జితిన్ రామ్ మాంజీ(ఫైల్)
పాట్నా: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో ఉంటున్న బీహార్ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంజీకి సొంతపార్టీ జేడీ(యూ) కళ్లెం వేసింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేయొద్దని ఆయనకు సూచించింది.
అగౌరవపరిచే వ్యాఖ్యలు పార్టీ, నాయకులకు ఇబ్బందికరంగా ఉంటాయని జేడీ(యూ) ప్రధాన కార్యదర్శి కేసీ త్యాగి అన్నారు. పార్టీ కార్యకర్తల నైతికస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని పేర్కొన్నారు. వివాస్పద వ్యాఖ్యలు చేయొద్దని మాంజీకి ఆయన సూచించారు. పార్టీకి నష్టం కలిగించే విధంగా వ్యవహరించొద్దని కోరారు. మాంజీని సీఎం పదవి నుంచి తప్పించే ఉద్దేశం ఉందా అని ప్రశ్నించగా...దీనిపై జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్ నిర్ణయం తీసుకుంటారని త్యాగి సమాధానమిచ్చారు.
కేంద్రం నుంచి నిధులు తీసుకురాకుంటే బీహార్ కు చెందిన కేంద్ర మంత్రులను రాష్ట్రంలో అడుగుపెట్టనీయబోమని మాంజీ బుధవారం వ్యాఖ్యానించారు. అంతకుముందు కూడా ఆయన పలు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.