ఆ ప్రశంసలతో మా కష్టాన్ని మర్చిపోయాం | Actor Srikanth in Idhe Maa Katha Success meet | Sakshi
Sakshi News home page

Idhe Maa Katha: ఆ ప్రశంసలతో మా కష్టాన్ని మర్చిపోయాం – సుమంత్‌ అశ్విన్‌

Published Tue, Oct 5 2021 10:49 AM | Last Updated on Tue, Oct 5 2021 10:50 AM

Actor Srikanth in Idhe Maa Katha Success meet - Sakshi

‘‘చాలా రోజుల తర్వాత మంచి విజయం దక్కింది. సినిమా చూసినవారు బాగుందని అభినందిస్తున్నారు. దర్శకుడు గురు బాగా తీశారు’’ అన్నారు శ్రీకాంత్‌. సుమంత్‌ అశ్విన్, శ్రీకాంత్, భూమిక, తాన్యా హోప్‌ ప్రధాన పాత్రధారులుగా జి. మహేష్‌ నిర్మాణంలో గురు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘ఇదే మా కథ’. ఈ నెల 2న విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం పేర్కొంది. 

ఈ సందర్భంగా విలేకర్ల సమావేశంలో సుమంత్‌ అశ్విన్‌ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డాం. ప్రేక్షకుల ప్రశంసలు మా కష్టాన్ని మర్చిపోయేలా చేస్తున్నాయి’’ అన్నారు. ‘‘మౌత్‌ పబ్లిసిటీతో ముందుకు వెళ్తున్నందువల్లే మా సినిమా సక్సెస్‌మీట్‌ను ఎమోషనల్‌ హిట్‌ అంటున్నాం. ‘మార్నింగ్‌ సినిమా చూశాను... ఈవెనింగ్‌ మా ఫ్యామిలీని కూడా తీసుకుని వెళ్లి సినిమా చూపించాను’ అని ఒకరు ఫోన్‌ చేసి చెప్పారు’’ అన్నారు గురు. ‘‘ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని ఈ చిత్రాన్ని పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చాం. సినిమా చూసినవారు ఎమోషనల్‌గా కనెక్ట్‌ అవుతున్నారు’’ అన్నారు జి. మహేశ్‌.

చదవండి: ‘ఇదే మా కథ’ మూవీ రివ్యూ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement