రాజీవ్ యువకిరణాలు (ఆర్‌వైకే) కింద యువతీయువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆపిట్లో జిల్లా సమన్వయ కర్త రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
కడప సిటీ, న్యూస్‌లైన్ : రాజీవ్ యువకిరణాలు (ఆర్‌వైకే) కింద యువతీయువకులకు వివిధ కోర్సులలో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆపిట్లో జిల్లా సమన్వయ కర్త రామకృష్ణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ఈజీఎంఎం, డీఆర్‌డీఏ ద్వారా పట్టణ ప్రాంతాలలో మెప్మా, ఐకేపీ.
అపిట్కో సంస్థల ద్వారా శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రీప్రైమరీ టీచర్ ట్రైనింగ్ (టెన్త్) నర్సింగ్ అసిస్టెంట్(మహిళలకు మాత్రమే టెన్త్) మెడికల్ ల్యాబ్ టెక్నిషియన్ (టెన్త్) ఇండస్ట్రియల్ హెల్పర్స్ (8వ తరగతి) కష్టమర్‌రిలేషన్స్, సేల్స్ సర్వీసెస్ (టెన్త్) ప్యాటరన్ మేకింగ్/ డ్రస్ డిజైనింగ్ (మైనార్టీలకు మాత్రమే) రెడీమేడ్ గార్మెంట్స్(8వతరగతి) అనే కోర్సులలో శిక్షణ ఇస్తున్నామన్నారు.
వీరికి ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తామన్నారు. శిక్షణ కాలంలో గ్రామీణ ప్రాంతాల వారికి ఉచిత భోజననం, వసతి సౌకర్యం కల్పిస్తామన్నారు. 18-35 సంవత్సరాల వారు ఈ శిక్షణకు అర్హులన్నారు. శిక్షణ పొందగోరేవారు పదవతరగతి, ఇంటర్ మార్కులిస్ట్, ఎనిమిదవతరగతి టీసీతో పాటు మూడు ఫొటోలు అందజేయాలన్నారు. వివరాలకు జిల్లా కోఆర్డినేటర్, డోర్ నంబర్ 1/2237, ఎంఐజీ, 23ఏ మేడపైన, ప్రసాద్ గ్యాస్ సమీపంలో రైల్వేస్టేషన్ రోడ్డు, కడప అనే చిరునామాలో సంప్రదించాలన్నారు. వివరాలకు 94414 96899, 94914 17490 నంబర్లలో సంప్రదించాలన్నారు.