వైఎస్సార్‌ జిల్లాలో విషాదం.. | Sister died after her brother death news | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ జిల్లాలో విషాదం.. అన్నాచెల్లెలు మృతి

Published Sat, Sep 23 2017 11:25 AM | Last Updated on Sat, Sep 23 2017 11:25 AM

Sister died after her brother death news

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా : అన్న మరణవార్త విన్న ఓ చెల్లి గుండెపోటుతో మృతి చెందడంతో శనివారం జిల్లాలోని బద్వేలులో విషాదచాయలు అలుముకున్నాయి. బద్వేలుకు చెందిన ఉపాధ్యాయ ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణారెడ్డి గుండెపోటుతో మృతిచెందారు. రామకృష్ణా రెడ్డి మృతి విషయం తెలుసుకున్న ఆయన చెల్లెలు సుబ్బలక్ష్మీ కూడా గుండెపోటుకు గురై మృతిచెందడంతో వారి కుటుంబంలో విషాదం నెలకొంది.

కాగా... రామకృష్ణారెడ్డి మరణ వార్త తెలుసుకున్న పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నేతలు నివాళులర్పించారు. అలాగే అన్నా చెల్లెలి మధ్య అనురాగం, ఆప్యాయతను పలువురు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement