ఎస్కేయూ, న్యూస్‌లైన్: కరువు ప్రాంతంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవి ద్యాలయంపై రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తోం దని, అవసరమైన నిధులు లేక వర్సిటీ అభివృద్ధి కుం టుపడుతోందని వీసీ రామకృష్ణారెడ్డి అన్నారు. తన చాంబర్‌లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్సిటీలో పరిపాలనాపరంగా అనేక దీర్ఘకాళిక సమస్యలున్నాయన్నారు. పాలక మండలి సభ్యులు లేకపోవడంతో త్వరితగతిన ఏ నిర్ణయమూ తీసుకోలేకపోతున్నామన్నారు. దీనివల్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాథమిక దశలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయన్నారు. అనంత ప్రాజెక్టుకు మంజూరు చేసే రూ.వేల కోట్లలో ఎస్కేయూకు ఏడాదికి రూ.5 కోట్లు మంజూరు చేస్తే కొంత వరకు వర్సిటీని అభివృద్ధి చేయవచ్చునన్నారు.
జిల్లాలో 30 ఏళ్ల నుంచి ఎన్నికవుతున్న ప్రజాప్రతినిధులు ఏనాడు వర్సిటీపై దృష్టి సారించకపోవడం బాధాకరమన్నారు. సిబ్బందికి చెల్లించే వేతనాలకు రూ.46 కోట్లు నిధులు ఖర్చవుతున్నాయి. ప్రభుత్వం కేవలం రూ.33 కోట్ల గ్రాంటు మాత్రమే మంజూరు చేస్తోందన్నారు. ఇతర యూనివర్సిటీలకు అధ్యాపక నియామకాలను మంజూరు చేసిన ప్రభుత్వం ఎస్కేయూపై చిన్నచూపు చూడడం దారుణమన్నారు. ప్రతి ఏడాది తీవ్ర నీటి ఎద్దడితో అనేక సమస్యలు ఎదుర్కొం టున్నామన్నారు.
రూ.10 కోట్లు మంజూరు చేస్తే హం ద్రీనీవా నీరు పైపులైన్ ద్వారా నేరుగా ఎస్కేయూకు వ చ్చేలా ఏర్పాటు చేయవచ్చునన్నారు. కరువు ప్రాం త అభివృద్ధికి ప్రభుత్వం మంజూరు చేస్తున్న రూ.వేల కోట్లలో వర్సిటీకి కేవలం 10 శాతం నిధులు కూడా ఇవ్వకపోవడం ఆశ్చర్యకరమన్నారు. ఇదిలా ఉండగా దక్షిణా కొరియా ‘సుగ్ క్యియన్ క్వాన్’ వర్సిటీలో ఈ నెల 28 నుంచి నవంబర్ 4 వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సుకు తాను హాజరవుతున్నట్లు వీసీ తెలిపారు. ‘క్రైసిస్ ఇన్ క్వాలిటీ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఇన్ హయ్యర్ ఎడ్యుకేషన్’ అనే అంశంపై ప్రసంగించనున్నట్లు ఆయన వెల్లడించారు.
వర్సిటీ అభివృద్ధిపై ప్రభుత్వం చిన్నచూపు
Published Sun, Oct 27 2013 3:26 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement