ఆ సలహా నేనే ఇచ్చా! - హీరో శ్రీకాంత్ | I gave that advice! - Srikanth | Sakshi
Sakshi News home page

ఆ సలహా నేనే ఇచ్చా! - హీరో శ్రీకాంత్

Mar 21 2016 2:31 AM | Updated on Sep 3 2017 8:12 PM

ఆ సలహా నేనే ఇచ్చా! - హీరో శ్రీకాంత్

ఆ సలహా నేనే ఇచ్చా! - హీరో శ్రీకాంత్

‘‘గతంలో నాతో ‘వీడికి దూకుడెక్కువ’ చిత్రాన్ని బెల్లం రామకృష్ణా రెడ్డి నిర్మించారు.

‘‘గతంలో నాతో ‘వీడికి దూకుడెక్కువ’ చిత్రాన్ని బెల్లం రామకృష్ణా రెడ్డి నిర్మించారు. సినిమాపై ఆయనకున్న ఆసక్తిని చూసి, దర్శకునిగా మారమని నేనే సలహా ఇచ్చా. అన్నట్లుగానే ఆయన ఇప్పుడు ‘దృశ్యకావ్యం’ చిత్రంతో దర్శకుడయ్యారు’’ అని హీరో శ్రీకాంత్ అన్నారు. రామ్ కార్తీక్, కశ్మీరా కులకర్ణి జంటగా బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణారెడ్డి నిర్మించిన ‘దృశ్యకావ్యం’ ఇటీవల విడుదలైంది. ఈ చిత్రం సక్సెస్ మీట్‌ను చిత్రబృందం హైదరాబాద్‌లో నిర్వహించింది.

రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ,  ‘‘ దర్శకుడిగా చేసిన మొదటి ప్రయత్నాన్ని ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’’ అన్నారు. చిత్రం హీరో, హీరోయిన్లు, కెమేరామ్యాన్ సంతోష్ శానమోని, సంగీత దర్శకుడు ‘ప్రాణం’ కమలాకర్, ఎడిటర్ నాగిరెడ్డి  తదితరులు  మాట్లాడారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement