![ysrcp leader jakkampudi raja warning to bjp mla ramakrishna reddy](/styles/webp/s3/article_images/2024/08/8/ysrcp-leader-jakkampudi_0.jpg.webp?itok=Pc7ckgJP)
సాక్షి, తూర్పుగోదావరి: తూర్పుగోదవరి జిల్లాలో బిక్కవోలు మండలం ఇల్లపల్లిలో వైఎస్సార్‌సీపీ సర్పంచ్ లొల్ల భద్రంను గుర్తుతెలియని దుండగులు కిడ్నాప్ కి ప్రయత్నించారు. కారులో తీసుకెళ్తుండగా కేకలు వేయగా గ్రామస్తులు.. కిడ్నాపర్లను పట్టుకుని దేహశుద్ధి చేయడంతో సర్పంచ్ క్షేమంగా బయట పడ్డారు. దండగుల పెనుగులాటలో సర్పంచ్‌కి గాయాలు అయ్యాయి. దీంతో ఆయన్ను అనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి వైఎస్ఆర్సిపి నేత గూడూరు శ్రీనివాస్ ఇల్లపల్లి సర్పంచ్‌ను పరామర్శించారు. అనంతరం జక్కంపూడి రాజా మీడియాతో మాట్లడారు. ‘‘ కూటమి ప్రభుత్వం దాడులు పెచ్చు మీరుతున్నాయి. ఇల్లపల్లిలో ప్రజలే తిరగబడి సర్పంచును కాపాడుకున్నారు. ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది. అనపర్తిలో మరొక్క హింస పక్క సంఘటన చోటుచేసుకున్నా ఊరుకునేది లేదు. వేలాదిగా ప్రజలతో కలిసి బీజేపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఇంటిని ముట్టడిస్తాం. అధికారం శాశ్వతం కాదు’’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment