బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. లాలూ సొంత పార్టీ రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ) నిలువునా చీలిపోయింది. ఆర్జేడీకి ఉన్న 22 మంది ఎమ్మెల్యేల్లో 13 మంది పార్టీకి గుడ్ బై చెప్పారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ) ప్రభుత్వానికి వీరు మద్దతు ప్రకటించారు. ఎమ్మెల్యే సామ్రాట్ చౌదరి నివాసంలో సమావేశమయిన 13 మంది ఎమ్మెల్యేలు ఈ మేరకు గవర్నర్కు లేఖ రాశారు. ఈ విషయాన్ని ఎమ్మెల్యే జావేద్ ఇక్బాల్ అన్సారీ ధ్రువీకరించారు. తిరుబాటు ఎమ్మెల్యేల్లో ఐదుగురు మైనారిటీ వర్గానికి చెందినవారున్నారు.