మెదక్‌లో దారుణం: లిఫ్ట్ ఇస్తామని చెప్పి... | Sexual assault on women in medak over bike lift | Sakshi
Sakshi News home page

మెదక్‌లో దారుణం: లిఫ్ట్ ఇస్తామని చెప్పి...

Published Wed, Oct 12 2016 10:23 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

Sexual assault on women in medak over bike lift

దుండిగల్: బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన ఓ గుర్తు తెలియని వ్యక్తి గృహిణిపై లైంగిక దాడికి పాల్పడిన సంఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం, నార్సింగి గ్రామానికి చెందిన భార్యాభర్తలు కొన్ని సంవత్సరాల క్రితం నగరానికి వలస వచ్చి డీపోచంపల్లి లో నివాసముంటున్నారు. వీరికి ఏడాది వయసున్న బాబు ఉన్నాడు.

కాగా దసరా పండుగ సందర్భంగా మంగళవారం మేడ్చల్ చెక్‌పోస్టు బాబా కాంటా సమీపంలో ఉన్న తమ తల్లిగారి ఇంటికి వెళ్లారు. భార్యా కుమారుడిని అత్తగారి ఇంటి వద్ద దింపి భర్త తిరిగి డీపోచంపల్లికి వచ్చాడు. అయితే అదే రోజు రాత్రి భర్త ఫోన్ చేయడంతో రాత్రి 9 గంటల సమయంలో కుమారుడిని తీసుకుని మహిళ (22) ఇంటికి వచ్చేందుకు మేడ్చల్ చెక్ పోస్టు వద్ద వేచి ఉంది. ఈ క్రమంలో బైక్‌పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు మీ భర్తతో మాకు పరిచయం ఉందని, మేము కూడా గండిమైసమ్మకు వెళ్తున్నామని, ఆమెను అక్కడ దింపుతామని చెప్పి బైక్ ఎక్చించుకున్నారు.

అక్కడ నుంచి నేరుగా డీపోచంపల్లి గ్రామ పరిధిలోని కంబాల కుంట చెరువు వద్దకు తీసుకువచ్చారు. అక్కడ సదరు గుర్తు తెలియని వ్యక్తులు మద్యం సేవించి మహిళను బెదిరించి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్, రూ. 5వేల నగదును లాక్కున్నారు. అక్కడి నుంచి ఓ వ్యక్తి వెళ్లిపోగా మరో వ్యక్తి ఆమె కొడుకును చెరువులో పడేసి చంపేస్తానని బెదిరించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి ఇంటికి చేరుకున్న గృహిణి జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో బుధవారం బాధితురాలు భర్తతో కలిసి దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బైక్ ఎక్కించుకున్న వ్యక్తి తన పేరు రవి అని చెప్పినట్లు ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement