మర్డర్ మిస్టరీ
మర్డర్ మిస్టరీ
Published Mon, Feb 3 2014 10:52 PM | Last Updated on Sun, Apr 7 2019 4:37 PM
మర్డర్ మిస్టరీ మూవీస్‌కి చాలా క్రేజ్ ఉంటుంది. ఈ తరహా చిత్రాలను సరైన రీతిలో తెరకెక్కిస్తే మాత్రం ప్రేక్షకాదరణ గ్యారంటీ అని గత చరిత్ర చెబుతోంది. ‘‘మా సినిమా కచ్చితంగా విజయాన్నే అందుకుంటుంది’’ అంటున్నారు బి. రామకృష్ణారెడ్డి. తమిళంలో పిజ్జా, విల్లా వంటి సూపర్ హిట్స్ నిర్మించిన సీవీ కుమార్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘తేగిడి’. ఈ చిత్రం అనువాద హక్కులను శ్రేయాస్ మీడియాతో కలిసి పుష్యమి ఫిలిం మేకర్స్ అధినేత రామకృష్ణారెడ్డి పొందారు. తెలుగు సినిమాకి టైటిల్ ఖరారు చేయలేదు. రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ -‘‘ఆసక్తికరమైన కథతో సాగే మర్డర్ మిస్టరీ ఇది. ఆరంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేస్తుంది. ఇప్పటికే తమిళ వెర్షన్ నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. ఈ నెల రెండోవారంలో పాటలను, నెలాఖరున సినిమాని రిలీజ్ చేస్తాం’’ అన్నారు. అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం: నివాస్ ప్రసన్న, సహనిర్మాత: వెంకటరమణ, సమర్పణ: బి.సుధారెడ్డి, నిర్మాతలు: బి. రామకృష్ణారెడ్డి, గుడ్ ఫ్రెండ్స్.
Advertisement
Advertisement