వరంగల్ లీగల్ : అడవిలో ఒంటరిగా పని చేస్తున్న మహిళను బెదిరించి లైంగికదాడికి పాల్పడిన నేరం రుజువు కావడంతో తాడ్వా యి మండలం మేడారం గ్రామానికి చెందిన నేరస్తుడు ఆలకుంట్ల కుమార్‌కు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.3000 జరిమానా విధిస్తూ బుధవారం ఏడో అదనపు జిల్లా కోర్టు జడ్జి ఎన్.సాల్మన్‌రాజు తీర్పు వెల్లడించారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం.. మంగపేట మండలం కోమటిపల్లి గ్రామానికి చెందిన యువతీయువకుడు ప్రేమ వివాహం చేసుకున్నారు. బతుకుదెరువుకోసం తాడ్వాయి మండలం మేడారం గ్రామానికి వచ్చి శివారులో గుడిసె వేసుకుని ఉంటున్నారు. 2009 నవంబర్ 12న భర్త బియ్యం కోసం వెళ్లగా, ఆమె చింతల్ గ్రామం వైపు వెళ్లే రోడ్డుపక్కన అడవిలో ఎర్రమట్టి తవ్వడానికి వెళ్లింది.
ఒం టరిగా ఉన్న సదరు మహిళ వద్దకు ఆలకుంట్ల కుమార్ చేతిలో గొడ్డలి పట్టుకుని వెళ్లాడు. ఆమెను బెదిరించి తన వెంట తెచ్చుకున్న కండువా నోట్లో కుక్కి తాడుతో చేతులు కట్టేసి లైంగికదాకి పాల్పడ్డాడు. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన వారు రావడం గమనించిన నేరస్తుడు పారిపోయా డు. మూడు రోజుల తర్వాత బాధితురాలు తాడ్వాయి పోలీసుల కు ఫిర్యాదు చేసింది. విచారణలో సాక్ష్యాధారాలను పరిశీలించిన కోర్టు నేరం రుజువైనందున నేర స్తుడు కుమార్‌కు ఐపీసీ సెక్షన్ 376 కింద ఏడేళ్ల జైలు శిక్ష ,రూ.3000 జరిమానా విధిస్తూ జడ్జి సాల్మన్‌రాజు తీర్పు ఇచ్చారు. జరిమాన చెల్లించకుంటే మరో 6 నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు లో పేర్కొన్నారు. కేసును అప్పటి ములుగు డీఎస్పీ ఎం.దయానందరెడ్డి పరిశోధించగా సీఐ కిషోర్‌కుమార్, ఎస్సై సాంబ మూర్తి నేరస్తుడిని కోర్టులో హాజరుపర్చారు. లైజన్ ఆఫీసర్ వి.రఘుపతిరెడ్డి విచారణను పర్యవేక్షించగా, సాక్షులను కానిస్టేబుల్ కె.రాజేందర్ కోర్టులో ప్రవేశపెట్టారు. కేసును పీపీ రఫత్ వాదించారు.
లైంగిక దాడి కేసులో ఒకరికి ఏడేళ్ల జైలు
Published Fri, Jan 2 2015 1:42 AM | Last Updated on Mon, Jul 23 2018 9:13 PM
Advertisement
Advertisement