ఇంజనీరింగ్ కాలేజీలు 2012 నుంచి దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి అన్నారు.
ఇంజనీరింగ్ కాలేజీలు 2012 నుంచి దాటవేత ధోరణి అవలంబిస్తున్నాయని తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి అన్నారు. ఇంజినీరింగ్ కాలేజిల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది లేరు, సౌకర్యాలు కూడా లేవని ఆయన చెప్పారు.
ఏమాత్రం అర్హత లేనివారిని అధ్యాపకులుగా నియమించుకుంటున్నాయని, వాస్తవానికి అక్కడ ప్రిన్సిపల్‌గా పీహెచ్‌డీ, లెక్చరర్లుగా పీజీ పూర్తి చేసిన వారినే నియమించాలని ఆయన తెలిపారు. కాలేజీలు ఇచ్చిన అండర్ టేకింగ్ పత్రాలకే విలువ లేకుండా పోయిందని ఏజీ రామకృష్ణారెడ్డి విమర్శించారు. నాణ్యమైన విద్య లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని ఆయన చెప్పారు.