రైలుకు నిప్పంటించబోయారు | Bihar: Arrested JDU MLA Anant Singh's supporters go on rampage, try to torch train | Sakshi
Sakshi News home page

రైలుకు నిప్పంటించబోయారు

Published Thu, Jun 25 2015 5:26 PM | Last Updated on Sun, Sep 3 2017 4:21 AM

రైలుకు నిప్పంటించబోయారు

రైలుకు నిప్పంటించబోయారు

పాట్నా: బీహార్లో తమ నేతను అరెస్టు చేయడంపట్ల జేడీయూ కార్యకర్తలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భౌతికదాడులకు పాల్పడ్డారు. దీంతో వారి చర్యలను పోలీసులు అడ్డుకునే క్రమంలో తొక్కిసలాట కూడా  చేసుకుంది. ఏకంగా రైలుకు నిప్పు పెట్టేందుకు జేడీయూ కార్యకర్తలు తెగబడ్డారు.

హత్య, కిడ్నాప్, నిప్పుపెట్టడంవంటి ఫిర్యాదులతో జేడీయూ నేత ఎమ్మెల్యే అనంత్ సింగ్తోపాటు మరో పన్నెండు మందిని పోలీసులు అరెస్టులు చేశారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు బంద్ కు పిలుపునిచ్చారు. ఇది కాస్త హింసాత్మక రూపం దాల్చడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అప్పటికే కార్యకర్తలు దుకాణాలను మూతపెట్టించేందుకు ఆందోళన చేయడమేకాకుండా సమీప రైల్వే స్టేషన్కు వెళ్లి నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ చర్యలతో రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించి ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement