడీలు వచ్చి స్థలాలు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఇంటి గేట్లు తోసుకొని లోపలికి వచ్చేస్తున్నారని, సింగ్‌నగర్ వచ్చి మాట్లాడాలని వేధిస్తున్నారని కన్నీటి పర్యంతమయ్యారు. పోలీసుల ద్వారా రక్షణ కల్పించాలని వేడుకున్నారు. రికార్డులు పరిశీలించి న్యాయం చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బాధితులకు అండగా నిలిచిన ఆర్కే.. అంబటినగర్కాలనీవాసులకు స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అండగా నిలిచారు. కాలనీవాసులు 20వ తేదీన విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. నకిలీ ధృవపత్రాలు సృష్టించి, సబ్‌రిజిస్టార్‌పై ఒత్తిడి తెచ్చి రెండెకరాల స్థలాన్ని రిజిస్టర్ చేయించుకున్నారని వివరించడంతో స్పందించిన ఎమ్మెల్యే వెంటనే మంగళగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి ఆరా తీశారు. బాధితులకు తగిన రక్షణ కల్పించాలని స్థానిక డీఎస్పీకి విజ్ఞప్తి చేశారు. బుధవారం బాధితులతో కలిసి కలెక్టర్‌కు ఆయన సమస్యను వివరించారు. కలెక్టర్ వెంటనే జిల్లా రిజిస్ట్రార్‌కు ఫోన్‌చేసి భూమి రికార్డులు తీసుకురావాలని సూచించారు. బాధితుల తరఫున న్యాయం ఉందని తేలితే ఆ ప్రాంతంలో తాత్కాలికంగా రిజిస్ట్రేషన్లు కూడా నిలుపుదల చేస్తామని హామీఇచ్చారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆర్కే విలేకర్లతో మాట్లాడుతూ కాలనీలో మధ్యతరగతి ప్రజలు, విశ్రాంత ఉద్యోగులు 50 ఏళ్లుగా ఇల్లు కట్టుకొని నివాసం ఉంటున్నారని చెప్పారు. ఇప్పుడు విజయవాడ నుంచి కొంతమంది వచ్చి దౌర్జన్యంగా ఇళ్లు ఖాళీ చేయమంటున్నారన్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకూ అండగా ఉండి పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి బాధితులకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.పాతగుంటూరు : కాలనీలోని 783ఎ, బి, సి సర్వేనంబర్లలో మొత్తం 11. 20 ఎకరాలు భూమి ఉంది. అందులో విశాంత ఉద్యోగులు స్థలాలను కొనుగోలు చేసుకుని ఇళ్లు నిర్మించుకొని 150 కుటుంబాలు జీవిస్తున్నాయి. వారం రోజుల క్రితం కొందరు వ్యక్తులు వచ్చి ఇది ఓ జడ్జికి చెందిన భూమి అని బెదిరింపులకు దిగారు. అప్పటి నుంచి రోజు రోజుకు బెదిరింపులు పెరుగుతున్నాయి. ఆ వివరాలుబాధితుల మాటల్లోనే... రాజధాని ప్రచారంతోనే.. రాజధాని అని ప్రచారం జరగటంతో ఈ ప్రాంతాల్లో భూదందాలు జరుగుతున్నాయి. 20 సంవత్సరాలుగా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నాం. నంబర్ ప్లేట్లు లేని కారుల్లో కొందరు రౌడీలు వచ్చి భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్కూడా భూమి మేడందంటూ బెదిరిస్తున్నారు. మాకు న్యాయం చేయాలి. - తాడేపల్లి లలిత ఎలా బతకాలి.. 50 సంవత్సరాల క్రితం చాలీచాలని జీతాలతో తినితినక స్థలాలు కొనుగోలు చేసి గృహాలు నిర్మించుకున్నాం.ఇప్పుడు ఖాళీచేయాలని బెదిరించటంతో ఎలా బతకాలో అర్థంకావటంలేదు. నా భర్త వికలాంగుడు. వికలాంగ పింఛన్‌తో జీవిస్తున్నాం. న్యాయం చేయాలి. - జానపాటి ఆదిలక్ష్మి పూర్తి పత్రాలు ఉన్నాయి న్యాయాన్ని కాపాడాల్సిన జడ్జి ఇటువంటి అక్రమాలకు పాల్పడుతుంటే మాలాంటి వారు ఎలా జీవించాలో అర్థంకావటంలేదు. పూర్తి పత్రాలు మా దగ్గర ఉన్నాయి. అయినా మళ్లీ ఏవిధంగా రిజిస్టర్ చేస్తారు. దీనిపై విచారణ చేసి అధికారులు న్యాయం చేయయాలి. - తమ్మ తార -
‘అనంత’లో అరేబియన్ పంట
ప్రయోగాత్మకంగా ఖర్జూరం సాగు ఖర్జూరం పండులో క్యాల్షియం, సల్ఫర్, ఇనుము, పొటాషియం, ఫాస్పరస్, మాంగనీస్, రాగి, మెగ్నీషియం పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. చెడు కొలెస్ట్రాల్‌ను నివారించే శక్తి ఈ పండుకు ఎక్కువ. ఖర్జూరం శాస్త్రీయ నామం ఫీనిక్స్డాక్టిలిఫెరా. తాటిచెట్టు మాదిరిగా పెరిగే ఈ చెట్లు ఆడ, మగ వేరువేరుగా ఉంటాయి. రాయదుర్గం : అరబ్ దేశాల్లో పండించే ఖర్జూరం పంట ఇప్పుడు మన ప్రాంతానికీ విస్తరించింది. కరువు పీడిత ప్రాంతంగా పేరొందిన ‘అనంత’ నేలలో పండించేందుకు రైతులు ఉత్సాహం చూపుతున్నారు. రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం బెణకల్లుకు చెందిన రామక్రిష్ణారెడ్డి తన స్నేహితుడి సలహా మేరకు ఆరేళ్ల క్రితం 15 ఎకరాల విస్తీర్ణంలోని నల్లరేగడిలో దాదాపు 1500 మొక్కలు నాటాడు. రెండు వ్యవసాయబోర్ల ద్వారా మొక్కలకు బిందు సేద్యం ద్వారా నీటిని అందిస్తున్నాడు. మొదట్లో ఇరుగుపొరుగు రైతులు ఎగతాళి చేసినా పట్టించుకోకుండా కంటికి రెప్పలా ఖర్జూరం మొక్కలను కాపాడుకుంటూ వచ్చాడు. పశువుల ఎరువును ఎక్కువశాతం వాడుతూ, అడపాదడపా క్రిమిసంహారక మందు కూడా తక్కువ మోతాదులో ఉపయోగిస్తున్నాడు. మొక్కకూ.. మొక్కకూ 20 అడుగుల దూరం పాటించాడు. కట్టెల నుంచి కాల్చిన బొగ్గును కూడా ఎరువుగా ఉపయోగిస్తున్నాడు. ప్రస్తుతం వంద ఖర్జూరం చెట్లు కాపుకొచ్చాయి. ఆరు నెలల క్రితం అంతర్ పంటగా 1500 దానిమ్మ మొక్కలు నాటాడు. ఫలదీకరణ ప్రక్రియ :ఖర్జూరం పంట మొగ్గదశలో మగచెట్ల పరాగరేణువులను తీసుకుని, ఆడ ఖర్జూర చెట్లకు సంబంధించిన పండ్ల గుత్తిలో పెట్టి వల ఏర్పాటు చేస్తారు. 50 ఆడ చె ట్లను ఫలవంతం చేయడానికి ఒక మగచెట్టు పరాగరేణువులు ఉపయోగపడుతాయి. ఈ పంట 5 నుంచి 8 సంవత్సరాలకు కాపుకొస్తుంది. -
తెలంగాణ అడ్వకేట్ జనరల్‌గా రామకృష్ణారెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా రామకృష్ణారెడ్డిని నియమించారు. శనివారం సాయంత్రం తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అదనపు అడ్వకేట్ జనరల్‌గా రామచంద్రారావు పేరును పరిశీలిస్తున్నట్టు సమాచారం. -
టీడీపీ దౌర్జన్య కాండ...
సాక్షి, గుంటూరు: జిల్లాలో టీడీపీ దౌర్జన్య కాండకు అంతూపొంతూ లేకుండా పోతోంది. ఈ నెల 7వ తేదీన జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గెలుపుఖాయమని గ్రహించిన టీడీపీ నేతలు గ్రామాల్లో భయందోళనలు సృష్టించడం ద్వారా గెలవాలనే కుట్రలు పన్నుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రచారాల్లో పాల్గొంటే ఒప్పుకునేది లేదంటూ బడుగు, బలహీన వర్గాల ప్రజలపై బెదిరింపులకు దిగుతున్నారు. ఎస్సీ కాలనీల్లో ఉన్న పోలింగ్ కేంద్రాలలో వైఎస్సార్సీపీ తరఫున ఏజెంట్లుగా కూర్చుంటే సాంఘిక బహిష్కరణ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారు. చివరకు గ్రామాల్లోకి ప్రచారాలకు సైతం రావద్దంటూ వైఎస్సార్సీపీ అభ్యర్థుల కాన్వాయ్‌లపై రాళ్ళ దాడులకు దిగుతున్నారు. కొన్నిచోట్లయితే ఓట్లు వేయడానికి వస్తే ఇబ్బందు లు పడతారంటూ టీడీపీ నాయకులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇలా జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో టీడీపీ నాయకులు ఓటమి భయంతో గ్రామాల్లో అల్లర్లు సృష్టించడం, ఓటర్లను భయబ్రాంతులకు గురిచేయడం వంటి కుయుక్తులకు తెరలేపుతున్నారు. జిల్లాలో పలుచోట్ల టీడీపీ దౌర్జన్య కాండలకు కొన్ని ఉదాహరణలు... మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి మండలం గంగలకుంట గ్రామంలో ఆదివారం ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కాన్వాయ్‌పై దాడికి దిగారు. అడ్డుకోబోయిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్ళురువ్వి తీవ్రంగా గాయపరిచారు. ఇటీవల సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో ప్రచారానికి వెళ్ళిన అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు రాళ్ళతో దాడికి దిగిన విషయం తెలిసిందే. అదేవిధంగా లక్కరాజుగార్లపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడిచేయడంతో తలకు తీవ్రగాయమైంది. రేపల్లె నియోజకవర్గం నగరం మండలం కోరంకివారిపాలెం గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్లుగా ఉన్నందుకు ఎస్సీ వర్గీయులపై సోమవారం దాడులుచేసి, సాంఘిక బహిష్కరణ చేస్తామంటూ హెచ్చరికలు జారీచేశారు. నరసరావుపేట మండలం కేసానుపల్లిలో వైఎ స్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు సోమవారం దాడులకు దిగడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం మున్నంగి గ్రామంలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడైన మాజీసర్పంచ్పై టీడీపీ నాయకులు దాడిచేసి తీవ్రంగా గాయపరిచారు. పొన్నూరు రూరల్ మండలం చింతలపూడిలో ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్సీపీ అభ్యర్థి రావి వెంకటరమణ సతీమణి కల్పనాకిరణ్ను అడ్డుకుని భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై ఆమె అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
హలో...చంద్రబాబోయ్
అనపర్తి, న్యూస్‌లైన్ : అనపర్తి నియోజకవర్గ టీడీపీ టికెట్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి నల్లమిల్లి రామకృష్ణారెడ్డికే కేటాయించాలని ఆయన వర్గీయులు, బిక్కవోలు మాజీ జెడ్పీటీసీ పడాల వెంకట రామారెడ్డి భార్య సునీతకు ఇవ్వాలని మరోవర్గం కోరుతున్నాయి. సీటు సాధించేందుకు ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. బాబు తమ నాయకుడికే టికెట్ ఇచ్చారంటూ రామకృష్ణారెడ్డి వర్గీయులు. కాదు బీ-ఫారం సునీతకే వస్తుందని వెంకట రామారెడ్డి వర్గీయులు ప్రచారం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు చేస్తున్న ఆన్లైన్ సర్వేలో భాగంగా అభ్యర్థి పేరును సూచించాలంటూ ఫోన్లు వస్తుండడంపై జనం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అనపర్తిలో బుధవారం రాత్రి ఒక వ్యక్తికి ఫోన్ వచ్చింది. మొబైల్ స్క్రీన్‌పై ఏ పేరూ డిస్ప్లే కాకపోవడంతో ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ ఆ ఫోన్ రిసీవ్ చేసుకున్నారు. అవతలి వైపు నుంచి టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు గారి గొంతు. ముందుగా నమస్కారం అన్నారు.. మీ అభ్యర్థిని మీరే నిర్ణయించుకోండి అని చెప్పారు. అరే..