న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, జేయూయూ నేత శరద్ యాదవ్ గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓ సందర్భంలో నవ్వుతూ కన్పించారు. ఈ పొటోను షేర్ చేసిన బీజేపీ అధికార ప్రతినిధి షహ్‌జాద్ పూనావాలా రాహుల్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఓ వైపు శరద్ యాదవ్ కుటుంబసభ్యులు తీవ్ర దుఃఖంలో ఉంటే, వాళ్ల మధ్యన కూర్చున్న నీకు ఎలా నవ్వు వస్తుందని ధ్వజమెత్తారు. ఓ తపస్విగా చెప్పుకునే రాహుల్ ఇలా ప్రవర్తించడం సరికాదని సెటైర్లు వేశారు. అంతేకాదు 2018లో కర్ణాటక మాజీ సీఎం ఎన్ ధారం సింగ్ సంతాప సభలోనూ రాహుల్ నవ్వుతూ కన్పించారని షెహ్‌జాద్ పూనావాలా పేర్కొన్నారు. పుల్వామా అమరులకు శ్రద్ధాంజలి ఘటించే సమయంలోనూ రాహుల్ ఫోన్ చూసుకుంటూ ఉన్నారని ఫైర్ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా షేర్ చేశారు.
Rahul Gandhi smiling while Sharad Yadav’s family is in tears- certainly not how a Tapasvi would behave
— Shehzad Jai Hind (@Shehzad_Ind) January 13, 2023
Sensitivity demands one acts maturely but then in 2018 Rahul was laughing during Dharam Singh's condolence meet; was busy in phone during Pulwama Shraddhanjali
Some tapasvi! pic.twitter.com/axj2CwS4fR
చదవండి: యువతిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన.. కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment