
కల్యాణమస్తు తరహాలో మరో పథకం
కల్యాణమస్తు పథకం తరహాలోనే మరో కొత్త పథకానికి నాంది పలకాలని టీటీడీ ఈవో సాంబశివరావు సంకల్పించారు.
సాక్షి, తిరుమల: కల్యాణమస్తు పథకం తరహాలోనే మరో కొత్త పథకానికి నాంది పలకాలని టీటీడీ ఈవో సాంబశివరావు సంకల్పించారు. పెళ్లి వేడుకల పేరుతో పేద కుటుంబాలకు తిరుమల కల్యాణ వేదిక చేయూత అందించాలని భావిస్తున్నారు. ఇటీవల కల్యాణ వేదికను సందర్శించిన సాంబశివరావు మౌలిక వసతులు పెంచాలని అధికారులను ఆదేశించారు.
‘కల్యాణ వేదికలో పెళ్లి చేసుకునే జంటలకు చేయూత నివ్వాలని భావిస్తున్నాం. ఇప్పటికే కల్పిస్తున్న సౌకర్యాలను పెంచనున్నా’ మని ఆయన తెలిపారు. త్వరలోనే వివాహాలకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ వివరాలను కూడా వెల్లడిస్తామని తెలిపారు.