మా అభ్యర్థిని మేమే నిర్ణయించే అవకాశం కల్పించారా అని ఆ వ్యక్తి తనలో తానే నవ్వుకున్నారు. అవతలి నుంచి బాబు గారు మాట్లాడుతూ మీకు నచ్చిన అభ్యర్థి ఎన్. రామకృష్ణారెడ్డి అయితే 1, పడాల సునీత అయితే 2 నొక్కాలని పదే పదే అడుగుతుండడంతో ఏం చేయాలో ఆయనకు పాలుపోలేదు. 14001281999 నెంబర్ నుంచి వచ్చిన ఈ ఫోన్‌ను అసలు తానెందుకు ఎత్తానురా‘బాబూ’ అంటూ..అనపర్తి అభ్యర్థిని నేను నిర్ణయించడం ఏమిటని తల పట్టుకున్నాడాయన. నియోజక వర్గంలో ఈ విధమైన ఫోన్లు చాలామందికి వస్తున్నాయి. ఇప్పటికే రింగ్ టోన్లు, నెట్వర్క్ ప్లాన్ల గురించి చెప్పడానికి వివిధ టెలికాం సంస్థలు చేస్తున్న ఫోన్లతో సతమతమవుతుంటే.. ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు గారు ఫోన్ కాలేమిటి? అని నియోజకవర్గ ప్రజలు నవ్వుతున్నారు. అభ్యర్థులకు టికెట్ ఇచ్చే వ్యవహారంలో పార్టీ అధినేతగా నిర్ణయించుకోలేని స్థితిలో ఉంటే, ప్రజల సూచనలు మాత్రం ఏ మేర అమలు చేస్తారని అందరూ చర్చించుకుంటున్నారు. -
మర్డర్ మిస్టరీ
మర్డర్ మిస్టరీ మూవీస్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. ఈ తరహా చిత్రాలను సరైన రీతిలో తెరకెక్కిస్తే మాత్రం ప్రేక్షకాదరణ గ్యారంటీ అని గత చరిత్ర చెబుతోంది. ‘‘మా సినిమా కచ్చితంగా విజయాన్నే అందుకుంటుంది’’ అంటున్నారు బి. రామకృష్ణారెడ్డి. తమిళంలో పిజ్జా, విల్లా వంటి సూపర్ హిట్స్ నిర్మించిన సీవీ కుమార్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘తేగిడి’. ఈ చిత్రం అనువాద హక్కులను శ్రేయాస్ మీడియాతో కలిసి పుష్యమి ఫిలిం మేకర్స్ అధినేత రామకృష్ణారెడ్డి పొందారు. తెలుగు సినిమాకి టైటిల్ ఖరారు చేయలేదు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘ఆసక్తికరమైన కథతో సాగే మర్డర్ మిస్టరీ ఇది. ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇప్పటికే తమిళ వెర్షన్ నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ నెల రెండోవారంలో పాటలను, నెలాఖరున సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: నివాస్ ప్రసన్న, సహనిర్మాత: వెంకటరమణ, సమర్పణ: బి.సుధారెడ్డి, నిర్మాతలు: బి. రామకృష్ణారెడ్డి, గుడ్ ఫ్రెండ్స్. -
‘కొలకలూరి’కి పద్మశ్రీపై హర్షం
అనంతపురం సిటీ, న్యూస్‌లైన్ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో 33 ఏళ్ల పాటు విశిష్ట సేవలు అందించిన కొలకలూరి ఇనాక్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించడంపై వర్సిటీ వీసీ రామకృష్ణా రెడ్డి, అధ్యాపకులు , సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఇనాక్.. ఎస్కేయూ కళాశాలలో 31 ఏళ్ల పాటు తెలుగు అధ్యాపకుడిగా, రెండేళ్లపాటు ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వర్తించారు. ఎస్కేయూ ఖ్యాతిని ఇనుముడింప చేయడానికి కృషి చేశారు. తెలుగు భాషాభివృద్ధికి ఎంతో కృషి చేశారు. -
అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్
మాచారెడ్డి, న్యూస్‌లైన్: ప్రజా సమస్యలను పక్కనబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జల రామక్రిష్ణారెడ్డి ఆరోపించారు. బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజాసమస్యల పాదయాత్ర కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన మాచారెడ్డి చౌరస్తాలో మాట్లాడారు. ముందుగా మాచారెడ్డి చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ వారసత్వ పాలనతో కొనసాగుతున్న కాంగ్రెస్ అవినీతి, అక్రమాలు, కుంభకోణాలలో ముందంజలో ఉందన్నారు. ప్రజా సమస్యలను ఏమాత్రం పట్టిం చుకోవడం లేదన్నారు. విద్యుత్ సమస్య రోజురోజుకు జఠిలమవుతోందన్నారు. ఏడు గంటల పాటు విద్యుత్తును అందిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 3 నుంచి 4 గంటలైనా అందించడం లేదన్నారు. విద్యుత్తు ఎప్పుడు వ స్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితిలో రైతాంగం కొట్టుమిట్టాడుతోందన్నారు. గుజరాత్లో నరేంద్రమోడీ ప్రభుత్వం 24 గంటలు విద్యుత్తును అందిస్తోందన్నారు. రైతులు తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక అల్లాడుతున్నారన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కరువై గల్ఫ్‌బాట పడుతున్నారన్నారు. అక్కడ ఉపాధి కరువై స్వదేశానికి తిరిగి వచ్చి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. ఉపాధి కరువై ఒక వైపు యువత పెడదోవ పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. గల్ఫ్ బాధితులకు జాబ్ మేళా పేరుతో హల్చల్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎలాంటి భరోసానివ్వడం లేదన్నారు. సుస్థిర పాలన కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. యువత బీజేపీవైపు మొగ్గుచూపుతున్నారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తాళ్ళపల్లి విఠల్‌గుప్తా, ఆదిలాబాద్ ఇన్చార్జి ఉప్పునూతుల మురళీధర్‌గౌడ్, దళిత మోర్చ రాష్ట్ర నాయకులు కొత్తపల్లి మల్లయ్య తదితరులు ఉన్నారు. -
ఆలిండియా హాకీ చాంపియన్ బెంగళూరు
అనంతపురం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ హాకీ చాంపియన్‌గా బెంగళూరు యూనివర్సిటీ జట్టు నిలిచింది. అగ్రశ్రేణి జట్లను సైతం మట్టికరిపించి ఊహించని విధంగా ట్రోఫీ కైవసం చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ పోటీల్లో ట్రోఫీని గెలవడం విశేషం. అనంత క్రీడా గ్రామంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు, పూర్వాంచల్ జట్లు పోటీపడ్డాయి. బెంగళూరు 3-1 గోల్స్ తేడాతో పూర్వాంచల్‌పై విజయం సాధించింది. జట్టులో ఉమేష్, కుషా, బసవరాజ్ చెరో ఒక గోల్, పూర్వాంచల్ తరపున లలిత్ ఉపాధ్యాయ ఒక గోల్ చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో గెలవగానే బెంగళూరు జట్టు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. క్రీడాకారులు మైదానంలో కేరింతలు, అరుపులతో హోరెత్తించారు. స్టేడియం అంతా కలియతిరిగారు. మూడో స్థానంలో సంబ ల్పూర్ : మూడో స్థానం కోసం కాశీవిద్యాపీఠ్తో జరిగిన మ్యాచ్‌లో పుట్టైంలో ఇరు జట్లు 1-1 గోల్స్ చేశాయి. అంపైర్లు పెనాల్టీ షూటౌట్‌కు ఆహ్వానించారు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సంబ ల్పూర్ 7-6 స్కోర్ తేడాతో కాశీవిద్యాపీఠ్ను ఓడించి మూడోస్థానాన్ని నిలబెట్టుకుంది. హాకీకి పూర్వవైభవం తేవాలి : డీజీపీ జాతీయ క్రీడ హాకీకి పూర్వ వైభవం తీసుకురావాలని డీజీపీ బి.ప్రసాదరావు కోరారు. శనివారం అనంత క్రీడా గ్రామంలో జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విన్నర్స బెంగళూరు, రన్నర్స పూర్వాంచల్ జట్టును అభినందించి.. బహుమతులందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాదర్ విన్సెంట్ ఫై్ ఆర్డీటీని స్థాపించి అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఆయన మరణానంతరం మాంఛోఫై్ సేవాకార్యక్రమాలను కొనసాగించడంతోపాటు క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. జాతీయ స్థాయి మ్యాచ్‌లు ‘అనంత’లో జరగడం హర్షించదగ్గ విషయమన్నారు. ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు వారాలుగా ‘అనంత’లో సౌత్‌జోన్, అఖిల భారత విశ్వవిద్యాలయాల పోటీలు నిర్వహించామన్నారు. ఆర్డీటీ సహకారం మరువలేనిదన్నారు. ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛోఫై మాట్లాడుతూ జీవితంలో క్రీడలు అంతర్భాగం కావాలన్నారు. మంచి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. టోర్నీ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఎస్కేయూ స్పోర్ట్స్ డెరైక్టర్ జెస్సీకి డీజీపీ బ్లేజర్ తొడిగారు. కార్యక్రమంలో టోర్నీ డెరైక్టర్లు చిన్నపరెడ్డి, కెల్విన్ డీ క్రూజ్, హాకీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డాక్టర్ విజయబాబు, ఎన్ఐటీ వరంగల్ ఫ్రొఫెసర్ రవికుమార్, ఆర్డీటీ స్పోర్ట్స్ డెరైక్టర్ జేవియర్ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ బోర్డు ఆస్తులపై విచారణ చేస్తాం
తాడిపత్రి, న్యూస్‌లైన్: స్థానిక వక్ఫ్‌బోర్డు ఆస్తుల్లో జరిగిన అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ రెండు రోజులుగా వైఎస్సార్సీపీ మైనార్టీ నాయకుడు మున్నా చేస్తున్న నిరాహార దీక్షను శుక్రవారం విరమించారు. తహశీల్దార్ రామకృష్ణారెడ్డి శిబిరం వద్దకు చేరుకుని ఆయనతో మాట్లాడారు. జరిగిన అక్రమాలపై కలెక్టర్, ఆర్డీవోలకు నివేదిక పంపుతామన్నారు. పూర్తి విచారణ చేపడతామని హామీ ఇస్తూ మున్నాకు నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపు చేశారు. అంతకు ముందు మున్నా మాట్లాడుతూ వక్ఫ్ ఆస్తుల్లో రూ.కోట్ల అవినీతి జరిగిందన్నారు. ఆధారాలతోసహా జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామన్నారు. అధికారులు విచారణకు ఆదేశించినా అమలుకాలేదన్నారు. కమిటీ సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షుడు కొర్రపాడు హుసేన్‌పీరా, తాడిపత్రి నియోజర వర్గ సమన్వయకర్త వి.ఆర్.రామిరెడ్డి, సీఈసీ సభ్యుడు పైలానరసింహయ్య, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పేరంనాగిరెడ్డి, తదితర నాయకులు మున్నాను పరామర్శించిన వారిలో ఉన్నారు. శిబిరంలో వైఎస్సార్సీపీ కార్మిక విభాగం ఉపాధ్యక్షుడు వెంకటేశ్, బండామసీదు ముత వల్లీ జిలాన్‌బాషా, మైనార్టీ నాయకులు రహాంతుల్లా, ఆయాబ్, ముష్కిన్, రియాజ్ తదితరులు పాల్గొన్నారు. ‘వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడండి’ తాడిపత్రి టౌన్: పట్టణంలోని వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించాలని బీజేపీ రాష్ట్ర ప్రత్యేక ఆహ్వానిత సభ్యుడు ప్రతాపరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పట్టణంలో అధికార పార్టీ నాయకుల అండతో అన్యాక్రాంతమైన వక్ఫ్ ఆస్తులను కాపాడాలన్నారు. ఇందుకు బాధ్యులైనవారిపై చర్య తీసుకోవాలని కలెక్టర్‌ను కోరనున్నామన్నారు. -
విద్యుత్ చౌర్యంపై కొరడా ఓ వ్యక్తికి రిమాండ్
చేవెళ్ల,న్యూస్‌లైన్: విద్యుత్ చౌర్యానికి పాల్పడిన ఓ వ్యక్తిని విజిలెన్స్ అధికారులు శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. చేవెళ్ల ఏడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ విజిలెన్స్ సీఐ చేబ్రోలు లక్ష్మీనారాయణ వివరాలు వెల్లడించారు. మండల పరిధిలోని ఆలూరు గ్రామానికి చెందిన అంకన్నగారి అనంతరాములు ఇంటికి అక్రమంగా విద్యుత్ వాడుకుంటుండగా గత ఏప్రిల్ 29న అప్పటి డివిజన్ ఏడీ రామకృష్ణారెడ్డి కేసునమోదు చేసి రూ. 1000 జరిమా నా విధించారు. కాగా అకస్మాతుగా ఈనెల 26వతేదీన విద్యుత్ అధికారు లు జరిపిన ఆకస్మిక తనిఖీలో అతను మళ్లీ విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో రెండోసారి విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ అనంతరాములు పట్టుబడటంతో విజిలెన్స్ అధికారులు అరెస్టుచేసి కోర్టుకు హాజరుపర్చారు. కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ విద్యుత్ డీఈఈ సాంబశివరావు, ఏడీ అశోక్‌రావు, ఏఈ మహేశ్వర్, విద్యుత్ విజిలెన్స్ ఎస్ఐ మల్లయ్య, కానిస్టేబుల్ జహంగీర్, హోంగార్డులు శ్రీనివాస్‌రెడ్డి, గురువయ్యపాల్గొన్నారు. ఉపేక్షించేదిలేదు విద్యుత్ అక్రమంగా వాడుకున్నా, చౌర్యానికి పాల్పడినా ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని జిల్లా సౌత్ విభాగం విద్యుత్ సీఐ చేబ్రోలు లక్ష్మీనారాయణ తెలిపారు. ఎస్పీ మురళీధరరావు ఆదేశాలమేరకు ఐదు టీంలద్వారా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత్‌ను అక్రమంగా వాడి కేసులు నమోదైన వ్యక్తులకు ప్రభుత్వ పథకాల లబ్ధికూడా నిలిపివేయటం జరుగుతుందని ఆయన చెప్పారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడుతూ ఒకసారి దొరికితే జరిమానా విధిస్తామని, రెండోసారి అదే వ్యక్తి దొరికితే తప్పనిసారిగా కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తామన్నారు. ఆలూరుకు చెందిన అంకన్నగారి అనంతరాములు రెండోసారి దొరికినందునే కేసునమోదుచేశామని స్పష్టంచేశారు. విద్యుత్ చౌర్యం నేరమనే విషయాన్ని మరింత విస్తృతంగా ప్రచారం చేయటానికి గ్రామా ల్లో త్వరలో లీగల్ ఎయిడ్ క్యాంపులు నిర్వహిస్తామని వివరించారు. విద్యుత్ అధికారులు, సిబ్బందిగాని అవినీతి, అక్రమాలకు పాల్పడినట్లు సరైన, నిర్ధిష్టమైన ఆధారాలు ఉంటే ఫోన్: 040-23431007 నంబర్‌కు ఫ్యాక్స్ చేయాలని సూచించారు. -
అధికారులతో విద్యార్థుల వాగ్వాదం
ఎస్కేయూ, న్యూస్‌లైన్: వర్సిటీ వసతి గృహాల్లో విద్యార్థులకు గదులు కేటాయింపు సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు గదులు లేక ఇబ్బందులు పడుతున్నామంటూ పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులు వివిధ రూపాల్లో రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. అయినా అధికారులు స్పందించడంలేదని వారు ఆరోపిస్తున్నారు. నాలుగు రోజుల కిందట వీసీ రామకృష్ణారెడ్డిని విద్యార్థులు ఘెరావ్ చేశారు. ఆ సమయంలో సోమవారం లోపు ప్రతి ఒక్క విద్యార్థికి వసతి సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినా ఫలితం లేదని విద్యార్థులు తెలి పారు. సోమవారం మధ్యాహ్నం ప్రిన్సిపాల్ ఫణీశ్వరరాజు, వార్డన్ రంగస్వామి, స్టూడెంట్ అఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జయరాజ్‌లు మహానంది వసతి గృహానికి చేరుకొని గదులులేని విద్యార్థుల పేర్లు నమోదు చేసుకున్నారు. అనంతరం ప్రతి గదికి వెళ్లిన ముగ్గురున్న చోట ఒకరికి చోటు కల్పించేందుకు సమాయత్తమయ్యారు. అయితే విద్యార్థులు మాత్రం కోర్సుల వారీగా గదులు కేటాయించాలని, లేనిపక్షంలో తమకు అవసరం లేదని తేల్చిచెప్పారు. ఈ సమయంలో రిజిస్ట్రార్ గోవిందప్ప హాస్టల్‌కు రావడంతో గదులు కేటాయించేందుకు ఎన్ని రోజులు కావాలంటూ ఆయనను నిలదీశారు. వసతిగృహాల విద్యార్థుల బాగోగులు చూడలేని అధికారులు పదవులకు రాజీనామాలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో వార్డన్ రంగస్వామి పదవికి రాజీనామా చేసినట్లు పేపర్‌పై సంతకం చేసి రిజిస్ట్రార్‌కు ఇవ్వగా ఆయన తిరస్కరించారు. నాన్బోర్డర్లను అధికారులే ప్రోత్సహిస్తున్నారని విద్యార్థులు మండిపడ్డారు. గదులు లేనివారికి ఇప్పుడే కేటాయించాలని లేనిపక్షంలో ఇక్కడి నుంచి వెళ్లనిచ్చేది లేదని అడ్డుకున్నారు. రాత్రి వరకూ ఆందోళన కొనసాగింది. -
వర్సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం చిన్నచూపు
