బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు తారాకాంత్ ఝా కన్నుమూత!
Published Sun, May 11 2014 9:58 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
పాట్నా: బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, ప్రఖ్యాత న్యాయనిపుణుడు తారాకాంత్ ఝూ ఆదివారం పాట్నాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన వయస్సు 80 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఝూ బాధపడుతున్నారు.
బీహార్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలుగా కీలకపాత్ర పోషించిన ఝా.. బీజేపీ వ్యవహారశైలిపై అసంతృప్తితో ఇటీవల భారతీయ జనతా దళ్ (యూ) చేరారు. బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఝాకు జనసంఘ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లతో సన్నిహిత సంబంధాలుండేవి.
పాట్నా హైకోర్టులో సినీయర్ న్యాయవాదైన ఝా.. రాజ్యాంగంలోని ఎనిమిదో షెడ్యూల్ లో మైథిలి భాషను చేర్చడంలో కీలకపాత్రను పోషించారు. ఝా మృతి పట్ల బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్, బీజేపీ సీనియర్ నేతలు, ఇతర రాజకీయ ప్రముఖుల సంతాపం తెలిపారు.
Advertisement
Advertisement