అనంతపురం స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ హాకీ చాంపియన్‌గా బెంగళూరు యూనివర్సిటీ జట్టు నిలిచింది. అగ్రశ్రేణి జట్లను సైతం మట్టికరిపించి ఊహించని విధంగా ట్రోఫీ కైవసం చేసుకుంది. 20 ఏళ్ల తర్వాత ఆలిండియా ఇంటర్ యూనివర్శిటీ పోటీల్లో ట్రోఫీని గెలవడం విశేషం. అనంత క్రీడా గ్రామంలో శనివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు, పూర్వాంచల్ జట్లు పోటీపడ్డాయి. బెంగళూరు 3-1 గోల్స్ తేడాతో పూర్వాంచల్‌పై విజయం సాధించింది. జట్టులో ఉమేష్, కుషా, బసవరాజ్ చెరో ఒక గోల్, పూర్వాంచల్ తరపున లలిత్ ఉపాధ్యాయ ఒక గోల్ చేశాడు. ఫైనల్ మ్యాచ్‌లో గెలవగానే బెంగళూరు జట్టు ఆనందానికి హద్దు లేకుండా పోయింది. క్రీడాకారులు మైదానంలో కేరింతలు, అరుపులతో హోరెత్తించారు. స్టేడియం అంతా కలియతిరిగారు.
మూడో స్థానంలో సంబ ల్‌పూర్ : మూడో స్థానం కోసం కాశీవిద్యాపీఠ్‌తో జరిగిన మ్యాచ్‌లో పుట్‌టైంలో ఇరు జట్లు 1-1 గోల్స్ చేశాయి. అంపైర్లు పెనాల్టీ షూటౌట్‌కు ఆహ్వానించారు. హోరాహోరీగా జరిగిన మ్యాచ్‌లో సంబ ల్‌పూర్ 7-6 స్కోర్ తేడాతో కాశీవిద్యాపీఠ్‌ను ఓడించి మూడోస్థానాన్ని నిలబెట్టుకుంది.
హాకీకి పూర్వవైభవం తేవాలి : డీజీపీ
జాతీయ క్రీడ హాకీకి పూర్వ వైభవం తీసుకురావాలని డీజీపీ బి.ప్రసాదరావు కోరారు. శనివారం అనంత క్రీడా గ్రామంలో జరిగిన టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విన్నర్‌స బెంగళూరు, రన్నర్‌స పూర్వాంచల్ జట్టును అభినందించి.. బహుమతులందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫాదర్ విన్సెంట్ ఫై్ ఆర్డీటీని స్థాపించి అనేక సేవాకార్యక్రమాలు చేపట్టారని కొనియాడారు. ఆయన మరణానంతరం మాంఛోఫై్ సేవాకార్యక్రమాలను కొనసాగించడంతోపాటు క్రీడాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. జాతీయ స్థాయి మ్యాచ్‌లు ‘అనంత’లో జరగడం హర్షించదగ్గ విషయమన్నారు.
ఎస్కేయూ వీసీ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రెండు వారాలుగా ‘అనంత’లో సౌత్‌జోన్, అఖిల భారత విశ్వవిద్యాలయాల పోటీలు నిర్వహించామన్నారు. ఆర్డీటీ సహకారం మరువలేనిదన్నారు. ఆర్డీటీ ప్రోగ్రాం డెరైక్టర్ మాంఛోఫై మాట్లాడుతూ జీవితంలో క్రీడలు అంతర్భాగం కావాలన్నారు. మంచి క్రీడాకారులను తయారు చేస్తామన్నారు. టోర్నీ నిర్వహణలో కీలకంగా వ్యవహరించిన ఎస్కేయూ స్పోర్ట్స్ డెరైక్టర్ జెస్సీకి డీజీపీ బ్లేజర్ తొడిగారు. కార్యక్రమంలో టోర్నీ డెరైక్టర్‌లు చిన్నపరెడ్డి, కెల్విన్ డీ క్రూజ్, హాకీ సంఘం రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి డాక్టర్ విజయబాబు, ఎన్‌ఐటీ వరంగల్ ఫ్రొఫెసర్ రవికుమార్, ఆర్డీటీ స్పోర్ట్స్ డెరైక్టర్ జేవియర్ తదితరులు పాల్గొన్నారు.
ఆలిండియా హాకీ చాంపియన్ బెంగళూరు
Published Sun, Dec 22 2013 2:36 AM | Last Updated on Fri, Jun 1 2018 8:47 PM
Advertisement
Advertisement