ఎస్కేయూ, న్యూస్‌లైన్: కరువు ప్రాంతంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవి ద్యాలయంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోం దని, అవసరమైన నిధులు లేక వర్సిటీ అభివృద్ధి కుం టుపడుతోందని వీసీ రామకృష్ణారెడ్డి అన్నారు. తన చాంబర్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్సిటీలో పరిపాలనాపరంగా అనేక దీర్ఘకాళిక సమస్యలున్నాయన్నారు. పాలక మండలి సభ్యులు లేకపోవడంతో త్వరితగతిన ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నామన్నారు. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాథమిక దశలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయన్నారు. అనంత ప్రాజెక్టుకు మంజూరు చేసే రూ.వేల కోట్లలో ఎస్కేయూకు ఏడాదికి రూ.5 కోట్లు మంజూరు చేస్తే కొంత వరకు వర్సిటీని అభివృద్ధి చేయవచ్చునన్నారు. జిల్లాలో 30 ఏళ్ల నుంచి ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు ఏనాడు వర్సిటీపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. సిబ్బందికి చెల్లించే వేతనాలకు రూ.46 కోట్లు నిధులు ఖర్చవుతున్నాయి. ప్రభుత్వం కేవలం రూ.33 కోట్ల గ్రాంటు మాత్రమే మంజూరు చేస్తోందన్నారు. ఇతర యూనివర్సిటీలకు అధ్యాపక నియామకాలను మంజూరు చేసిన ప్రభుత్వం ఎస్కేయూపై చిన్నచూపు చూడడం దారుణమన్నారు. ప్రతి ఏడాది తీవ్ర నీటి ఎద్దడితో అనేక సమస్యలు ఎదుర్కొం టున్నామన్నారు. రూ.10 కోట్లు మంజూరు చేస్తే హం ద్రీనీవా నీరు పైపులైన్ ద్వారా నేరుగా ఎస్కేయూకు వ చ్చేలా ఏర్పాటు చేయవచ్చునన్నారు. కరువు ప్రాం త అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.వేల కోట్లలో వర్సిటీకి కేవలం 10 శాతం నిధులు కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఇదిలా ఉండగా దక్షిణా కొరియా ‘సుగ్ క్యియన్ క్వాన్’ వర్సిటీలో ఈ నెల 28 నుంచి నవంబర్ 4 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు తాను హాజరవుతున్నట్లు వీసీ తెలిపారు. ‘క్రైసిస్ ఇన్ క్వాలిటీ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై ప్రసంగించనున్నట్లు ఆయన వెల్లడించారు. -
ఆర్‌వైకే కింద ఉచిత శిక్షణ
కడప సిటీ, న్యూస్‌లైన్ : రాజీవ్ యువకిరణాలు (ఆర్‌వైకే) కింద యువతీయువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆపిట్లో జిల్లా సమన్వయ కర్త రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఈజీఎంఎం, డీఆర్డీఏ ద్వారా పట్టణ ప్రాంతాలలో మెప్మా, ఐకేపీ. అపిట్కో సంస్థల ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రీప్రైమరీ టీచర్ ట్రైనింగ్ (టెన్త్) నర్సింగ్ అసిస్టెంట్(మహిళలకు మాత్రమే టెన్త్) మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (టెన్త్) ఇండస్ట్రియల్ హెల్పర్స్ (8వ తరగతి) కష్టమర్రిలేషన్స్, సేల్స్ సర్వీసెస్ (టెన్త్) ప్యాటరన్ మేకింగ్/ డ్రస్ డిజైనింగ్ (మైనార్టీలకు మాత్రమే) రెడీమేడ్ గార్మెంట్స్(8వతరగతి) అనే కోర్సులలో శిక్షణ ఇస్తున్నామన్నారు. వీరికి ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామన్నారు. శిక్షణ కాలంలో గ్రామీణ ప్రాంతాల వారికి ఉచిత భోజననం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. 18-35 సంవత్సరాల వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పొందగోరేవారు పదవతరగతి, ఇంటర్ మార్కులిస్ట్, ఎనిమిదవతరగతి టీసీతో పాటు మూడు ఫొటోలు అందజేయాలన్నారు. వివరాలకు జిల్లా కోఆర్డినేటర్, డోర్ నంబర్ 1/2237, ఎంఐజీ, 23ఏ మేడపైన, ప్రసాద్ గ్యాస్ సమీపంలో రైల్వేస్టేషన్ రోడ్డు, కడప అనే చిరునామాలో సంప్రదించాలన్నారు. వివరాలకు 94414 96899, 94914 17490 నంబర్లలో సంప్రదించాలన్నారు.