
సాక్షి, గుంటూరు : రాజధాని విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గురువారం స్పందించారు. ‘నాలుగు రోజులుగా నా వ్యక్తిగత పనులపై తిరుగుతున్నాను. మా ఇంట్లో త్వరలో ఒక పెళ్లి జరగబోతోంది. ఆ పని మీద కాస్త బిజీగా ఉన్నాను. చంద్రబాబు గత నలభై ఏళ్లుగా కుప్పంలో కనపడడం లేదని అక్కడి ప్రజలు ఫిర్యాదు చేశారు. చంద్రబాబు ముందుగా వారికి సమాధానం చెప్పాలి. నేను రైతుల కోసం చాలా పోరాటాలు చేశాను. ఇప్పుడు కూడా వైఎస్సార్‌సీపీ రైతుల పక్షాన నిలబడుతుంది. సాయంత్రం జరిగే మీటింగ్‌లో అన్ని వివరాలు వెల్లడిస్తామ’ని ఎమ్మెల్యే పేర్కొన్నారు.