ఏజీతో మంత్రి హరీశ్‌రావు భేటీ | Minister Harish Rao meeting with AG | Sakshi
Sakshi News home page

ఏజీతో మంత్రి హరీశ్‌రావు భేటీ

Published Sat, Oct 29 2016 2:56 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

ఏజీతో మంత్రి హరీశ్‌రావు భేటీ - Sakshi

ఏజీతో మంత్రి హరీశ్‌రావు భేటీ

సాక్షి, హైదరాబాద్: నీటి పారుదల, శాసనసభా వ్యవహారాల మంత్రి టి.హరీశ్‌రావు అసెంబ్లీలోని తన కార్యాలయంలో అడ్వకేట్ జనరల్ (ఏజీ) రామకృష్ణారెడ్డితో శుక్రవారం భేటీ అయ్యారు. డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, శాసనసభా కార్యదర్శి రాజా సదారాం కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంలో ఈ నెల 8 కల్లా తెలపాలని స్పీకర్‌ను సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో హరీశ్ ఏజీతో సమావేశమైనట్లు సమాచారం.

ఈ వ్యవహారంలో ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకునేందుకు, అవసరమైన న్యాయ సలహా తీసుకునేందుకు ఏజీని అసెంబ్లీకి పిలిపించినట్లు తెలుస్తోంది. కాగా, స్పీకర్ మధుసూదనచారి స్థానికంగా లేకపోవడంతో ఈ భేటీకి హాజరుకాలేదు. అయితే స్పీకర్ కూడా ఇప్పటికే ఏజీని న్యాయ సలహా కోరినట్లు సమాచారం. ఇలాంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఇతర రాష్ట్రాల స్పీకర్లు తీసుకున్న నిర్ణయాలు, వ్యవహరించిన తీరును తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement