వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అణగదొక్కేందుకు... పోలీసుల సాయం తీసుకుందామన్న ఆంధ్రప్రదేశ్ మంత్రుల వ్యాఖ్యలపై ఆ పార్టీ మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్లో ఆర్కే మీడియా సమావేశంలో మాట్లాడుతూ.... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి బాటలోనే మంత్రులు పయనిస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్లు, ఐపీఎస్ల్లో కొంతమంది పచ్చచొక్కాలేసుకుంటే మంచిదని సూచించారు. చంద్రబాబు ప్రజలకిచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక వైఎస్ఆర్ సీపీ శ్రేణుల్ని టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీకి ఓట్లేసిన వారికే పనిచేస్తామంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దారణమన్నారు. టిడిపికి ఓట్లేసిన వారికే పనిచేస్తామని జీవో విడుదల చేయండి అంటూ ఎద్దేవా చేశారు. ఇది ప్రజాస్వామ్యమా ? లేక రాచరికమా ? అని ఆర్కే ఈ సందర్భంగా చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు.
Published Sun, May 24 2015 2:42 PM | Last Updated on Wed, Mar 20 2024 1:44 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement