చిన్నారిపై టీచర్ లైంగిక దాడి | Teacher sexual assault on child | Sakshi
Sakshi News home page

చిన్నారిపై టీచర్ లైంగిక దాడి

Feb 22 2016 1:38 PM | Updated on Oct 16 2018 3:12 PM

చిన్నారిపై టీచర్ లైంగిక దాడి - Sakshi

చిన్నారిపై టీచర్ లైంగిక దాడి

చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాలపై దాడికి దిగారు.

చిన్నారిపై ఉపాధ్యాయుడు లైంగిక దాడికి పాల్పడటంతో బాలిక తల్లిదండ్రులు పాఠశాలపై దాడికి దిగారు. బస్సులను తగులబెట్టి, ఫర్నిచర్‌ను ధ్వంసంచేశారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఈ ఘటన మెదక్ జిల్లా మిర్‌దొడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. మిర్‌దొడ్డిలోని వికాస్ ప్రైమరీ స్కూలులో కుమార్(22) అనే వ్యక్తి పీఈటీగా పనిచేస్తున్నాడు. అతడు స్కూల్‌లో చదువుకునే ఆరేళ్ల బాలికపై కొన్ని రోజులుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు.

రెండు రోజుల క్రితం ఆ విషయం తల్లిదండ్రుల దృష్టికి వచ్చింది. దీంతో వారు దుబ్బాక సీఐ రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేశారు. సోమవారం బంధువుల తో కలసి పాఠశాలకు చేరుకుని సిబ్బందిపై దాడికి యత్నించారు. ఆవరణలోని రెండు పాఠశాల బస్సులను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. పాఠశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. అనంతరం మిర్‌దొడ్డి ప్రధాన జంక్షన్‌లో రాస్తారోకోకు దిగారు.

విషయం తెలిసి సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌గౌడ్ అక్కడికి చేరుకుని వారికి నచ్చజెప్పి, పంపేశారు. కాగా, ఈ ఘటనపై విచారణ జరిపేందుకు డిప్యూటీ డీఈవో శ్యాంప్రసాద్‌రెడ్డి కూడా అక్కడికి చేరుకున్నారు. పూర్తి విచారణ జరిపి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆయన తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement